MacOS Gemini App | మాక్ ఓఎస్ యూజర్లకు ప్రత్యేకంగా గూగుల్ జెమిని యాప్.. ఏయే ఫీచర్లు ఉన్నాయంటే..?
MacOS Gemini App | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ఏఐ ప్లాట్‌ఫామ్ జెమినికి చెందిన మాక్ ఓఎస్ డెస్క్‌టాప్ యాప్‌ను అధికారికంగా విడుదల చేసింది. మాక్‌బుక్ ల్యాప్ టాప్ లు లేదా మాక్ సిస్టమ్‌లను వాడుతున్న డెస్క్ టాప్ యూజర్లు ఈ యాప్‌ను ప్రస్తుతం యాప్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
Technology | Published On Apr 18, 2026, 10.04 am IST
MacOS Gemini App | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ఏఐ ప్లాట్‌ఫామ్ జెమినికి చెందిన మాక్ ఓఎస్ డెస్క్‌టాప్ యాప్‌ను అధికారికంగా విడుదల చేసింది. మాక్‌బుక్ ల్యాప్ టాప్ లు లేదా మాక్ సిస్టమ్‌లను వాడుతున్న డెస్క్ టాప్ యూజర్లు ఈ యాప్‌ను ప్రస్తుతం యాప్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను పూర్తిగా డెస్క్‌టాప్ పనితీరుకు తగిన విధంగా డిజైన్ చేసి అందించారు. దీని వల్ల యూజర్లు తాము చేస్తున్న పనులను విడిచిపెట్టకుండా అదే సమయంలో ఏఐ సహాయాన్ని కూడా పొందవచ్చు. ఈ మాక్ ఓఎస్ జెమిని యాప్‌లో యూజర్ల పనిని సులభతరం చేసే పలు ఫీచర్లను ఇచ్చారు. ముఖ్యంగా క్విక్ యాక్సెస్ షార్ట్ కట్ ను అందుబాటులో ఉంచారు. మాక్ డెస్క్‌టాప్ కీబోర్డుపై ఆప్షన్ + స్పేస్ బటన్‌లను కలిపి టచ్ చేస్తే ఏ స్క్రీన్‌లో ఉన్నా సరే జెమిని ఇంటర్‌ఫేస్ వెంటనే ఓపెన్ అవుతుంది. దీంతో యూజర్లు పనిచేస్తున్న విండోను మార్చకుండానే జెమిని సహాయంతో పనులను ముగించుకోవచ్చు.
కాంటెక్చువల్ స్క్రీన్ షేరింగ్..
జెమిని మాక్ డెస్క్‌టాప్ యాప్‌లో కాంటెక్చువల్ స్క్రీన్ షేరింగ్ అనే మరో కీలక ఫీచర్‌ను ఇచ్చారు. యూజర్లు తమ ప్రస్తుత స్క్రీన్ లేదా లోకల్ ఫైల్స్‌ను నేరుగా జెమినితో షేర్ చేయవచ్చు. దీని వల్ల పీసీలోని విజువల్ కాంటెక్ట్స్‌ను జెమిని ఏఐ అర్థం చేసుకుని సహాయం చేస్తుంది. ఉదాహరణకు క్లిష్టమైన చార్ట్‌ను చూస్తున్నప్పుడు ఆ విండోను షేర్ చేసి ముఖ్యాంశాల వివరాలను క్లుప్తంగా చెప్పమని అగడవచ్చు. అలాగే క్రియేటివ్ వర్క్స్ చేసేవారి కోసం కూడా ఇందులో పలు ఇంటిగ్రేటెడ్ టూల్స్‌ను ఇచ్చారు. యూజర్లు జెమిని ఏఐ యాప్ లోని నానో బనానా ద్వారా ఇమేజ్‌లను సులభంగా క్రియేట్ చేయవచ్చు. వెవో ద్వారా వీడియోలను జనరేట్ చేయవచ్చు. ఇవన్నీ డెస్క్‌టాప్ ఓవర్‌లే నుంచే నేరుగా నిర్వహించవచ్చు.
మాక్ ఓఎస్ 15 లేదా ఆపైన వెర్షన్..
జెమిని ఏఐ మాక్ ఓఎస్ యాప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాక్ యూజర్లకు ప్రస్తుతం అందుబాటులో ఉంది. మాక్ ఓఎస్ 15 లేదా అంతకన్నా పై వెర్షన్ కలిగిన మాక్‌లలో ఈ యాప్ పనిచేస్తుంది. యూజర్లు మాక్‌లోని యాపిల్ స్టోర్ ద్వారా లేదా gemini.google/mac అనే వెబ్‌సైట్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి మాక్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని ఉపయోగించవచ్చు. అయితే ప్రస్తుతం ఈ యాప్ ప్రాథమిక దశలోనే ఉందని, మరో నెల రోజుల్లో పూర్తి స్థాయిలో యాప్‌ను విస్తరించి మరిన్ని ఫీచర్లను యూజర్లకు అందిస్తామని గూగుల్ తెలిపింది. దీని వల్ల యూజర్ల ఉత్పాదకత మెరుగు పడడమే కాకుండా పనితీరు వేగంగా కొనసాగుతుందని తెలియజేసింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






