Meta | మెటాకు షాక్.. సోషల్ ప్లాట్‌ఫామ్‌లలో భారీగా తగ్గిన డైలీ యాక్టివ్ యూజర్లు..
Meta | అమెరికా టెక్ దిగ్గజం మెటా ప్లాట్‌ఫామ్స్ తాజాగా విడుదల చేసిన మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో కీలక విషయాలను వెల్లడించింది. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఈ సంస్థకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, మెసెంజర్, వాట్సాప్ గత త్రైమాసికంతో పోలిస్తే డైలీ యాక్టివ్ యూజర్లలో స్వల్ప తగ్గుదల నమోదైందని కంపెనీ తెలిపింది.
Technology | Published On May 2, 2026, 2.15 pm IST
Meta | అమెరికా టెక్ దిగ్గజం మెటా ప్లాట్‌ఫామ్స్ తాజాగా విడుదల చేసిన మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో కీలక విషయాలను వెల్లడించింది. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఈ సంస్థకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, మెసెంజర్, వాట్సాప్ గత త్రైమాసికంతో పోలిస్తే డైలీ యాక్టివ్ యూజర్లలో స్వల్ప తగ్గుదల నమోదైందని కంపెనీ తెలిపింది. అయితే గతేడాది ఇదే కాలంతో పోలిస్తే యూజర్ల సంఖ్య పెరిగినట్లు వెల్లడించింది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా ప్లాట్‌ఫామ్‌లలో ఫీడ్స్ నాణ్యత లేకపోవడమేనని భావిస్తున్నారు.
గత త్రైమాసికంతో పోలిస్తే తగ్గుదల..
ఏప్రిల్ 29న విడుదల చేసిన ప్రకటనలో మెటా తెలిపిన వివరాల ప్రకారం 2026 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఫ్యామిలీ డైలీ యాక్టివ్ పీపుల్ (డీఏపీ) సంఖ్య సగటున 3.56 బిలియన్లుగా ఉంది. ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే సుమారు 4 శాతం వృద్ధిని సూచిస్తోంది. అయితే గత త్రైమాసికంతో పోలిస్తే మాత్రం స్వల్ప తగ్గుదల నమోదైంది. ఈ తగ్గుదలకు ఇరాన్‌లో ఇంటర్నెట్ అంతరాయం, రష్యాలో వాట్సాప్ యాక్సెస్‌పై పరిమితులు కారణమని మెటా పేర్కొంది. అయితే కచ్చితమైన యూజర్ల సంఖ్యను వెల్లడించలేదు. ది వెర్జ్ తెలిపిన ప్రకారం ఈ కాలంలో మెటా ప్లాట్‌ఫామ్‌లు కలిపి దాదాపు 20 మిలియన్ల యూజర్లను కోల్పోయినట్లు తేలింది. ఇదే సమయంలో సంస్థ ఈ ఏడాది ఏఐపై ఖర్చును అదనంగా 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ.94,947 కోట్లు) పెంచాలని ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం.
ఫీడ్స్ నాణ్యత తగ్గడం వల్లే..
9 టు 5 మాక్ తెలిపిన ప్రకారం ప్లాట్‌ఫామ్‌లలో ఫీడ్స్ నాణ్యత వల్ల యూజర్ల సంఖ్య తగ్గిందని అంచనా వేసింది. దీనికి పరిష్కారంగా మెటా ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ రికమెండేషన్ ఆల్గోరిథమ్‌ను మెటా సవరిస్తున్నట్లు సమాచారం. ఈ మార్పుల్లో భాగంగా ఇతర వనరుల నుంచి కాపీ చేసిన లేదా కొత్త విలువను జోడించని కంటెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ తగ్గించిన ప్రాధాన్యతతో చూపించనుంది. అలాంటి కంటెంట్‌కు రీచ్ ను తగ్గిస్తారు. ఇతర వెబ్‌సైట్లతో పోలిస్తే అసమానంగా ఎక్కువ క్లిక్స్ పొందే కంటెంట్, రచయిత వివరాలు స్పష్టంగా లేని న్యూస్ కంటెంట్ ను కూడా యూజర్లకు తక్కువగా చూపిస్తారు. ఈ చర్యల ద్వారా ఫీడ్ నాణ్యతను మెరుగుపరచి, యూజర్ అనుభవాన్ని పెంచడమే లక్ష్యంగా మెటా తన ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేయనుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






