Bigg Boss | భయపెట్టబోతున్న బిగ్‌బాస్ విన్నర్ – హారర్ కామెడీ మూవీతో హీరోగా ఎంట్రీ
బిగ్‌బాస్ తెలుగు విన్నర్ కళ్యాణ్ పడాల హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. ఓ హారర్ కామెడీ మూవీ చేస్తోన్నాడు. ఫన్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ శుక్రవారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమాకు హేమంత్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
Entertainment | Published On Nov 6, 2026, 8.19 pm IST
Bigg Boss | కామన్ మ్యాన్‌గా తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచారు. బిగ్‌బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్‌తో తాజాగా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కళ్యాణ్ పడాల హీరోగా హారర్ కామెడీ మూవీ శుక్రవారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమాకు ఫన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. హేమంత్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
వచ్చే ఏడాది...
ఫన్ మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 12 నుంచి మొదలుకాబోతుంది. నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేసి వచ్చే ఏడాది థియేటర్లలో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామని మేకర్స్ పేర్కొన్నారు. ఈ సినిమాలో సాహితి, అజయ్ ఘోష్, రవి శివ తేజ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. రామ్‌గోపాల్ మ్యూజిక్ అందిస్తున్నారు.
వెనుకబడి...
బిగ్‌బాస్ సీజన్ 9లోకి కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ ఎవరూ ఊహించని విధంగా విజేతగా నిలిచాడు. మొదట్లో టాస్కులతో పాటు ఆటతీరులో వెనుకబడ్డ కళ్యాణ్ ఆ తర్వాత నిజాయితీతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. తనూజ, సుమన్ శెట్టి, భరణి, ఫ్లోరా షైనీ, శ్రష్టీ వర్మ లాంటి పాపులర్ కంటెస్టెంట్స్‌తో పోటీపడి మరీ టైటిల్ గెలిచాడు.
మినీ మూవీ...
బిగ్‌బాస్ తర్వాత నిజమే రుజువైనది పేరుతో ఓ మినీ మూవీ చేశాడు కళ్యాణ్ పడాల. ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైన ఈ మినీ మూవీలో తమిళ బిగ్‌బాస్ కంటెస్టెంట్ వియానా కీలక పాత్ర పోషించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Anaswara Rajan | చిరంజీవి, రవితేజ సినిమాల్లో ఆఫర్స్ – మలయాళ బ్యూటీ రియాక్షన్
నవంబర్ 6, 2026

Ramayana | రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ – ధురంధర్ 2 , టాక్సిక్ కంటే తక్కువే!
నవంబర్ 6, 2026

Scene Movie Review | సూర్య సీన్ రివ్యూ – అంధుడైన హీరో… వంద హత్యలు చేసిన కిల్లర్‌ను ఎలా పట్టుకున్నాడంటే?
నవంబర్ 6, 2026
తాజావార్తలు
- ●Gadwal Vijaya Laxmi | ఫీజులు తీసుకుని సర్టిఫికెట్లు ఆపేస్తారా?.. నల్ల మల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్‌పై విజయలక్ష్మి ఆగ్రహం
- ●Model Schools | మోడల్ స్కూల్ సమస్యలకు మోక్షమెప్పుడు?
- ●Anaswara Rajan | చిరంజీవి, రవితేజ సినిమాల్లో ఆఫర్స్ - మలయాళ బ్యూటీ రియాక్షన్
- ●One-Way | లక్డీకాపూల్‌లో కొత్తగా వన్‌వే!
- ●The Traitors Telugu | ది ట్రైటర్స్ తెలుగు సీజన్ వన్ విన్నర్ ఎవరంటే? - ఇద్దరికి దక్కిన ప్రైజ్‌మనీ
- ●GP's Income | గ్రామపంచాయతీల ఖాతాల్లోకే సొంత ఆదాయం!

Gadwal Vijaya Laxmi | ఫీజులు తీసుకుని సర్టిఫికెట్లు ఆపేస్తారా?.. నల్ల మల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్‌పై విజయలక్ష్మి ఆగ్రహం

Model Schools | మోడల్ స్కూల్ సమస్యలకు మోక్షమెప్పుడు?

Anaswara Rajan | చిరంజీవి, రవితేజ సినిమాల్లో ఆఫర్స్ - మలయాళ బ్యూటీ రియాక్షన్

One-Way | లక్డీకాపూల్‌లో కొత్తగా వన్‌వే!



