Lava Virat V1 | లావా విరాట్ వి1 సిరీస్ లాంచ్.. రూ.8,999 నుంచే 5జి, భారీ బ్యాటరీ ఫోన్లు..
Lava Virat V1 | మొబైల్స్ తయారీ సంస్థ లావా భారత మార్కెట్‌లో తన కొత్త ఆన్‌లైన్ ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ లావా విరాట్ వి1 5జి, లావా విరాట్ వి1లను అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌ను ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది.
Technology | Published On Jul 25, 2026, 1.56 pm IST
Lava Virat V1 | మొబైల్స్ తయారీ సంస్థ లావా భారత మార్కెట్‌లో తన కొత్త ఆన్‌లైన్ ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ లావా విరాట్ వి1 5జి, లావా విరాట్ వి1లను అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌ను ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది. విద్యార్థులు, యువ ఉద్యోగులు, తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్లను తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. లావా విరాట్ వి1 5జిలో 5జి నెట్‌వర్క్ సపోర్ట్ ఉండగా, లావా విరాట్ వి1లో 4జి ఎల్‌టీఈ కనెక్టివిటీ అందుబాటులో ఉంది. విరాట్ వి1 5జిలో 6.75 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఇవ్వగా, విరాట్ వి1లో అదే పరిమాణంలోని హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందించింది.
భారీ బ్యాటరీ..
విరాట్ వి1 5జిలో యూనిసోక్ టి8200 ప్రాసెసర్‌ను, విరాట్ వి1లో యూనిసోక్ ఎస్‌సీ9863ఎ ప్రాసెసర్‌ను అమర్చారు. రెండు ఫోన్లలోనూ 4జీబీ ర్యామ్‌తో పాటు అదనంగా 4జీబీ వర్చువల్ ర్యామ్ సపోర్ట్, 64జీబీ స్టోరేజ్ లభిస్తుంది. మైక్రోఎస్‌డీ కార్డ్ ద్వారా 1టీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశం ఉంది. సాఫ్ట్‌వేర్ పరంగా విరాట్ వి1 5జి ఆండ్రాయిడ్ 16పై పనిచేస్తుంది. విరాట్ వి1 ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్‌తో వస్తుంది. రెండు ఫోన్లలోనూ ప్రకటనలు లేదా అనవసర ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్‌లు ఉండవని కంపెనీ వెల్లడించింది. ఫొటోగ్రఫీ కోసం రెండు మోడళ్లలోనూ 13 మెగాపిక్సల్ ఏఐ డ్యుయల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. అలాగే ఐపీ64 రేటింగ్‌తో దుమ్ము, నీటి నుంచి రక్షణ కల్పించారు. విరాట్ వి1 5జిలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 10 వాట్ల ఛార్జర్ అందించగా, విరాట్ వి1లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ల ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
ధర వివరాలు..
విరాట్ వి1 5జి ఆర్యా బ్లూ, సోనార్ గోల్డ్ కలర్లలో అందుబాటులోకి రాగా, విరాట్ వి1 నీలగిరి బ్లూ, హిమాలయన్ సిల్వర్ రంగుల్లో లాంచ్ అయింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను జూలై 31 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, లావా అధికారిక వెబ్‌సైట్‌లలో విక్రయించనున్నారు. లావా విరాట్ వి1 5జి సాధారణ ధర రూ.12,999 కాగా, లాంచ్ డే ప్రత్యేక ధరను రూ.11,999గా నిర్ణయించారు. లావా విరాట్ వి1 సాధారణ ధర రూ.9,999 కాగా, జూలై 31న మాత్రమే ప్రత్యేకంగా రూ.8,999కు విక్రయించనున్నారు. అలాగే ఈ రెండు ఫోన్ల కొనుగోలుదారులకు లావా తన ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ సేవను కూడా అందిస్తోంది. ఈ సేవ ద్వారా వినియోగదారులకు ఇంటి వద్దే సర్వీస్, రిపేర్ సౌకర్యాలు లభిస్తాయి. నగరాలతో పాటు మారుమూల ప్రాంతాల వినియోగదారులకు కూడా అమ్మకాల తర్వాత మెరుగైన సేవలు అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని కంపెనీ తెలిపింది.
సంబంధిత వార్తలు

Flipkart | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026.. అక్టోబర్ 9 నుంచి భారీ సేల్..
సెప్టెంబర్ 16, 2026

Lava Bold N4 Lite | భారీ బ్యాటరీతో లావా మొబైల్స్ కొత్త ఫోన్.. ధర రూ.7,999 మాత్రమే..
ఆగస్టు 28, 2026

Lava Virat V1 Pro 5G | లావా నుంచి మరో కొత్త 5జి ఫోన్.. రూ.2వేల లాంచింగ్ డిస్కౌంట్..
ఆగస్టు 25, 2026
తాజావార్తలు
- ●Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!
- ●TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Operation Polo | విలీనం.. 78 ఏళ్లు
- ●Harish Rao | మేం పోలేదు.. పథకం ప్రకారం సస్పెండ్ చేసినవ్
- ●Harish Rao | నిషేధిత భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు అక్షర సత్యం
- ●Disha Patani | గాగ్రాలో గ్లామరస్‌గా దిశా పటానీ.. అంబానీ గణేశ్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్!







