itel Vista Tab 30 | చవక ధరకే ఐటెల్ నుంచి కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్.. భారీ బ్యాటరీ కూడా..!
itel Vista Tab 30 | ఐటెల్ కంపెనీ విస్టాట్యాబ్ 30 పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ట్యాబ్ చాలా పలుచగా కేవలం 8 ఎంఎం మందాన్ని మాత్రమే కలిగి ఉండడమే కాకుండా తక్కువ బరువు కూడా ఉంటుంది. కేవలం 550 గ్రాముల బరువుతో ఈ ట్యాబ్‌ను రూపొందించారు.
Technology | Published On Dec 23, 2025, 5.42 pm IST
itel Vista Tab 30 | ఐటెల్ కంపెనీ విస్టాట్యాబ్ 30 పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ట్యాబ్ చాలా పలుచగా కేవలం 8 ఎంఎం మందాన్ని మాత్రమే కలిగి ఉండడమే కాకుండా తక్కువ బరువు కూడా ఉంటుంది. కేవలం 550 గ్రాముల బరువుతో ఈ ట్యాబ్‌ను రూపొందించారు. కనుక చాలా సులభంగా దీన్ని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లవచ్చు. ఈ ట్యాబ్‌లో పలు ఆకర్షణీయమైన ఫీచర్లను అందించడంతోపాటు ఈ ట్యాబ్ ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఇందులో 11 ఇంచుల డిస్‌ప్లే ఉండగా దీనికి ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. అలాగే 450 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్ ఫీచర్ లభిస్తుంది. కనుక ట్యాబ్ డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు.
ఈ ట్యాబ్‌లో 128జీబీ వరకు స్టోరేజ్ లభిస్తుంది. 12జీబీ ర్యామ్‌ను ఇచ్చారు. 4జీబీ భౌతికంగా లభిస్తుంది. మరో 8జీబీ వరకు ర్యామ్‌ను అదనంగా వర్చువల్‌గా పెంచుకోవచ్చు. దీని వల్ల ర్యామ్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ట్యాబ్ వేగంగా పనిచేస్తుంది. ఇక ఈ ట్యాబ్‌కు వెనుక వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఆడియో కోసం డ్యుయల్ స్పీకర్లను ఏర్పాటు చేశారు. కనుక సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది.

భారీ బ్యాటరీ..
ఈ ట్యాబ్‌లో యూనిసోక్ టి606 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. కనుక బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా వస్తుంది. అలాగే 10 వాట్ల చార్జర్‌ను దీంతోపాటు ఇస్తున్నారు. కనుక ట్యాబ్‌ను వేగంగా చార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ ట్యాబ్ వైఫై, సెల్యులార్ రెండు ఆప్షన్‌లలోనూ అందుబాటులో ఉంది. కనుక ఇందులో సిమ్ కూడా వేసుకోవచ్చు. దీంతో నెట్ సౌకర్యం ఎక్కడంటే అక్కడ లభిస్తుంది. ఈ ట్యాబ్‌లో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇచ్చారు. ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా లభిస్తుంది. దీన్ని చాట్ జీపీటీతో అనుసంధానం చేసి అందిస్తున్నారు. కనుక ఇన్‌బిల్ట్‌గా చాట్ జీపీటీ సేవలు లభిస్తాయి. ఇక ఇందులో పిల్లలు నేర్చుకునేందుకు వీలుగా కె-12 కంటెంట్ పేరిట ప్రత్యేక పాఠ్యాంశాలను కూడా అందిస్తున్నారు.
ఐటెల్ విస్టాట్యాబ్ 30 ఆండ్రాయిడ్ ట్యాబ్ ధర రూ.11,999 ఉండగా, ఈ ట్యాబ్‌ను స్పేస్ గ్రే, స్కై బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదల చేశారు. ఈ ట్యాబ్‌ను కొనుగోలు చేసిన వారికి రూ.1,999 విలువైన లెదర్ బ్యాక్ కవర్‌ను ఉచితంగా అందిస్తున్నారు. దేశంలో ఉన్న అన్ని రిటెయిల్ స్టోర్స్‌లోనూ ఈ ట్యాబ్‌ను ప్రస్తుతం విక్రయిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Itel | గృహోపకరణాల రంగంలోకి ఐటెల్.. చవక ధరలకే స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషిన్లు..
ఆగస్టు 15, 2026

Flipkart Summer Sale | ఫ్లిప్కార్ట్లోనూ సమ్మర్ సేల్.. ఎప్పటి నుంచి అంటే..
మే 5, 2026

OnePlus Summer Sale | వన్‌ప్లస్ ప్రత్యేక సమ్మర్ సేల్.. ఫోన్లు, ట్యాబ్‌లపై భారీ తగ్గింపు ధరలు..
మే 4, 2026
తాజావార్తలు
- ●Faria Abdullah | బోనాల జాతరలో పాల్గొనడంపై విమర్శలు - ఫరియా అబ్దుల్లా ఎమోషనల్
- ●Harish Rao vs Revanth Reddy | నీ ఊరికి వస్తా.. రుణమాఫీ జరిగి ఉంటే నేనే రాజీనామా చేస్తా
- ●Samantha | కత్తి పట్టిన సమంత - నాలుగేళ్ల తర్వాత మాతృభాషలోకి రీఎంట్రీ - మాస్టర్ చెఫ్ ప్రోమో రిలీజ్
- ●CM Revanth Reddy | ఎంతమందికైనా సరే.. పెన్షన్లు ఇస్తాం
- ●MLA Rajagopal Reddy | మీనాక్షికి చెప్పినా భయపడా.. నాకు చెప్పే బదులు రేవంత్‌కు చెప్పండి
- ●Prabhas Fauzi | ఇదేం వెరైటీ - ప్రభాస్ ఫౌజీ పోస్టర్‌పై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్

Faria Abdullah | బోనాల జాతరలో పాల్గొనడంపై విమర్శలు - ఫరియా అబ్దుల్లా ఎమోషనల్

Harish Rao vs Revanth Reddy | నీ ఊరికి వస్తా.. రుణమాఫీ జరిగి ఉంటే నేనే రాజీనామా చేస్తా

Samantha | కత్తి పట్టిన సమంత - నాలుగేళ్ల తర్వాత మాతృభాషలోకి రీఎంట్రీ - మాస్టర్ చెఫ్ ప్రోమో రిలీజ్

CM Revanth Reddy | ఎంతమందికైనా సరే.. పెన్షన్లు ఇస్తాం



