Meta Muse | మెటా మ్యూస్‌లో ఇక వాయిస్ చాటింగ్.. మాట్లాడే అవతార్లు కూడా..
Meta Muse | మెటా మ్యూస్ యాప్‌లో రియల్‌టైమ్ వాయిస్ సంభాషణలు, హావభావాలు పలికించే ఏఐ అవతార్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. దీంతో వినియోగదారులు టైప్ చేయకుండానే మాట్లాడడం ద్వారా తమ ఆలోచనలను పంచుకోవచ్చు. ప్రయాణ ప్రణాళికలు, ఉద్యోగ ఇంటర్వ్యూ ప్రాక్టీస్, ప్రజెంటేషన్ల క్రియేషన్ వంటి పనులను వాయిస్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. ఈ ఫీచర్లు తొలుత అమెరికాలో అందుబాటులోకి వస్తున్నాయి.
Technology | Published On Nov 6, 2026, 5.43 pm IST
Meta Muse | మెటా మ్యూస్ యాప్‌లో రియల్‌టైమ్ వాయిస్ సంభాషణలు, హావభావాలు పలికించే ఏఐ అవతార్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. దీంతో వినియోగదారులు టైప్ చేయకుండానే మాట్లాడడం ద్వారా తమ ఆలోచనలను పంచుకోవచ్చు. ప్రయాణ ప్రణాళికలు, ఉద్యోగ ఇంటర్వ్యూ ప్రాక్టీస్, ప్రజెంటేషన్ల క్రియేషన్ వంటి పనులను వాయిస్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. ఈ ఫీచర్లు తొలుత అమెరికాలో అందుబాటులోకి వస్తున్నాయి.
ప్రత్యేకమైన ప్రాంప్ట్ అవసరం లేదు..
మెటా కనెక్ట్ 2026 కార్యక్రమంలో తొలిసారిగా ప్రివ్యూ ఇచ్చిన రియల్‌టైమ్ వాయిస్ సంభాషణల ఫీచర్‌ను ఇప్పుడు మ్యూస్ యాప్‌లో విడుదల చేస్తోంది. వినియోగదారులు ముందుగా ప్రత్యేకమైన ప్రాంప్ట్ సిద్ధం చేసుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా మ్యూస్‌తో మాట్లాడవచ్చు. వారు మాట్లాడుతున్న విషయాన్ని ఏఐ అర్థం చేసుకుంటూ, సంభాషణ కొనసాగుతున్న సమయంలోనే బ్యాక్‌గ్రౌండ్‌లో పనులను పూర్తి చేస్తుంది. ముఖ్యంగా నడుస్తున్నప్పుడు లేదా చేతులు ఇతర పనుల్లో బిజీగా ఉన్నప్పుడు కూడా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఏదైనా నగరానికి వెళ్లేందుకు ప్రయాణ ప్రణాళిక రూపొందించడం, బస చేసేందుకు సరైన ప్రాంతాన్ని ఎంచుకోవడం, ఆహార ఏర్పాట్లు చేసుకోవడం వంటి అంశాలను మ్యూస్‌తో చర్చించవచ్చు. అలాగే ఉద్యోగ ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యే వారు ఏఐతో మాట్లాడి ప్రశ్నలు, సమాధానాలను ప్రాక్టీస్ చేయవచ్చు. ప్రజెంటేషన్లు, వ్యాపార ప్రతిపాదనలను కూడా సంభాషణ రూపంలో సాధన చేయవచ్చు.
ఎక్స్‌ప్రెసివ్ అవతార్లు..
ఈ ఫీచర్‌లో మరో ప్రత్యేకత ఎక్స్‌ప్రెసివ్ అవతార్లు. వినియోగదారులు మాట్లాడుతున్నప్పుడు ఏఐ అవతార్ కూడా వారి సంభాషణకు అనుగుణంగా ముఖ కవళికలు, హావభావాలను ప్రదర్శిస్తుంది. వినియోగదారులు తమకు నచ్చిన విధంగా మూడు డిస్‌ప్లే ఆప్షన్లను ఎంచుకోవచ్చు. కేవలం వాయిస్ మాత్రమే వినే విధానం, సంభాషణతోపాటు అవతార్‌ను చూసే విధానం, పూర్తి స్క్రీన్‌పై అవతార్‌తో ముఖాముఖి మాట్లాడే విధానం అందుబాటులో ఉన్నాయి. అలాగే న్యూయార్క్ వాసుల ఉత్సాహభరితమైన శైలి, పైరేట్‌ల ప్రత్యేకమైన మాటతీరు వంటి వందలాది వాయిస్ ఆప్షన్లను మ్యూస్ అందిస్తోంది. ఎప్పుడైనా తమకు నచ్చిన వాయిస్‌ను మార్చుకోవచ్చు. ఈ సంభాషణలు మ్యూస్ రియల్‌టైమ్ అవతార్, మ్యూస్ రియల్‌టైమ్ వాయిస్ టెక్నాలజీల ఆధారంగా పనిచేస్తాయి. సమాధానాలు వెంటనే వినిపించడంతోపాటు, అవసరమైనప్పుడు మధ్యలోనే ఏఐ సంభాషణను ఆపే సదుపాయం కూడా ఉంది.
ఈ కొత్త ఫీచర్లు మ్యూస్ యాప్‌లో దశలవారీగా అందుబాటులోకి వస్తున్నాయి. తొలుత అమెరికా వినియోగదారులకు వీటిని విడుదల చేస్తున్నారు. మొబైల్, వెబ్, మ్యాక్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ సదుపాయం పనిచేస్తుంది. యాప్‌లో కుడివైపు పైభాగంలో కనిపించే ఫోన్ ఐకాన్‌ను ట్యాప్ చేయడం ద్వారా వాయిస్ సంభాషణలను ప్రారంభించవచ్చు. త్వరలో ఏఐ గ్లాసెస్, మ్యూస్ చార్మ్ పరికరాల్లోనూ మ్యూస్‌తో వాయిస్ సంభాషణలు చేసే సదుపాయాన్ని తీసుకురానున్నారు.
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులకు స్టైపెండ్ పెంపు
- ●NEHS | ఉద్యోగులకు ఆస్పత్రుల్లో అడ్మిషన్లు నిరాకరిస్తే చర్యలు
- ●Salman Khan | "మాతృభూమి" సెన్సార్ కాకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకుందా? - రూమర్లపై సల్మాన్ ఖాన్ రియాక్షన్
- ●Tummal Nageshwar Rao | వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతాం.. రైతుల ఆదాయం పెంచుతాం..
- ●Cyber Criminals | సైబర్ నేరగాళ్లకు సమాజంలో చోటు లేదు.. జైళ్లలో మగ్గిపోవడమే వారికి సరైన శిక్ష : సుప్రీంకోర్టు
- ●Bhatti Vikramarka | పాత బస్తీ అభివృద్ధికి భారీగా నిధుల కేటాయింపు

Ponnam Prabhakar | బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులకు స్టైపెండ్ పెంపు

NEHS | ఉద్యోగులకు ఆస్పత్రుల్లో అడ్మిషన్లు నిరాకరిస్తే చర్యలు

Salman Khan | "మాతృభూమి" సెన్సార్ కాకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకుందా? - రూమర్లపై సల్మాన్ ఖాన్ రియాక్షన్

Tummal Nageshwar Rao | వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతాం.. రైతుల ఆదాయం పెంచుతాం..






