Zoho Mail | జీమెయిల్‌ను వదిలి జోహో మెయిల్ దిశగా.. యూజర్లకు ఎందుకు నచ్చిందంటే..?
Zoho Mail | ఈ-మెయిల్ అనేది నేటి రోజుల్లో ప్రతి ఒక్కరి రోజువారి జీవితంలో భాగమైపోయింది. వ్యక్తిగత అవసరాల నుంచి కార్యాలయ పనుల వరకు అన్నింటికీ ఈ-మెయిల్ తప్పనిసరి అయింది. ఈ క్రమంలో సంవత్సరాలుగా జీమెయిల్ (Gmail) అత్యంత ప్రజాదరణ పొందిన సేవగా కొనసాగుతోంది.
Technology | Published On Jan 24, 2026, 12.39 pm IST
Zoho Mail | ఈ-మెయిల్ అనేది నేటి రోజుల్లో ప్రతి ఒక్కరి రోజువారి జీవితంలో భాగమైపోయింది. వ్యక్తిగత అవసరాల నుంచి కార్యాలయ పనుల వరకు అన్నింటికీ ఈ-మెయిల్ తప్పనిసరి అయింది. ఈ క్రమంలో సంవత్సరాలుగా జీమెయిల్ (Gmail) అత్యంత ప్రజాదరణ పొందిన సేవగా కొనసాగుతోంది. ఉపయోగించడానికి సులభంగా ఉండటం, ఇతర గూగుల్ యాప్స్‌తో సమన్వయం ఉండటంతో కోట్లాది మంది దీనిపైనే ఆధారపడుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో గోప్యత, ప్రకటనలు వంటి కారణాలతో చాలామంది వినియోగదారులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. అలాంటి వాటిలో భారత్‌లోనే అభివృద్ధి చేసిన జోహో మెయిల్ (Zoho Mail) ఇప్పుడు నెమ్మదిగా ప్రొఫెషనల్స్, సంస్థల గుర్తింపు తెచ్చుకుంటోంది.
యాడ్ ఫ్రీ ఇన్ బాక్స్..
జీమెయిల్‌లో అనేక సౌకర్యాలు ఉన్నప్పటికీ, ఇన్‌బాక్స్‌లో కనిపించే ప్రకటనలు కొందరికి అసౌకర్యంగా మారుతున్నాయి. అంతేకాదు, గూగుల్ మొత్తం ఎకోసిస్టమ్‌తో గట్టిగా అనుసంధానమై ఉండటంతో తమ డేటా, సందేశాల గోప్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రకటనల కోసం మెయిల్స్‌ను గూగుల్ స్కాన్ చేస్తుందన్న భావన కొంతమందిని ఆందోళనకు గురి చేస్తోంది. దీనికి భిన్నంగా జోహో మెయిల్ పూర్తిగా ప్రకటనల రహిత (ad-free) ఇన్‌బాక్స్‌ను అందిస్తోంది. డేటాపై వినియోగదారులకే పూర్తి నియంత్రణ ఉండేలా రూపొందించడంతో పాటు, క్లీన్‌గా, అంతరాయం లేని ఈ-మెయిల్ అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని జోహో చెబుతోంది.

