Lava Bold N2 5G | రూ.11,999కే లావా కొత్త 5జి ఫోన్.. 6000ఎంఏహెచ్ బ్యాటరీ హైలైట్..
Lava Bold N2 5G | దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ తన తాజా 5జి స్మార్ట్‌ఫోన్ లావా బోల్డ్ ఎన్2 5జిని అధికారికంగా విడుదల చేసింది. బోల్డ్ సిరీస్ విస్తరణలో భాగంగా వచ్చిన ఈ ఫోన్, తక్కువ ధరలో నమ్మకమైన 5జి అనుభవాన్ని కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని అందుబాటులోకి వచ్చింది.
Technology | Published On Jun 3, 2026, 1.24 pm IST
Lava Bold N2 5G | దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ తన తాజా 5జి స్మార్ట్‌ఫోన్ లావా బోల్డ్ ఎన్2 5జిని అధికారికంగా విడుదల చేసింది. బోల్డ్ సిరీస్ విస్తరణలో భాగంగా వచ్చిన ఈ ఫోన్, తక్కువ ధరలో నమ్మకమైన 5జి అనుభవాన్ని కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 17.13 సెంటీమీటర్ల (6.75 ఇంచుల) హెచ్‌డీ ప్లస్ నాచ్ డిస్‌ప్లేను అందించారు. 120హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్, గేమింగ్ మరింత స్మూత్‌గా ఉంటాయి. అలాగే ఫోన్‌కు ఐపీ64 రేటింగ్ ను ఇచ్చారు. దీంతో దుమ్ము, నీటి నుంచి ప్రాథమిక రక్షణ లభిస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో ఆక్టా-కోర్ 6ఎన్‌ఎం యూనిసాక్ టి8200 ప్రాసెసర్‌ను అమర్చారు. ఈ చిప్‌సెట్ ఆంటుటు వి11 బెంచ్‌మార్క్‌లో 5 లక్షలకు పైగా స్కోర్ సాధించిందదని లావా వెల్లడించింది. 4జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జీబీ యూఎఫ్‌ఎస్ 2.2 స్టోరేజ్ లభిస్తున్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 6000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఒకే చార్జ్‌తో గరిష్టంగా 815 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలను వీక్షించవచ్చు. అలాగే మొత్తం 743 నిమిషాల స్క్రీన్-ఆన్ టైమ్‌ను అందిస్తుందని పేర్కొంది. బ్యాటరీకి 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. ఫోటోగ్రఫీ కోసం 13 మెగాపిక్సెల్ ప్రధాన రియర్ కెమెరాను, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను అమర్చారు. కనెక్టివిటీ పరంగా 5జీ ఎస్‌ఏ/ఎన్‌ఎస్‌ఏ బ్యాండ్లు, 4జీ వోల్టీ, వై-ఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్‌బీ టైప్-సీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 4జీబీ, 6జీబీ ర్యామ్ ఆప్షన్‌లలో లాంచ్ అయింది.
ధర ఎంతంటే..?
లావా బోల్డ్ ఎన్2 5జి రీగల్ గోల్డ్, బిలియనీర్ బ్లూ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. దీని ధరను రూ.12,999గా నిర్ణయించారు. జూన్ 9 నుంచి అమ్మకాలు ప్రారంభం కానుండగా, ప్రత్యేక ఆఫర్ కింద రూ.11,999కే కొనుగోలు చేసే అవకాశం అందించనున్నారు. అలాగే లావా తన ప్రత్యేక ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ సేవను కూడా ఈ ఫోన్‌తో అందిస్తోంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా వినియోగదారులు సాధారణ సర్వీసింగ్ లేదా సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దే సాంకేతిక సహాయం పొందవచ్చు.
సంబంధిత వార్తలు

Lava Smart 4 | రూ.8,499కే లావా స్మార్ట్‌ఫోన్.. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16..
ఆగస్టు 10, 2026

Motorola | 10,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జి ఫీచర్లతో లాంచ్ అయిన మోటోరోలా కొత్త ట్యాబ్.. ధర ఎంతంటే..
ఆగస్టు 8, 2026

HP OmniPad 12 | విద్యార్థులు, ఉద్యోగులకు హెచ్‌పీ ప్రత్యేక ట్యాబ్.. ఉచిత ఏఐ సబ్స్క్రిప్షన్..
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●Protest | ఎస్సీ హోదా వచ్చే వరకు పోరాటం ఆగదు.. జంతర్ మంతర్‌లో దళిత క్రైస్తవుల ధర్నా..
- ●Bigg Boss Thanuja | కుకు విత్ జాతిరత్నాలు విన్నర్‌గా తనూజ - ప్రైజ్‌మనీ ఎంతంటే?
- ●Malaysia Telangana Association | ఖండాంతరాలు దాటిన తెలంగాణ సంస్కృతి: మలేషియాలో మార్మోగిన 'బోనాలు 2026' సంబురాలు
- ●సాగర్ తీరాన 'వరుణ' వ్యూహం: రేవంత్ యాగానికి గల అసలు పొలిటికల్ అల్గోరిథం!
- ●PRLIS | పాలమూరు డీపీఆర్‌ను వెనక్కి పంపడం దుర్మార్గం : నిరంజన్‌రెడ్డి
- ●Vinod Kumar, Dayakar Rao | గద్దెను కూల్చినంత ఈజీగా.. ప్రజల మనసుల నుంచి పెద్దిని తీసేయలేరు

Protest | ఎస్సీ హోదా వచ్చే వరకు పోరాటం ఆగదు.. జంతర్ మంతర్‌లో దళిత క్రైస్తవుల ధర్నా..

Bigg Boss Thanuja | కుకు విత్ జాతిరత్నాలు విన్నర్‌గా తనూజ - ప్రైజ్‌మనీ ఎంతంటే?

Malaysia Telangana Association | ఖండాంతరాలు దాటిన తెలంగాణ సంస్కృతి: మలేషియాలో మార్మోగిన 'బోనాలు 2026' సంబురాలు

సాగర్ తీరాన 'వరుణ' వ్యూహం: రేవంత్ యాగానికి గల అసలు పొలిటికల్ అల్గోరిథం!



