Gadwal Vijaya Laxmi | ఫీజులు తీసుకుని సర్టిఫికెట్లు ఆపేస్తారా?.. నల్ల మల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్‌పై విజయలక్ష్మి ఆగ్రహం
Gadwal Vijaya Laxmi | ఫీజులు చెల్లించినా విద్యార్థినుల అకడమిక్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేస్తారా? పిల్లల చదువుకు అడ్డంకులు సృష్టిస్తే చూస్తూ ఊరుకునేది లేదు అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్‌పర్సన్, సీఎం ప్రజావాణి రాష్ట్ర స్థాయి ఇన్‌చార్జ్ గద్వాల విజయలక్ష్మి తీవ్రంగా స్పందించారు.
Gadwal Vijaya Laxmi | ఫీజులు చెల్లించినా విద్యార్థినుల అకడమిక్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేస్తారా? పిల్లల చదువుకు అడ్డంకులు సృష్టిస్తే చూస్తూ ఊరుకునేది లేదు అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్‌పర్సన్, సీఎం ప్రజావాణి రాష్ట్ర స్థాయి ఇన్‌చార్జ్ గద్వాల విజయలక్ష్మి తీవ్రంగా స్పందించారు. ఘట్‌కేసర్ మండలం నారపల్లిలోని నల్ల మల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించినప్పటికీ ఇద్దరు మైనర్ విద్యార్థినులకు అకడమిక్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఫిర్యాదుపై తక్షణమే స్పందించారు. ఈ నెల 10వ తేదీలోగా విద్యార్థినులకు అవసరమైన సర్టిఫికెట్లు అందించాలని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సోమిరెడ్డికి స్పష్టం చేశారు.
చదువుకు ఆటంకం కలిగిస్తారా?
సీఎం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఇద్దరు బాలికలు తమకు అవసరమైన విద్యా ధ్రువపత్రాలు అందకపోవడంతో చదువు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని గద్వాల విజయలక్ష్మికి ఫిర్యాదు చేశారు. వారి సమస్యను స్వయంగా విన్న ఆమె వెంటనే పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సోమిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ఫీజులు చెల్లించిన తర్వాత కూడా సర్టిఫికెట్లు ఎందుకు నిలిపివేస్తున్నారని ప్రశ్నించారు. విద్యార్థినుల చదువు ఆగిపోయే పరిస్థితి రావడం ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ఈ నెల 10లోగా సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వ్యవహారంపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాకు గద్వాల విజయలక్ష్మి అధికారికంగా లేఖ రాశారు. విద్యార్థినులకు అవసరమైన సర్టిఫికెట్లను వెంటనే అందజేయడంతోపాటు.. బాలికలు చేసిన వేధింపుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
ఇతర విద్యాసంస్థలకూ హెచ్చరిక
విద్యార్థుల భవిష్యత్తుతో ఎవరూ ఆటలాడకూడదని గద్వాల విజయలక్ష్మి హెచ్చరించారు. ఫీజులు లేదా పరిపాలనా సమస్యల పేరుతో పిల్లల చదువును అడ్డుకోవడం సహించబోమని స్పష్టం చేశారు. విచారణలో తప్పిదం నిర్ధారణైతే సంబంధిత విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతానన్నారు. రాష్ట్రంలోని ఇతర విద్యాసంస్థలు కూడా ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. విద్యార్థులను వేధించడం, సర్టిఫికెట్లు నిలిపివేయడం, వారి విద్యకు ఆటంకం కలిగించడం వంటి చర్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని పేర్కొన్నారు. పిల్లల చదువు ఆగకూడదని, వారి విద్యా హక్కు, భవిష్యత్తు విషయంలో సీఎం ప్రజావాణి రాజీపడబోదని స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 83 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bigg Boss | భయపెట్టబోతున్న బిగ్‌బాస్ విన్నర్ - హారర్ కామెడీ మూవీతో హీరోగా ఎంట్రీ
- ●Model Schools | మోడల్ స్కూల్ సమస్యలకు మోక్షమెప్పుడు?
- ●Anaswara Rajan | చిరంజీవి, రవితేజ సినిమాల్లో ఆఫర్స్ - మలయాళ బ్యూటీ రియాక్షన్
- ●One-Way | లక్డీకాపూల్‌లో కొత్తగా వన్‌వే!
- ●The Traitors Telugu | ది ట్రైటర్స్ తెలుగు సీజన్ వన్ విన్నర్ ఎవరంటే? - ఇద్దరికి దక్కిన ప్రైజ్‌మనీ
- ●GP's Income | గ్రామపంచాయతీల ఖాతాల్లోకే సొంత ఆదాయం!

Bigg Boss | భయపెట్టబోతున్న బిగ్‌బాస్ విన్నర్ - హారర్ కామెడీ మూవీతో హీరోగా ఎంట్రీ

Model Schools | మోడల్ స్కూల్ సమస్యలకు మోక్షమెప్పుడు?

Anaswara Rajan | చిరంజీవి, రవితేజ సినిమాల్లో ఆఫర్స్ - మలయాళ బ్యూటీ రియాక్షన్

One-Way | లక్డీకాపూల్‌లో కొత్తగా వన్‌వే!





