Lava Bold N4 Lite | భారీ బ్యాటరీతో లావా మొబైల్స్ కొత్త ఫోన్.. ధర రూ.7,999 మాత్రమే..
Lava Bold N4 Lite | బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుల కోసం దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా మరో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎంట్రీ లెవల్ విభాగంలో లావా బోల్డ్ ఎన్4 లైట్‌ను ప్రకటించింది. 6.56 ఇంచుల డిస్‌ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 గో ఎడిషన్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Technology | Published On Aug 28, 2026, 5.26 pm IST
Lava Bold N4 Lite | బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుల కోసం దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా మరో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎంట్రీ లెవల్ విభాగంలో లావా బోల్డ్ ఎన్4 లైట్‌ను ప్రకటించింది. 6.56 ఇంచుల డిస్‌ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 గో ఎడిషన్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజువారీ వినియోగం, వెబ్ బ్రౌజింగ్, మల్టీమీడియా అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించారు. లావా బోల్డ్ ఎన్4 లైట్‌లో 6.75 ఇంచుల క్యూహెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఇది 960 * 540 పిక్సల్స్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. రోజువారీ వినియోగానికి అనుగుణంగా ఈ స్క్రీన్‌ను రూపొందించారు. ఫోన్ మిలిటరీ గ్రేడ్ ఎంఐఎల్-ఎస్‌టీడీ-810హెచ్ డ్యూరబిలిటీ రేటింగ్‌తో లాంచ్ అయింది. దీంతో సాధారణంగా ఎదురయ్యే పగుళ్లు, రోజువారీ వినియోగంలో జరిగే ఒత్తిడిని తట్టుకునేలా దీనిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఎంపైర్ గోల్డ్, ఘోస్ట్ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తోంది.
భారీ బ్యాటరీ..
లావా బోల్డ్ ఎన్4 లైట్‌లో ఆక్టాకోర్ యూనిసాక్ 9863ఎ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఫోన్‌లో 3జీబీ ర్యామ్ ఉండగా, మరో 3జీబీ వర్చువల్ ర్యామ్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. అంతర్గతంగా 32జీబీ స్టోరేజ్ అందించారు. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 64జీబీ వరకు పెంచుచుకోవచ్చు. ఇందులో 5000ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని అందించారు. దీనికి 10 వాట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. బాక్స్‌లోనే 10 వాట్ ఛార్జర్‌ను అందిస్తున్నారు. ఆడియో కోసం కిందివైపు ఒక స్పీకర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఎఫ్‌ఎం రేడియో సదుపాయాలు ఉన్నాయి. వెనుకవైపు ఎల్‌ఈడీ ఫ్లాష్ కలిగిన 8 మెగాపిక్సల్ సింగిల్ కెమెరాను అందించారు. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. భద్రత కోసం ఫోన్ పక్క భాగంలో ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను ఏర్పాటు చేశారు.
ధర వివరాలు..
సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 గో ఎడిషన్‌తో పనిచేస్తుంది. తక్కువ హార్డ్‌వేర్ సామర్థ్యం ఉన్న ఫోన్లలో సాఫీగా పనిచేసేలా రూపొందించిన తేలికపాటి ఆపరేటింగ్ సిస్టమ్ ఇది. అంతేకాకుండా ముందుగానే ఇన్‌స్టాల్ చేసిన అవసరం లేని యాప్‌లు, బ్లోట్‌వేర్ లేకుండా ఫోన్‌ను అందిస్తున్నట్లు లావా తెలిపింది. కనెక్టివిటీ కోసం డ్యుయల్ సిమ్ సదుపాయం ఉంది. రెండు సిమ్‌లకు 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2, జీపీఎస్, యూఎస్‌బీ టైప్ సి పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. నానో సిమ్ రెండు స్లాట్లతోపాటు మైక్రోఎస్‌డీ కార్డు కోసం ప్రత్యేక స్లాట్‌ను కూడా అందించారు. లావా బోల్డ్ ఎన్4 లైట్ ధరను రూ.8,099గా నిర్ణయించారు. అయితే లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.7,999 ప్రారంభ ధరకు విక్రయించనున్నారు. సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఫోన్‌కు రెండు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తామని లావా ప్రకటించింది. అలాగే కంపెనీకి చెందిన ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ కార్యక్రమం కింద ఇంటి వద్దే సర్వీస్ అందించే సదుపాయం కూడా ఈ ఫోన్‌కు ఉంది.
సంబంధిత వార్తలు

Lava Virat V1 Pro 5G | లావా నుంచి మరో కొత్త 5జి ఫోన్.. రూ.2వేల లాంచింగ్ డిస్కౌంట్..
ఆగస్టు 25, 2026

Lava Smart 4 | రూ.8,499కే లావా స్మార్ట్‌ఫోన్.. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16..
ఆగస్టు 10, 2026

Lava Virat V1 | లావా విరాట్ వి1 సిరీస్ లాంచ్.. రూ.8,999 నుంచే 5జి, భారీ బ్యాటరీ ఫోన్లు..
జులై 25, 2026
తాజావార్తలు
- ●Sensex | రూ.1 లక్ష పెట్టుబడికి రూ.44 లక్షల లాభం.. ఎఫ్ అండ్ వో క్లోజింగ్ ఆక్షన్ సెషన్ మాయ..
- ●Dasoju Sravan | తెలంగాణ సాంకేతిక విద్యను లాగేసుకుంటున్నారా? ఆనంద్ మహీంద్రాను నిలదీసిన దాసోజు శ్రవణ్
- ●Raksha Bhandhan | రక్షా బంధన్‌ను సెలబ్రేట్ చేసుకున్న స్టార్స్ - అక్కతో మహేష్ - తమ్ముడికి రాఖీ కట్టిన కంగనా రనౌత్
- ●Stock Markets | రెండు రోజుల నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..
- ●Annamalai | అలాంటి సినిమాలు పిల్లలు చూస్తే ఏంటి పరిస్థితి..? టాక్సిక్‌పై అన్నామలై ఫైర్
- ●Telugu Student Ties Rakhi to Modi | ప్రధాని మోదీకి ఢిల్లీలో రాఖీ కట్టిన తెలుగు విద్యార్థిని

Sensex | రూ.1 లక్ష పెట్టుబడికి రూ.44 లక్షల లాభం.. ఎఫ్ అండ్ వో క్లోజింగ్ ఆక్షన్ సెషన్ మాయ..

Dasoju Sravan | తెలంగాణ సాంకేతిక విద్యను లాగేసుకుంటున్నారా? ఆనంద్ మహీంద్రాను నిలదీసిన దాసోజు శ్రవణ్

Raksha Bhandhan | రక్షా బంధన్‌ను సెలబ్రేట్ చేసుకున్న స్టార్స్ - అక్కతో మహేష్ - తమ్ముడికి రాఖీ కట్టిన కంగనా రనౌత్

Stock Markets | రెండు రోజుల నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..



