The Traitors Telugu | ది ట్రైటర్స్ తెలుగు సీజన్ వన్ విన్నర్ ఎవరంటే? – ఇద్దరికి దక్కిన ప్రైజ్‌మనీ
తేజా సజ్జా హోస్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయిన రియాలిటీ గేమ్ షో ది ట్రైటర్స్ తెలుగు సీజన్ వన్ టైటిల్‌ను ఇద్దరు కంటెస్టెంట్స్ కలిసి గెలుచుకున్నారు. శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి విజేతలుగా నిలిచారు. వీరికి దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
Entertainment | Published On Nov 6, 2026, 7.17 pm IST
The Traitors Telugu | టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా హోస్ట్‌గా వ్యవహరించిన ది ట్రైటర్స్ సీజన్ విన్ విన్నర్స్ ఎవరన్నది తేలిపోయింది. టైటిల్‌ను ఇద్దరు కంటెస్టెంట్స్ గెలుచుకున్నారు. వారి ప్రైజ్‌మనీ కూడా రివీలైంది. ట్రైటర్స్ సీజన్ వన్ టైటిల్‌ను శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి కలిసి సొంతం చేసుకున్నారు. ఇద్దరికి కలిపి 42 లక్షల 77 వేల ప్రైజ్‌మనీ దక్కింది.
20 మంది కంటెస్టెంట్స్...
అమెజాన్ ప్రైమ్‌లో టెలికాస్ట్ అయిన రియాలిటీ షోలో మొత్తం 20 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. అక్టోబర్ 15న మొదలైన ఈ షో నాలుగు వారాల పాటు బ్లాక్‌మెయిల్, తప్పుడు అంచనాలు, కంటెస్టెంట్ గొడవలతో ఉత్కంఠభరితంగా సాగింది. చివరి రౌండ్‌లో ఇతర కంటెస్టెంట్స్‌ను అధిగమించిన శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి విజేతలుగా నిలిచారు.
ఇన్నోసెంట్‌గా...
స్వీకర్ ప్రయాణం ఇన్నోసెంట్‌గా మొదలైంది. అయితే రహత్, ఆశికా అతడిని ట్రైటర్‌గా నియమించడంతో గేమ్‌లో అతడి పాత్ర మారిపోయింది. ధనుంజయ ఎప్పటికప్పుడు స్వీకర్‌ను అనుమానిస్తూ వచ్చినా.. అతడు మాత్రం అందరి మధ్యే ఉంటూ తన అసలు రోల్‌ను దాచిపెట్టాడు. శ్రావ్య ప్రయాణం కూడా అంతే అనూహ్యంగా సాగింది. బ్లాక్‌మెయిల్ ద్వారా ఆమె ట్రైటర్స్ టీమ్‌లోకి చేరింది. గేమ్‌లో ఎక్కువ భాగం ట్రైటర్స్‌ను గుర్తించి, వారి అసలు రంగును బయటపెట్టేందుకు ప్రయత్నించింది. చివరలో వారికే పెద్ద షాకిచ్చింది. స్వీకర్, శ్రావ్య కలిసి వర్షను గేమ్ నుంచి బయటకు పంపించిన ఎపిసోడ్ సీజన్ వన్‌కు హైలైట్‌గా నిలిచింది. ఒకానొక టైమ్‌లో స్వీకర్‌ను గేమ్ నుంచి బయటకు పంపించి, ప్రైజ్ మనీ మొత్తం తానే గెలవాలని శ్రావ్య ప్రయత్నించేలా ధనుంజయ వేసిన స్కెచ్ ఫలించలేదు. చివరి వరకు శ్రావ్య స్వీకర్ కలిసికట్టుగానే గేమ్ ఆడారు. .
మూడు ఎపిసోడ్స్
“నేను ప్యాలెస్‌లోకి అడుగుపెట్టినప్పుడు కనీసం మూడు ఎపిసోడ్స్ ఉండాలని అనుకున్నాను. నవ్వులపాలు కాకుండా బయటఅడుగుపెడితే చాలనుకున్నా. ఇంత దూరం వస్తానని అస్సలు ఊహించలేదు.గేమ్‌లో ఎక్కువ భాగం నా ఎమోషన్స్‌ను పక్కనపెట్టాను. . గెలిచినందుకు సంతోషంగా ఉంది. కానీ నిజంగా ఇష్టపడే వ్యక్తులను బాధపెట్టకుండా ఈ విజయం సాధించి ఉంటే బాగుండేదనిపిస్తోంది" అంటూ శ్రావ్య వర్మ చెప్పింది.
సైలెంట్ పర్సన్
స్వీకర్ మాట్లాడుతూ.. “ ట్రైటర్స్‌లో నేను మైండ్ గేమ్ ఆడుతున్నప్పటికీ, కష్టమైన సందర్భాల్లో అందరినీ నా కుటుంబ సభ్యుల్లాగే చూశా. శ్రావ్యను ట్రైటర్‌గా నా వైపు తీసుకురావడం నేను తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. ఒకరిపై ఒకరం పూర్తి నమ్మకం ఉంచుకుంటేనే చివరి వరకు చేరుకోగలమని నాకు తెలుసు. ఫినాలేలో ఆ నమ్మకమే మాకు విజయాన్ని అందించింది. నన్ను అందరూ సైలెంట్ పర్సన్ అన్నారు. కానీ మొదటి రోజు నుంచి ఫైనల్ వరకు నేను ఎప్పుడూ లెక్కలు వేస్తూనే ఉన్నానన్న విషయం వాళ్లకు తెలియదు” అని వెల్లడించాడు.
ఈ షోలో శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తితో పాటు చిన్మయి, ప్రగతి, హర్షవర్ధన్‌తో పాటు పలువురు టీవీ, సోషల్ మీడియా సెలిబ్రిటీలు కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tamannaah | సూర్యాస్తమయం తర్వాత అడవిలో ఆడుగుపెడితే మరణమే – సైలెంట్‌గా ఓటీటీలోకి తమన్నా హారర్ మూవీ
నవంబర్ 6, 2026

