Lumio Vision Smart TVs | లూమియో నుంచి తక్కువ ధరలకే పెద్ద సైజ్ 4కె ఎల్ఈడీ టీవీలు.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
Lumio Vision Smart TVs | ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ లూమియో విజన్ 7, విజన్ 9 సిరీస్‌లో నూతన 4కె స్మార్ట్ టీవీలను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీలు ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉండడమే కాకుండా బడ్జెట్ ధరలకే అందుబాటులో ఉండడం విశేషం.
Technology | Published On Apr 18, 2026, 12.08 pm IST
Lumio Vision Smart TVs | ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ లూమియో విజన్ 7, విజన్ 9 సిరీస్‌లో నూతన 4కె స్మార్ట్ టీవీలను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీలు ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉండడమే కాకుండా బడ్జెట్ ధరలకే అందుబాటులో ఉండడం విశేషం. లూమియో సంస్థ విజన్ 9 (2026) సిరీస్‌లో 55, 65 ఇంచుల సైజులు కలిగిన 4కె క్యూడీ మినీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీలను, విజన్ 7 (2026) సిరీస్‌లో 43, 55 ఇంచుల సైజులు కలిగిన 4కె క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. విజన్ సిరీస్ స్మార్ట్ టీవీలను ఎలాంటి ల్యాగ్ లేకుండా స్మూత్‌గా ఆపరేట్ చేసుకునే విధంగా తీర్చిదిద్దామని లూమియో సంస్థ తెలిపింది. అందుకనే ఈ స్మార్ట్ టీవీలను ఫాస్ట్, ఫ్లుయిడ్, ఫ్లాగ్‌షిప్ అనే ట్యాగ్ లైన్‌తో లాంచ్ చేసినట్లు తెలిపింది. ఈ స్మార్ట్ టీవీలలో ప్రేక్షకులకు అద్భుతమైన వ్యూయింగ్ ఎక్స్‌పీరియెన్స్ లభిస్తుందని వెల్లడించింది.
విజన్ 9 (2026), విజన్ 7 (2026) టీవీల ఫీచర్లు..
విజన్ స్మార్ట్ టీవీలను వేగవంతమైన ఇంటర్ ఫేస్ కలిగి ఉండేలా తీర్చిదిద్దామని, అందువల్ల యూజర్లు టీవీల్లో ఆప్షన్‌లను వేగంగా వెదకవచ్చని లూమియో తెలియజేసింది. విజన్ 9 స్మార్ట్ టీవీలలో మీడియాటెక్ పెంటోనిక్ 700 చిప్ సెట్‌ను ఇచ్చారు. 3జీబీ ర్యామ్ లభిస్తుంది. ఇదే రేంజ్‌లో ఉన్న ఇతర కంపెనీలకు చెందిన స్మార్ట్ టీవీలతో పోలిస్తే తమ విజన్ 9 (2026) సిరీస్ స్మార్ట్ టీవీలు 2 రెట్లు మెరుగైన ప్రదర్శనను ఇస్తాయని, అలాగే వైఫై 5 అధునాతన కనెక్టివిటీని కలిగి ఉన్నాయని సంస్థ తెలిపింది. గేమర్ల కోసం ఈ స్మార్ట్ టీవీలు ప్రత్యేకంగా 4కె రిజల్యూషన్‌ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తాయని తెలిపింది. దీని వల్ల యూజర్లు అధిక రిజల్యూషన్‌తో భారీ గ్రాఫిక్స్ కలిగిన గేమ్స్‌ను కూడా సులభంగా, ఎలాంటి ల్యాగ్ లేకుండా ఆడుకోవచ్చు. ఇక ఈ స్మార్ట్ టీవీలకు హెచ్‌డీఎంఐ 2.1 పోర్టును ఇచ్చారు. 