One-Way | లక్డీకాపూల్‌లో కొత్తగా వన్‌వే!
One-Way | నగరంలో మరో కీలక ట్రాఫిక్ మార్పులకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడే లక్డీకాపూల్ పరిసరాల్లో ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టేందుకు పోలీసులు కొత్తగా వన్‌వే విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. వాహనాల రాకపోకలు సాఫీగా సాగడంతోపాటు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రతిపాదిత మార్గాలను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ శుక్రవారం స్వయంగా బైక్‌పై ఆయా ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు.
- ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టేందుకు పోలీసుల కసరత్తు
- బైక్‌పై క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీపీ సజ్జనార్
- మూడు మార్గాల్లో వాహనాల మళ్లింపునకు ప్రతిపాదనలు
- తొలుత ప్రయోగాత్మకంగా అమలు.. ఆ తర్వాతే తుది నిర్ణయం
One-Way | నగరంలో మరో కీలక ట్రాఫిక్ మార్పులకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడే లక్డీకాపూల్ పరిసరాల్లో ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టేందుకు పోలీసులు కొత్తగా వన్‌వే విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. వాహనాల రాకపోకలు సాఫీగా సాగడంతోపాటు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రతిపాదిత మార్గాలను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ శుక్రవారం స్వయంగా బైక్‌పై ఆయా ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు.
మూడు మార్గాల్లో మళ్లింపులు..

ట్రాఫిక్ జాయింట్ సీపీ డీ జోయెల్ డేవిస్, డీసీపీ అవినాశ్ కుమార్‌తో కలిసి ద్వారకా హోటల్, పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్, హెచ్‌డీఎఫ్‌సీ జంక్షన్, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, లక్డీకాపూల్ చౌరస్తా, ఓల్డ్ కంట్రోల్ రూమ్ జంక్షన్ పరిసరాలను సీపీ పరిశీలించారు. వాహనాల రద్దీ, రహదారుల వెడల్పు, కూడళ్ల వద్ద ఎదురవుతున్న సమస్యలను అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలో మూడు ప్రధాన మార్గాల్లో వాహనాల రాకపోకలను మళ్లించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఓల్డ్ కంట్రోల్ రూమ్ నుంచి సికింద్రాబాద్ వైపులో ప్రస్తుతం రవీంద్రభారతి మీదుగా ఇక్బాల్ మినార్ వైపు వెళ్లే వాహనాలను నేరుగా అనుమతించకుండా.. హెచ్‌డీఎఫ్‌సీ, పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్, ఇక్బాల్ మినార్, సచివాలయం జంక్షన్ మీదుగా మళ్లించనున్నారు.
నిరంకారీ-ఓల్డ్ కంట్రోల్ రూమ్ రూట్‌లో..
నిరంకారీ జంక్షన్ నుంచి ఓల్డ్ కంట్రోల్ రూమ్ వైపు మార్గంలో వచ్చే వాహనాలను నేరుగా హెచ్‌డీఎఫ్‌సీ జంక్షన్ వైపు పంపకుండా పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మళ్లిస్తారు. అక్కడి నుంచి ఇక్బాల్ మినార్ మీదుగా కుడివైపు మలుపు తీసుకుని రవీంద్రభారతి ద్వారా ఓల్డ్ కంట్రోల్ రూమ్‌కు చేరుకునేలా మార్గం ప్రతిపాదించారు. సచివాలయం, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాహనాలను పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వైపు వెళ్లే వాహనాలను నేరుగా అనుమతించకుండా ఇక్బాల్ మినార్ నుంచి రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు. ఓల్డ్ కంట్రోల్ రూమ్ వద్ద యూటర్న్ తీసుకుని అసెంబ్లీ గేట్ నంబర్ 3, రవీంద్రభారతి, హెచ్‌డీఎఫ్‌సీ మీదుగా పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వైపు వెళ్లేలా ప్రతిపాదనలు రూపొందించారు.

ప్రయోగాత్మకంగా అమలు..
ఈ ప్రతిపాదనలపై త్వరలో జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖతో పాటు ఇతర సంబంధిత విభాగాలతో సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత తొలుత ప్రయోగాత్మకంగా వన్‌వే విధానాన్ని అమలు చేస్తామని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పరిశీలించి అనంతరం శాశ్వత అమలుపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. నగరంలోని ఇతర రద్దీ ప్రాంతాల్లోనూ అవసరాన్ని బట్టి వన్‌వే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు శాస్త్రీయ విధానాలను అనుసరిస్తున్నామని, వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.

కేబీఆర్ పార్క్ వద్ద మరో లేన్..
లక్డీకాపూల్ పర్యటన అనంతరం సీపీ సజ్జనర్ ఇప్పటికే వన్‌వే అమల్లో ఉన్న కేబీఆర్ పార్క్ మార్గాన్ని కూడా బైక్‌పై తిరుగుతూ పరిశీలించారు. అక్కడ పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఉన్న వన్‌వే మార్గానికి అదనంగా మరో ట్రాఫిక్ లేన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకు అడ్డంకిగా ఉన్న భూగర్భ పైపులైన్లు, విద్యుత్ స్తంభాలు తదితర యుటిలిటీలను యుద్ధప్రాతిపదికన తరలించేందుకు సంబంధిత శాఖలు చర్యలు తీసుకుంటాయని చెప్పారు. ట్రాఫిక్ విభాగం, జీహెచ్‌ఎంసీ, నిర్మాణ సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నాయని వివరించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●The Traitors Telugu | ది ట్రైటర్స్ తెలుగు సీజన్ వన్ విన్నర్ ఎవరంటే? - ఇద్దరికి దక్కిన ప్రైజ్‌మనీ
- ●GP's Income | గ్రామపంచాయతీల ఖాతాల్లోకే సొంత ఆదాయం!
- ●Kamal Haasan | పోలీసుల రక్షణలో షూటింగ్ - సీఎం సహాయనిరాకరణ - వివాదాస్పద టైటిల్‌తో కమల్‌హాసన్ కొత్త మూవీ
- ●Indiramma Towers | తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక నిర్ణయం
- ●R Limbadri | ఐపీఈ హైదరాబాద్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి
- ●Minister Sridhar Babu | గ్లోబల్ వాల్యూ క్రియేషన్‌కు కేంద్రంగా హైదరాబాద్

The Traitors Telugu | ది ట్రైటర్స్ తెలుగు సీజన్ వన్ విన్నర్ ఎవరంటే? - ఇద్దరికి దక్కిన ప్రైజ్‌మనీ

GP's Income | గ్రామపంచాయతీల ఖాతాల్లోకే సొంత ఆదాయం!

Kamal Haasan | పోలీసుల రక్షణలో షూటింగ్ - సీఎం సహాయనిరాకరణ - వివాదాస్పద టైటిల్‌తో కమల్‌హాసన్ కొత్త మూవీ

Indiramma Towers | తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక నిర్ణయం





