Instagram For TV | టీవీలో ఇన్‌స్టాగ్రామ్.. కొత్త ఫీచర్లతో సోషల్ వీడియో ఎక్స్‌పీరియెన్స్..
Instagram For TV | మెటా సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీ యాప్‌కు గాను మరిన్ని కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. టెలివిజన్ స్క్రీన్‌పై వీడియోల వీక్షణను మరింత సౌకర్యవంతంగా మార్చాలనే లక్ష్యంతో ఈ ఫీచర్లను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. శాంసంగ్ స్మార్ట్ టీవీల్లోని ఇన్‌స్టాగ్రామ్ యాప్‌కు ఈ ఫీచర్లను అందిస్తున్నట్లు తెలిపింది.
Technology | Published On Jun 23, 2026, 1.52 pm IST
Instagram For TV | మెటా సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీ యాప్‌కు గాను మరిన్ని కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. టెలివిజన్ స్క్రీన్‌పై వీడియోల వీక్షణను మరింత సౌకర్యవంతంగా మార్చాలనే లక్ష్యంతో ఈ ఫీచర్లను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. శాంసంగ్ స్మార్ట్ టీవీల్లోని ఇన్‌స్టాగ్రామ్ యాప్‌కు ఈ ఫీచర్లను అందిస్తున్నట్లు తెలిపింది. అలాగే షేర్డ్ వ్యూయింగ్, కంటెంట్ డిస్కవరీకి సంబంధించి కొత్త ఫీచర్లను కూడా పరీక్షిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీని మెటా ఒక లివింగ్ రూమ్ అనుభవంగా రూపొందించింది. మొబైల్‌లో వ్యక్తిగతంగా వీడియోలు చూసే విధానానికి భిన్నంగా, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి టీవీలో కంటెంట్‌ను వీక్షించేందుకు ఇది అనుకూలంగా ఉంటుంది. ఒకే రిమోట్‌తో రీల్స్ మార్చడం, కలిసి వీడియోలు చూడడం, కంటెంట్‌పై వెంటనే స్పందించడం వంటి అంశాలను ఈ ఫీచర్లు మరింత సులభతరం చేస్తాయి.
టెలివిజన్ స్క్రీన్‌లపై ఎలా ఉంటుంది..
గతేడాది ప్రారంభమైనప్పటి నుంచి టెలివిజన్ స్క్రీన్‌లపై ఇన్‌స్టాగ్రామ్ వినియోగం ఎలా ఉంటుందో మెటా అధ్యయనం చేస్తోంది. మొబైల్ వినియోగంతో పోలిస్తే టీవీలో యూజర్లు ఎలా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవడంపై సంస్థ దృష్టి సారించింది. ముఖ్యంగా షేర్డ్ డిస్కవరీని మెరుగుపరచడం, చూసిన కంటెంట్‌ను సులభంగా కొనసాగించే అవకాశం కల్పించడం, ఒకే గదిలో కలిసి వీక్షించే అనుభవాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది. టీవీ వీక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన పలు కొత్త ఫీచర్లను ప్రస్తుతం మెటా పరీక్షిస్తోంది. ఇంటరెస్ట్ ఆధారిత ఛానళ్ల ద్వారా కామెడీ, స్పోర్ట్స్, క్రియేటర్ కంటెంట్ వంటి విభాగాలుగా వీడియోలను వర్గీకరించి, గ్రూప్ వ్యూయింగ్ సమయంలో కావాల్సిన కంటెంట్‌ను సులభంగా కనుగొనే అవకాశం కల్పిస్తోంది.
ఫోన్ నుంచి టీవీకి కాస్ట్..
అలాగే స్మార్ట్‌ఫోన్ నుంచి నేరుగా టీవీకి రీల్స్‌ను కాస్ట్ చేసే ఫీచర్‌ను కూడా పరీక్షిస్తోంది. కొన్ని ట్యాప్‌లతోనే యూజర్లు తమ ఫోన్‌లోని రీల్స్‌ను టీవీలో ప్రదర్శించవచ్చు. సేవ్ చేసుకున్న వీడియోలను కూడా టీవీకి షేర్ చేయవచ్చని మెటా తెలిపింది. ఇక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ను కూడా టీవీలోనే వీక్షించే అవకాశం కల్పించే ఫీచర్‌ను తీసుకువస్తోంది. దీంతో మొబైల్‌కు మారాల్సిన అవసరం లేకుండా స్నేహితులు, క్రియేటర్ల స్టోరీస్‌ను నేరుగా టెలివిజన్ స్క్రీన్‌పై చూడవచ్చు. వైడ్‌స్క్రీన్ టీవీలకు అనుగుణంగా హారిజాంటల్ వీడియోల కోసం ప్రత్యేక విభాగాన్ని కూడా మెటా పరీక్షిస్తోంది. ఇది పెద్ద స్క్రీన్‌లపై వీడియోల వీక్షణ అనుభవాన్ని మరింత మెరుగుపరచనుంది. టెలివిజన్ వీక్షణను దృష్టిలో ఉంచుకుని కొత్త కంటెంట్ ఫార్మాట్లను కూడా మెటా అన్వేషిస్తోంది. ఎక్కువ సమయం నిడివి కలిగిన క్రియేటర్ వీడియోలు, అనేక భాగాలుగా ఉండే ఎపిసోడిక్ సిరీస్‌లు, రియల్ టైమ్ ఇంటరాక్షన్‌కు అవకాశం ఇచ్చే లైవ్ వీడియో అనుభవాలు ప్రస్తుతం ప్రారంభ దశ పరీక్షల్లో ఉన్నాయి. భవిష్యత్తులో ఇవి మరింత విస్తృతంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
క్రియేటర్లు కూడా..
ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీ అభివృద్ధిలో క్రియేటర్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. లాంగ్ ఫార్మ్, ఎపిసోడిక్, లైవ్ కంటెంట్‌ను టెలివిజన్ ప్రేక్షకులకు ఎలా అనుకూలంగా మార్చాలనే అంశంపై మెటా వారితో కలిసి పనిచేస్తోంది. పెద్ద స్క్రీన్‌లపై సోషల్ వీడియో వినియోగాన్ని మరింత మెరుగుపరచేందుకు సంస్థ నిరంతరం కొత్త ప్రయోగాలు చేస్తోంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీ అమెరికాలో 2020 ఆ తరువాత వచ్చిన శాంసంగ్ స్మార్ట్ టీవీ మోడళ్లలో అందుబాటులోకి వచ్చింది. అలాగే గూగుల్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీనూ ఈ సేవ అందుబాటులో ఉంది. అయితే త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల యూజర్లకు కూడా ఈ యాప్‌ను అందించనుంది.
సంబంధిత వార్తలు

