Mega World Cup Sale 2026 | అమెజాన్‌లో మెగా వరల్డ్ కప్ సేల్ మళ్లీ షురూ.. స్మార్ట్ టీవీలపై 65 శాతం డిస్కౌంట్..
Mega World Cup Sale 2026 | టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రత్యేకంగా మెగా వరల్డ్ కప్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటికే టోర్నీ ప్రారంభానికి ముందు ఇలాంటి ఓ సేల్‌ను అమెజాన్ నిర్వహించింది. అయితే ఇప్పుడు మళ్లే అదే సేల్‌ను పునఃప్రారంభింది.
Technology | Published On Feb 16, 2026, 8.45 am IST
Mega World Cup Sale 2026 | టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రత్యేకంగా మెగా వరల్డ్ కప్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటికే టోర్నీ ప్రారంభానికి ముందు ఇలాంటి ఓ సేల్‌ను అమెజాన్ నిర్వహించింది. అయితే ఇప్పుడు మళ్లే అదే సేల్‌ను పునఃప్రారంభింది. ఆదివారం ప్రారంభం అయిన ఈ సేల్ ఫిబ్రవరి 22వ తేదీ వరకు కొనసాగుతుందని అమెజాన్ తెలిపింది. ఈ సేల్‌లో భాగంగా పలు బ్రాండ్లకు చెందిన స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లపై ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలను అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ సేల్‌లో షియోమీ, శాంసంగ్, టీసీఎల్, ఎల్‌జీ కంపెనీలకు చెందిన స్మార్ట్ టీవీలను అతి తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీలపై ఏకంగా 65 శాతం మేర డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే ప్రొజెక్టర్లపై పలు డీల్స్‌తోపాటు కూపన్లు, బ్యాంకు డిస్కౌంట్లను అందిస్తున్నారు. అందువల్ల ఆయా ఉత్పత్తులను చాలా తక్కువ ధరలకే ఈ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.
32, 43, 50 ఇంచుల మోడల్స్‌పై..
ఈ సేల్‌లో భాగంగా అన్ని కంపెనీలకు చెందిన 32 ఇంచుల స్మార్ట్ టీవీలను రూ.9,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. రూ.250 కూపన్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తున్నారు. అయితే 32 ఇంచుల మోడల్స్‌లో స్మార్ట్ ఎల్ఈడీలను రూ.12వేల ధరకే అందిస్తున్నారు. ఇక 43 ఇంచుల టీవీ మోడల్స్ ప్రారంభ ధర రూ.19,999 ఉండగా, వీటిల్లో 4కె అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీలను రూ.21వేల ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. వీటిపై రూ.1వేయి వరకు కూపన్ డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే 50 ఇంచుల ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీల ప్రారంభ ధర రూ.26,990 ఉండగా, ఇదే సైజులో 4కె అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీలను రూ.30వేల ప్రారంభ ధరకు అందిస్తున్నారు.
55 ఇంచులు, ఆ పైన సైజ్ ఉన్న మోడల్స్ అయితే..
55 ఇంచుల 4కె అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీలను ఈ సేల్‌లో రూ.35వేల ప్రారంభ ధరకు కొనవచ్చు. 65 ఇంచుల టీవీల ప్రారంభ ధర రూ.37వేలుగా ఉంది. ఇలా భారీ సైజు ఉన్న స్మార్ట్ ఎల్ఈడీ టీవీలను సైతం తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. ఇక ఈ సేల్‌లో సోనీ వంటి బ్రాండెడ్ కంపెనీలకు చెందిన స్మార్ట్ టీవీలను కూడా తగ్గింపు ధరలకు పొందవచ్చు. 50 ఇంచుల బ్రేవియా 4కె అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ధర రూ.51వేలుగా ఉంది. 55 ఇంచుల సోనీ టీవీ అయితే రూ.52,500కు పొందవచ్చు. ఇదే సైజులో శాంసంగ్ టీవీ ధర రూ.56,990గా ఉంది. అయితే ఇంతకు మించి సైజులు, అంటే 75, 100 ఇంచుల సైజుల్లో ఉన్న టీవీలపై కూడా ఆకర్షణీయమైన తగ్గింపు ధరలను, ఆఫర్లను అందిస్తున్నారు.
బ్యాంకు ఆఫర్లు కూడా..
ఈ సేల్‌లో ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌ను అందించే స్మార్ట్ ఎల్ఈడీ ప్రొజెక్టర్‌ను రూ.7,990 ప్రారంభ ధరకు కొనవచ్చు. అలాగే 4కె అల్ట్రా హెచ్‌డీ ప్రొజెక్టర్ కావాలంటే రూ.79వేల వరకు అవుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లపై బ్యాంకు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై రూ.3750 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై అయితే రూ.5,550 రాయితీ లభిస్తుంది. హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డు ఈఎంఐ ద్వారా రూ.3750, వన్ కార్డ్ క్రెడిట్ కార్డు ఈఎంఐ ద్వారా రూ.3500 డిస్కౌంట్ లభిస్తుంది. వినియోగదారులు మరిన్ని వివరాలకు అమెజాన్‌లోని మెగా వరల్డ్ కప్ సేల్ పేజ్‌ను సందర్శించవచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Fire TV Stick HD | అమెజాన్ కొత్త ఫైర్ టీవీ స్టిక్ హెచ్‌డీ విడుదల.. అద్భుతమైన ఫీచర్లతో అప్ గ్రేడ్..
మే 19, 2026

Credit Cards | క్రెడిట్ కార్డులను ఇలా వాడితేనే లాభం.. లేదంటే అప్పుల భారం..
మే 16, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