అనేక ఫీచర్లు..
జోహో మెయిల్ వాడడం ప్రారంభించిన వెంటనే వినియోగదారులకు మొదటగా కనిపించే మార్పు, క్లీన్ ఇన్‌బాక్స్. ప్రకటనలు లేకపోవడం వల్ల మెయిల్స్ చదవడం, నిర్వహించడం చాలా సులభంగా మారుతుందని వినియోగదారులు చెబుతున్నారు. అంతేకాదు, పెద్ద సైజు ఫైల్స్‌ను కూడా నేరుగా అటాచ్ చేసి పంపించే సౌకర్యం ఉంది. క్లౌడ్ లింక్‌లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మరో విశేషమైన ఫీచర్ ఈమెయిల్ రీకాల్. అంటే పంపిన తర్వాత కూడా అవసరమైతే ఆ మెయిల్‌ను వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. కార్యాలయాలు, టీమ్‌ల కోసం జోహో మెయిల్‌లో ప్రత్యేక సహకార సాధనాలు (collaboration tools) ఉన్నాయి. ఒకే మెయిల్‌పై వ్యాఖ్యలు పెట్టడం, పనులను ఇతరులకు అసైన్ చేయడం, యాప్ మార్చకుండా కమ్యూనికేషన్ కొనసాగించడం వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇది సంస్థలకు మరింత సమర్థవంతమైన పని విధానాన్ని అందిస్తోంది.
భద్రత విషయంలోనూ..
భద్రత విషయంలో కూడా జోహో మెయిల్ గట్టి చర్యలు తీసుకుంటోంది. డేటా ఎన్‌క్రిప్షన్, అధునాతన స్పామ్ ఫిల్టరింగ్, సంస్థల అవసరాలకు తగ్గట్టు ఈమెయిల్స్‌ను భద్రంగా నిల్వ చేసుకునే సదుపాయాలు ఇందులో ఉన్నాయి. అంతేకాదు, ఈ-మెయిల్‌తో పాటు క్యాలెండర్, నోట్స్, టాస్క్ మేనేజర్ వంటి టూల్స్ కూడా ఒకే ప్లాట్‌ఫామ్‌లో లభిస్తాయి. మొత్తానికి, యాడ్ ఫ్రీ ప్లాట్‌ఫామ్, గోప్యతపై దృష్టి, ప్రొఫెషనల్ అవసరాలకు సరిపోయే ఫీచర్లతో జోహో మెయిల్ ఇప్పుడు జీమెయిల్‌కు గట్టి ప్రత్యామ్నాయంగా మారుతోంది. ముఖ్యంగా డేటా భద్రత, సింపుల్ ఇన్‌బాక్స్ కోరుకునే వినియోగదారులకు ఇది ఎంతో ఉపయుక్తంగా మారింది. దీంతో చాలా మంది యూజర్లు ప్రస్తుతం జీమెయిల్‌ను వదిలి జోహో మెయిల్ బాట పడుతున్నారు.
తాజావార్తలు
- ●Samsung Galaxy Tab S12 | గెలాక్సీ ట్యాబ్ ఎస్12 ప్లస్, ఎస్12 అల్ట్రా లాంచ్.. ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయి..
- ●Yuzvendra Chahal | చాహల్ సంచలనం.. ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన లెగ్ స్పిన్నర్..!
- ●Bhatti Vikramarka | గాంధీ పోరాటాన్ని మరిచి చరిత్రను వక్రీకరిస్తున్నరు
- ●Keerthy Suresh | భర్త కోసం సావిత్రి పోరాటం - కీర్తి సురేష్ కొత్త మూవీ టైటిల్‌పై నెటిజన్ల ట్రోల్స్
- ●Asian Games 2026 | పర్వీన్ పంచ్‌కు పసిడి పతకం.. చైనీస్ తైపీ బాక్సర్‌పై గెలుపు..
- ●Offshore Minerals | అండమాన్ దీవుల్లో అరుదైన ఖనిజాలు.. రెండు ప్రాంతాలకు వేలం..

Samsung Galaxy Tab S12 | గెలాక్సీ ట్యాబ్ ఎస్12 ప్లస్, ఎస్12 అల్ట్రా లాంచ్.. ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయి..

Yuzvendra Chahal | చాహల్ సంచలనం.. ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన లెగ్ స్పిన్నర్..!

Bhatti Vikramarka | గాంధీ పోరాటాన్ని మరిచి చరిత్రను వక్రీకరిస్తున్నరు

Keerthy Suresh | భర్త కోసం సావిత్రి పోరాటం - కీర్తి సురేష్ కొత్త మూవీ టైటిల్‌పై నెటిజన్ల ట్రోల్స్