800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ లభిస్తుంది. డాల్బీ విజన్, హెచ్‌డీఆర్ 10, 50 వాట్ల సౌండ్ సిస్టమ్, డాల్బీ అట్మోస్ ఆడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. లూమియో విజన్ 7 (2026) సిరీస్ స్మార్ట్ టీవీలలో 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇచ్చారు. దీని వల్ల ఎక్కువ యాప్స్‌ను టీవీలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అలాగే గతంలో వచ్చిన విజన్ 7 పాత మోడల్స్ కన్నా ఈ స్మార్ట్ టీవీలు 4 రెట్లు ఎక్కువ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తాయని కంపెనీ తెలిపింది.
ధర వివరాలు..
లూమియో విజన్ 9 (2026) 65 ఇంచుల టీవీ ధర రూ.72,999 ఉండగా బ్యాంకు ఆఫర్లు, ఇతర డిస్కౌంట్ల అనంతరం దీన్ని రూ.64,999కు పొందవచ్చు. లూమియో విజన్ 9 (2026) 55 ఇంచుల టీవీ మే నెలలో అందుబాటులోకి రానుంది. ధర వివరాలను అప్పుడే వెల్లడిస్తారు. లూమియో విజన్ 7 (2026) 43 ఇంచుల టీవీ ధర రూ.29,999 ఉండగా, 55 ఇంచుల టీవీ ధర రూ.39,999గా ఉంది. ఈ స్మార్ట్ టీవీలను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఏప్రిల్ 24 నుంచి విక్రయించనున్నారు. ఆఫర్లు, బ్యాంకు డిస్కౌంట్లను అదే రోజున ప్రకటించనున్నారు. ఈ స్మార్ట్ టీవీలకు 2 ఏళ్ల వారంటీని అందిస్తున్నట్లు కంపెనీ మాతృ సంస్థ సర్క్యూట్ హౌస్ టెక్నాలజీస్ సీఈవో రఘురెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఇదే సెగ్మెంట్‌లో అందుబాటులో ఉన్న ఇతర స్మార్ట్ టీవీల కన్నా తమ మోడల్స్ ధర తక్కువని, అలాగే మెరుగైన ఫీచర్లను కలిగి ఉన్నాయని, వినియోగదారులు స్మార్ట్ టీవీల్లో వేగవంతమైన ఇంటర్ ఫేస్‌ను కోరుకుంటున్నారని, దాన్ని వీటిల్లో అందిస్తున్నామని తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nagarjuna | బాలకృష్ణ ప్రొడ్యూసర్ - నాగార్జున హీరో - రేర్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ కానీ...
- ●PM eBus Sewa | వరంగల్‌కు మరో 100 ఎలక్ట్రిక్ బస్సులు.. వెల్లడించిన ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
- ●క్షుద్ర రాజకీయాలా? రాజకీయ వ్యూహాలా?: హరీశ్ రావు వర్సెస్ కాంగ్రెస్ ‘తాంత్రిక’ సమరం!
- ●KTR | వేణు సూసైడ్ నోట్.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఛార్జిషీట్
- ●CM Vijay vs MK Stalin | పరిపాలన చేతగాని డమ్మీ ముఖ్యమంత్రివి నువ్వు : ఉదయనిధి అరెస్ట్‌పై ఎంకే స్టాలిన్ ఫైర్
- ●TTD | సెప్టెంబర్‌లో తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? బ్రహ్మోత్సవాల వేళ సేవలన్నీ రద్దు..!

Nagarjuna | బాలకృష్ణ ప్రొడ్యూసర్ - నాగార్జున హీరో - రేర్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ కానీ...

PM eBus Sewa | వరంగల్‌కు మరో 100 ఎలక్ట్రిక్ బస్సులు.. వెల్లడించిన ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

క్షుద్ర రాజకీయాలా? రాజకీయ వ్యూహాలా?: హరీశ్ రావు వర్సెస్ కాంగ్రెస్ ‘తాంత్రిక’ సమరం!

KTR | వేణు సూసైడ్ నోట్.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఛార్జిషీట్






