Lava Bold N4 Pro 5G | లావా బోల్డ్ ఎన్4 ప్రొ 5జి.. రూ.13,999కే.. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ..
Lava Bold N4 Pro 5G | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దేశీయ సంస్థ లావా మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. బడ్జెట్ నుంచి మిడ్‌రేంజ్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని లావా బోల్డ్ ఎన్4 ప్రొ 5జిని అధికారికంగా పరిచయం చేసింది. ఇది గతంలో విడుదలైన బోల్డ్ ఎన్2 ప్రొకు కొనసాగింపుగా వచ్చింది.
Technology | Published On Sep 19, 2026, 4.30 pm IST
Lava Bold N4 Pro 5G | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దేశీయ సంస్థ లావా మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. బడ్జెట్ నుంచి మిడ్‌రేంజ్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని లావా బోల్డ్ ఎన్4 ప్రొ 5జిని అధికారికంగా పరిచయం చేసింది. ఇది గతంలో విడుదలైన బోల్డ్ ఎన్2 ప్రొకు కొనసాగింపుగా వచ్చింది. భారీ బ్యాటరీ, 5జి కనెక్టివిటీ, క్లీన్‌గా ఉండే ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ప్రధాన ప్రత్యేకతలుగా కంపెనీ ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. లావా బోల్డ్ ఎన్4 ప్రొ 5జి 6.75 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వచ్చింది. ఇందులో 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 550 నిట్స్ హెచ్‌బీఎం బ్రైట్‌నెస్ ఉన్నాయి. వాటర్‌డ్రాప్ నాచ్‌తో ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్‌ను అందించారు. దుమ్ము, నీటి తుంపరలను తట్టుకునేలా ఐపీ64 రేటింగ్ ఇచ్చారు. వెనుక భాగంలో ఎల్‌ఈడీ ఫ్లాష్ కలిగిన 50 మెగాపిక్సల్ ఏఐ ప్రధాన కెమెరాను ఏర్పాటు చేశారు. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌లో యూనిసోక్ టి8200 ఆక్టాకోర్ 5జి ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అందించారు. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టెరాబైట్ వరకు పెంచుకోవచ్చు. వర్చువల్ ర్యామ్ విస్తరణకు కూడా మద్దతు ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చే ఈ ఫోన్‌లో థర్డ్‌పార్టీ బ్లోట్‌వేర్, అనవసరమైన ప్రకటనలు లేకుండా క్లీన్‌గా ఉండే సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందిస్తున్నట్లు లావా తెలిపింది. ఈ ఫోన్‌లో 6,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న భారీ బ్యాటరీ ఉంది. దీనికి 18 వాట్ల ఛార్జింగ్ మద్దతు లభిస్తుంది. 5జి, 4జీ వీవోఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించారు.
ధర ఎంతంటే..
లావా బోల్డ్ ఎన్4 ప్రొ 5జి 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. దీని ధరను రూ.13,999గా నిర్ణయించారు. మిడ్‌నైట్ బ్లూ, లావెండర్, సిల్వర్ గ్రేడియంట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ఇండియా ద్వారా ప్రత్యేకంగా విక్రయాలు ప్రారంభం కానున్నాయి. కొనుగోలుదారులకు లావా అందించే ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ ఆఫ్టర్ సేల్స్ సేవ కూడా ఉంటుంది.
సంబంధిత వార్తలు

Lava Bold N4 Lite | భారీ బ్యాటరీతో లావా మొబైల్స్ కొత్త ఫోన్.. ధర రూ.7,999 మాత్రమే..
ఆగస్టు 28, 2026

Lava Virat V1 Pro 5G | లావా నుంచి మరో కొత్త 5జి ఫోన్.. రూ.2వేల లాంచింగ్ డిస్కౌంట్..
ఆగస్టు 25, 2026

Lava Smart 4 | రూ.8,499కే లావా స్మార్ట్‌ఫోన్.. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16..
ఆగస్టు 10, 2026
తాజావార్తలు
- ●Tirumala Brahmotsavam 2026 | మోహినీ రూపంలో మలయప్ప.. మంత్రముగ్ధులైన భక్తజనం..! ఫొటో గ్యాలరీ
- ●Tollywood | హీరోగా మారిన తెలుగు యూట్యూబర్ - ఆస్కార్ విన్నర్‌తో ప్రమోషన్స్
- ●Young man Suicide | బైక్ విషయంలో గొడవ.. యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలి మనవడి వేధింపులతో గిరిజన యువకుడి ఆత్మహత్య
- ●IPO | వచ్చే వారం 6 ఐపీఓలు.. రూ.3,824 కోట్ల ఆఫర్..
- ●Pune Man | భార్యకు బిజినెస్ టూర్ అని చెప్పి ప్రియురాలితో విదేశీ ట్రిప్.. ఎయిర్‌పోర్టులో వ్యాపారికి ఊహించిన షాక్
- ●Brahmotsavam 2026 | కనుల పండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు..!

Tirumala Brahmotsavam 2026 | మోహినీ రూపంలో మలయప్ప.. మంత్రముగ్ధులైన భక్తజనం..! ఫొటో గ్యాలరీ

Tollywood | హీరోగా మారిన తెలుగు యూట్యూబర్ - ఆస్కార్ విన్నర్‌తో ప్రమోషన్స్

Young man Suicide | బైక్ విషయంలో గొడవ.. యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలి మనవడి వేధింపులతో గిరిజన యువకుడి ఆత్మహత్య

IPO | వచ్చే వారం 6 ఐపీఓలు.. రూ.3,824 కోట్ల ఆఫర్..