OTT | ఇదేం ట్విస్ట్…800 కోట్ల బ్లాక్‌బస్టర్ – రిలీజై నెలకాకముందే ఓటీటీలోకి…
నవంబర్ 5, 2026

Sreeleela | హిట్లు లేకపోయినా తగ్గేదేలే – మళ్లీ బిజీ అవుతోన్న శ్రీలీల
అక్టోబర్ 27, 2026
తాజావార్తలు
- ●GP's Income | గ్రామపంచాయతీల ఖాతాల్లోకే సొంత ఆదాయం!
- ●Kamal Haasan | పోలీసుల రక్షణలో షూటింగ్ - సీఎం సహాయనిరాకరణ - వివాదాస్పద టైటిల్‌తో కమల్‌హాసన్ కొత్త మూవీ
- ●Indiramma Towers | తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక నిర్ణయం
- ●R Limbadri | ఐపీఈ హైదరాబాద్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి
- ●Minister Sridhar Babu | గ్లోబల్ వాల్యూ క్రియేషన్‌కు కేంద్రంగా హైదరాబాద్
- ●Ponnam Prabhakar | బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులకు స్టైపెండ్ పెంపు

GP's Income | గ్రామపంచాయతీల ఖాతాల్లోకే సొంత ఆదాయం!

Kamal Haasan | పోలీసుల రక్షణలో షూటింగ్ - సీఎం సహాయనిరాకరణ - వివాదాస్పద టైటిల్‌తో కమల్‌హాసన్ కొత్త మూవీ

Indiramma Towers | తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక నిర్ణయం

R Limbadri | ఐపీఈ హైదరాబాద్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి



