Jio PC | పాత కంప్యూటర్‌కు కొత్త ఊపిరి.. జియో నుంచి సరికొత్త క్లౌడ్ పీసీ..
Jio PC | రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ సేవగా జియోపీసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా కొత్త హార్డ్‌వేర్ కొనుగోలు చేయకుండానే ఇప్పటికే ఉన్న ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌ను క్లౌడ్ ఆధారిత పీసీగా మార్చుకోవచ్చు. రోజురోజుకూ నెమ్మదిస్తున్న పాత కంప్యూటర్‌ను మార్చే ముందు ఈ సేవను ప్రయత్నించవచ్చని జియో చెబుతోంది.
Technology | Published On Sep 4, 2026, 11.46 am IST
Jio PC | రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ సేవగా జియోపీసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా కొత్త హార్డ్‌వేర్ కొనుగోలు చేయకుండానే ఇప్పటికే ఉన్న ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌ను క్లౌడ్ ఆధారిత పీసీగా మార్చుకోవచ్చు. రోజురోజుకూ నెమ్మదిస్తున్న పాత కంప్యూటర్‌ను మార్చే ముందు ఈ సేవను ప్రయత్నించవచ్చని జియో చెబుతోంది. ఇప్పటివరకు జియోపీసీ సేవ కేవలం జియోహోమ్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిమితిని జియో తొలగించింది. దేశవ్యాప్తంగా ఏ టెలికాం లేదా బ్రాడ్‌బ్యాండ్ సేవను ఉపయోగిస్తున్న వినియోగదారులైనా జియోపీసీని వినియోగించుకోవచ్చు. పాత కంప్యూటర్ హార్డ్‌వేర్‌ను మరింత శక్తివంతంగా మార్చడమే కాకుండా, కంప్యూటింగ్‌కు అవసరమైన భారమైన పనులను జియో క్లౌడ్‌లో నిర్వహిస్తుంది. వినియోగదారుల వద్ద ఉన్న ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ ఆ క్లౌడ్ పీసీని యాక్సెస్ చేసే సాధనంగా పనిచేస్తుంది.
ప్లాన్లు ఎలా ఉన్నాయి..
సుమారు 3 నుంచి 4 ఏళ్ల వయసున్న కంప్యూటర్లు నెమ్మదించడం, స్టోరేజ్ తగ్గిపోవడం లేదా కొత్త సాఫ్ట్‌వేర్‌ను సరిగ్గా నిర్వహించలేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారికి జియోపీసీని జియో లక్ష్యంగా నిర్ణయించుకుంది. కొత్త కంప్యూటర్ కొనుగోలు చేయడానికి బదులుగా పాత పీసీని మరికొంతకాలం ఉపయోగించుకునే ప్రత్యామ్నాయంగా దీనిని పరిచయం చేసింది. జియోపీసీలో రెండు ప్లాన్లు ఉన్నాయి. స్టాండర్డ్ జియోపీసీ ప్లాన్‌లో 4 వీసీపీయూ, 8 జీబీ ర్యామ్, 500 జీబీ క్లౌడ్ స్టోరేజ్ లభిస్తాయి. దీని ధర రెండు నెలలకు రూ.1వేయి, ఐదు నెలలకు రూ.2వేలు 10+2 నెలలకు రూ.4వేలుగా ఉంది. ఇక జియోపీసీ అల్ట్రా ప్లాన్‌లో 8 వీసీపీయూ, 16 జీబీ ర్యామ్, 1 టీబీ క్లౌడ్ స్టోరేజ్ అందిస్తారు. ఈ ప్లాన్ ధర రెండు నెలలకు రూ.1200, ఐదు నెలలకు రూ.2,500, 10+2 నెలలకు రూ.5వేలుగా నిర్ణయించారు.

5 నిమిషాల్లో రెడీ..
జియోపీసీని ఐదు నిమిషాల్లోపే సెటప్ చేసుకోవచ్చు లేదా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఉన్న డేటాను మరో డివైస్‌కు తరలించాల్సిన అవసరం లేదు. అలాగే కొత్త హార్డ్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సిన పనిలేకపోవడంతో కొత్త కంప్యూటర్ సెటప్‌లో ఎదురయ్యే ఇబ్బందులు కూడా ఉండవు. ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లకే జియోపీసీని పరిమితం చేయకుండా టీవీల్లోనూ ఉపయోగించే అవకాశం కల్పిస్తోంది. సపోర్ట్ చేసే వెబ్ బ్రౌజర్ ద్వారా ఈ సేవను యాక్సెస్ చేయవచ్చు. దీంతో క్లౌడ్ పీసీని ఉపయోగించేందుకు యూజర్ వద్ద ఉన్న కంప్యూటర్‌లో అత్యంత శక్తివంతమైన హార్డ్‌వేర్ ఉండాల్సిన అవసరం లేదు. జియో సెట్‌టాప్ బాక్స్‌తోపాటు కీబోర్డ్, మౌస్ ఉపయోగించి టీవీలో కూడా జియోపీసీని యాక్సెస్ చేయవచ్చు. అంటే టీవీని ప్రాథమిక కంప్యూటర్‌గా కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
పాత పీసీల్లోనూ ఏఐ పనులు..
పాత కంప్యూటర్లకు క్లౌడ్ కంప్యూటింగ్ ఉపయోగపడడానికి కృత్రిమ మేధస్సు కూడా ఒక కారణమని జియో చెబుతోంది. అధిక కంప్యూటింగ్ అవసరమయ్యే పనులు జియో క్లౌడ్ మౌలిక వసతుల్లోనే జరుగుతాయి కాబట్టి, ఎనిమిదేళ్ల వయసున్న కంప్యూటర్లలో కూడా ఆధునిక ఏఐ ఆధారిత అప్లికేషన్లకు అవసరమైన పనితీరును పొందవచ్చని కంపెనీ పేర్కొంది. అయితే జియోపీసీకి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఇది ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లోని అసలు హార్డ్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయదు. క్లౌడ్ పీసీని ఉపయోగించేందుకు నమ్మకమైన ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి. ఇంటర్నెట్ లేకుండా ఈ సేవను ఉపయోగించడం సాధ్యం కాదు.
పరిమితులు ఉన్నాయి..
అలాగే క్లౌడ్ పీసీ ఉబుంటు, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో లిబ్రేఆఫీస్, బ్రౌజర్ ఆధారిత అప్లికేషన్లు ఉంటాయి. దీంతో విండోస్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొన్ని సాఫ్ట్‌వేర్‌లు సంప్రదాయ విండోస్ పీసీలో పనిచేసిన విధంగా ఇక్కడ అందుబాటులో ఉండవు. అయినప్పటికీ వెబ్ బ్రౌజింగ్, డాక్యుమెంట్లపై పని చేయడం, ఆన్‌లైన్ తరగతులకు హాజరుకావడం లేదా క్లౌడ్ ఆధారిత అప్లికేషన్లను ఉపయోగించడం వంటి సాధారణ అవసరాలు ఉన్న వారికి జియోపీసీ ఆసక్తికరమైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. కొత్త కంప్యూటర్‌పై పెద్ద మొత్తంలో ఖర్చు చేయకుండా పాత పీసీని మరికొన్ని సంవత్సరాలు ఉపయోగించుకోవాలనుకునే వారికి ఈ సేవ ఉపయోగపడే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు

Jio Platforms IPO | జియో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. అతిపెద్ద లిస్టింగ్‌కు రంగం సిద్ధం..
ఆగస్టు 29, 2026

Laptop Catches Fire | విమానం ల్యాండ్ అవుతుండగా.. ల్యాప్‌టాప్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
ఆగస్టు 23, 2026

Reliance Jio | జియో బంపర్ ఆఫర్.. కొత్త ప్లాన్‌లో ఏడాదిపాటు అన్ని ఓటీటీలు ఫ్రీ..
ఆగస్టు 10, 2026
తాజావార్తలు
- ●Harsha Kumar | పథకం ప్రకారం సీనియర్లను పార్టీ నుంచి బయటకు పంపిస్తున్నారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్
- ●Nepal Floods | నేపాల్ వరదల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు కార్మికులు
- ●Gold And Silver Prices Today | ఇన్వెస్టర్లకు అలర్ట్.. బులియన్ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు..
- ●Volkswagen | వోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు.. 2030 నాటికి లక్ష ఉద్యోగాలు కట్..
- ●IndiGo plane hits pole | ల్యాండింగ్ వేళ పోల్‌ను ఢీ కొట్టిన విమానం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన
- ●SIR | ముసాయిదా ఓటర్ల జాబితా.. కాంగ్రెస్ ఎంపీ పేరు మాయం

Harsha Kumar | పథకం ప్రకారం సీనియర్లను పార్టీ నుంచి బయటకు పంపిస్తున్నారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్

Nepal Floods | నేపాల్ వరదల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు కార్మికులు

Gold And Silver Prices Today | ఇన్వెస్టర్లకు అలర్ట్.. బులియన్ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు..

Volkswagen | వోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు.. 2030 నాటికి లక్ష ఉద్యోగాలు కట్..



