త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Meta AI | ఫేస్‌బుక్‌లో మెటా ఏఐ హంగామా.. సెర్చ్ నుంచి వీడియోల వరకు కొత్త ఫీచర్లు..

Meta AI | మెటా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌లో కొత్త ఏఐ ఆధారిత ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వినియోగదారులు సులభంగా సమాచారం కనుగొనడం, ఫొటోలు-వీడియోలు రూపొందించడం, అలాగే వివిధ పనులను మరింత వేగంగా పూర్తి చేయడం లక్ష్యంగా ఈ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది.

S

Technology | Published On Jun 18, 2026, 11.38 am IST

Meta AI | ఫేస్‌బుక్‌లో మెటా ఏఐ హంగామా.. సెర్చ్ నుంచి వీడియోల వరకు కొత్త ఫీచర్లు..
Advertisement

Meta AI | మెటా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌లో కొత్త ఏఐ ఆధారిత ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వినియోగదారులు సులభంగా సమాచారం కనుగొనడం, ఫొటోలు-వీడియోలు రూపొందించడం, అలాగే వివిధ పనులను మరింత వేగంగా పూర్తి చేయడం లక్ష్యంగా ఈ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఉన్న ఫేస్‌బుక్ ఎక్స్‌పీరియెన్స్‌లోనే మెటా ఏఐని అప్ డేట్ చేయ‌డం ద్వారా కంటెంట్ డిస్కవరీ, క్రియేషన్, షేరింగ్‌ను మెరుగుపరచాలని సంస్థ భావిస్తోంది. ఈ అప్‌డేట్‌లో ప్రధాన ఆకర్షణగా ఏఐ మోడ్ ను మెటా అందుబాటులోకి తీసుకొస్తోంది. మెటా ఏఐ ఆధారంగా పనిచేసే ఈ ఫీచర్ ఫీడ్, సెర్చ్ విభాగాల్లో నేరుగా సమాధానాలను అందిస్తుంది. మెటా యాప్‌లలో పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న పోస్టులు, గ్రూపులు, రీల్స్ వంటి కంటెంట్‌ను ఉపయోగించి సమాధానాలు రూపొందిస్తుంది. సాధారణ సెర్చ్ ఫలితాలను మాత్రమే చూపించే బదులుగా, ప్రజలు పబ్లిక్‌గా ఏం మాట్లాడుతున్నారో, వారి అనుభవాలు, అభిప్రాయాలు ఏమిటో వాటి ఆధారంగా సమాధానాలు అందించనుంది. దీంతో యూజర్లు సాధారణ జాబితాల కంటే నిజమైన అనుభవాల ఆధారిత సమాచారాన్ని పొందగలుగుతారు.

కంటెంట్ బ్రౌజింగ్‌, డిస్క‌వ‌రీల‌లో..

మ్యూస్ స్పార్క్ సాంకేతికతతో పనిచేసే మెటా ఏఐ, ఫేస్‌బుక్‌లోని కంటెంట్ బ్రౌజింగ్, డిస్కవరీ ప్రక్రియల్లో భాగంగా కనిపించనుంది. దీంతో యూజర్లకు అవసరమైన సమాచారం మరింత సులభంగా అందుబాటులోకి రానుంది. కంటెంట్ క్రియేషన్‌ను సులభతరం చేయడానికి మెటా కొత్త ఏఐ ఎడిటింగ్ టూల్స్‌ను కూడా పరిచయం చేస్తోంది. ఇప్పటికే ఉన్న కెమెరా రోల్ సూచనలను మరింత విస్తరించి, ఆటోమేటెడ్ క్రియేటివ్ ఫార్మాట్లను అందిస్తోంది. ఈ కొత్త ఫీచర్లలో కెమెరా రోల్‌లోని ఫొటోల ఆధారంగా ఏఐ రూపొందించే కొలాజ్ సూచనలు, గత నెలలో స్నేహితులతో గడిపిన క్షణాలు వంటి కట్‌అవుట్ ఆధారిత కొలాజ్ టెంప్లేట్లు, వీడియోలను ఆకర్షణీయంగా మార్చే ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్, ఒకే ట్యాప్‌తో షేర్ చేయడానికి సిద్ధంగా ఉండే వీడియోలు, కొలాజ్‌లను రూపొందించే టూల్స్ ఉన్నాయి. ఈ ఫీచర్లు పూర్తిగా ఆప్షనల్‌గా అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు కోరుకుంటే వీటిని ఎప్పుడైనా నిలిపివేయవచ్చు. ఫోన్‌లో నిల్వ ఉన్న ఫొటోలు, వీడియో క్లిప్‌లను వేగంగా సోషల్ మీడియాలో పంచుకునేలా తయారుచేయడం వీటి ప్రధాన ఉద్దేశ్యం.

ఫొటోల కోసం ఎడిటింగ్ టూల్స్‌..

అలాగే ఫొటోలను వ్యక్తిగతీకరించేందుకు మెటా ఏఐ ఆధారిత ఫొటో ప్రీసెట్లను కూడా అందిస్తోంది. వీటి ద్వారా దుస్తులు, హెయిర్‌స్టైల్‌లు, యాక్సెసరీలను డిజిటల్‌గా మార్చుకోవచ్చు. వేర్ ఇట్ అనే ఫీచర్ ద్వారా స్పోర్ట్స్ జెర్సీలు వంటి దుస్తులను వర్చువల్‌గా ఫొటోలకు జోడించుకోవచ్చు. అలాగే రీస్టైల్ ప్రొఫైల్ పిక్చర్ విత్ ఏ” ఫీచర్‌ను ప్రొఫైల్ సెట్టింగ్స్ లేదా స్టోరీస్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. స్టోరీస్‌లో ప్రత్యేక ఏఐ ఎడిట్ ఐకాన్‌ను కూడా మెటా అందిస్తోంది, దీని ద్వారా ఎడిటింగ్ టూల్స్‌ను వెంటనే యాక్సెస్ చేయవచ్చు. ఈ అప్‌డేట్ ప్రధాన లక్ష్యం వినియోగదారులు సమాచారాన్ని సులభంగా కనుగొనడం, కంటెంట్‌ను వేగంగా రూపొందించడం, తమ ఆలోచనలను మరింత సృజనాత్మకంగా వ్యక్తపరచడమేన‌ని మెటా తెలిపింది. యూజర్ జనరేటెడ్ కంటెంట్‌కు ప్రాధాన్యత ఇస్తూనే పోస్టులు, గ్రూపులు, రీల్స్‌ను కేంద్రంగా ఉంచుతూ ఏఐ సహాయంతో వేగవంతమైన డిస్కవరీ, క్రియేషన్‌ను అందించనున్నట్లు మెటా తెలిపింది.

ఈ కొత్త ఏఐ ఫీచర్లు ఫేస్‌బుక్‌లో దశలవారీగా విడుదల అవుతున్నాయి. కొన్ని ఫీచర్లు ఆప్ట్-ఇన్ విధానంలో అందుబాటులో ఉంటాయి. ప్రాంతం, యూజర్ యాక్సెస్‌ను బట్టి వీటి అందుబాటు మారవచ్చని మెటా వెల్లడించింది.

Advertisement
Advertisement