WhatsApp | వాట్సాప్‌లో కొత్త గ్రీన్ డాట్.. ఆన్లైన్లో ఉన్నవారిని వెంటనే గుర్తించొచ్చు..
జూన్ 20, 2026

Haier HQLED P7 Pro | హైయర్ నుంచి కొత్త ఎల్ఈడీ స్మార్ట్ టీవీలు.. ధర తక్కువ, ఏఐ ఫీచర్లు..
జూన్ 18, 2026

Social Media | సోషల్ మీడియా కంటెంట్‌తో 12 ఏళ్ల బాలిక కథ విషాదాంతం.. మెటా, టిక్‌టాక్‌పై కుటుంబాల న్యాయ పోరాటం..
జూన్ 17, 2026
తాజావార్తలు
- ●SIM Swapping | సిమ్ స్వాపింగ్ మోసాలతో జాగ్రత్త.. నిర్లక్ష్యం చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయి..
- ●HYD Metro | మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
- ●Nivetha Pethuraj | డీ గ్లామర్ పాత్రలో నివేదా - టాలీవుడ్ హీరోతో రెండోసారి రొమాన్స్
- ●TecSox Moon | కేవలం రూ.599కే వైర్లెస్ ఇయర్ బడ్స్.. అద్భుతమైన సౌండ్ క్వాలిటీ..
- ●Viking Row | నాకౌట్లోకి నార్వే.. వైకింగ్ రోతో టీమ్ సంబరాలు.. అలరించిన ఓడెగార్డ్
- ●CM Vijay | అసెంబ్లీలో స్టాలిన్‌ను ఇమిటేట్ చేసిన సీఎం విజయ్.. వీడియో వైరల్

SIM Swapping | సిమ్ స్వాపింగ్ మోసాలతో జాగ్రత్త.. నిర్లక్ష్యం చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయి..

HYD Metro | మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

Nivetha Pethuraj | డీ గ్లామర్ పాత్రలో నివేదా - టాలీవుడ్ హీరోతో రెండోసారి రొమాన్స్

TecSox Moon | కేవలం రూ.599కే వైర్లెస్ ఇయర్ బడ్స్.. అద్భుతమైన సౌండ్ క్వాలిటీ..



