OnePlus Summer Sale | వన్‌ప్లస్ ప్రత్యేక సమ్మర్ సేల్.. ఫోన్లు, ట్యాబ్‌లపై భారీ తగ్గింపు ధరలు..
OnePlus Summer Sale | మొబైల్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ భారత్‌లోని వినియోగదారులకు వేసవి సందర్భంగా ప్రత్యేక సమ్మర్ సేల్‌ను ప్రారంభించనుంది. ఇందులోవన్‌ప్లస్‌కు చెందిన పలు ఉత్పత్తులను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. అలాగే ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తున్నారు.
OnePlus Summer Sale | మొబైల్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ భారత్‌లోని వినియోగదారులకు వేసవి సందర్భంగా ప్రత్యేక సమ్మర్ సేల్‌ను ప్రారంభించనుంది. ఇందులోవన్‌ప్లస్‌కు చెందిన పలు ఉత్పత్తులను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. అలాగే ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తున్నారు. ఉత్పత్తులను నో కాస్ట్ ఈఎంఐ విధానంలోనూ కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు, ఆడియో డివైస్‌లను ఈ సేల్‌లో విక్రయిస్తున్నట్లు వన్‌ప్లస్ తెలిపింది. వన్‌ప్లస్ 13 సిరీస్‌కు చెందిన ఫోన్లపై ఈ సేల్‌లో అద్భుతమైన ఆఫర్‌లను ఇస్తున్నారు. వన్‌ప్లస్ 13 ఫోన్‌ను రూ.7వేల డిస్కౌంట్, రూ.5వేల బ్యాంక్ ఆఫర్ మొత్తం కలిపి రూ.12వేల తగ్గింపు ధరకు ఇస్తున్నారు. తగ్గింపు అనంతరం ఈ ఫోన్ రూ.57,999కు అందుబాటులో ఉంది.
వన్‌ప్లస్ ఫోన్లపై..
వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్‌పై రూ.3వేల డిస్కౌంట్, రూ.2వేల బ్యాంక్ ఆఫర్ మొత్తం కలిపి రూ.5వేల డిస్కౌంట్ లభిస్తుండగా, తగ్గింపు అనంతరం ఈ ఫోన్‌ను వినియోగదారులు రూ.37,999కు కొనుగోలు చేయవచ్చు. అలాగే వన్ ప్లస్ 13ఎస్ ఫోన్‌పైరూ.5వేల డిస్కౌంట్, రూ.3వేల బ్యాంక్ ఆఫర్ మొత్తం కలిపి రూ.8వేల డిస్కౌంట్ పొందవచ్చు.తగ్గింపు అనంతరం ఈ ఫోన్ రూ.46,999కి అందుబాటులో ఉంది. అలాగే వన్‌ప్లస్ 15 సిరీస్‌లో వన్‌ప్లస్ 15 ఫోన్‌పై రూ.4వేల బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తున్నారు. తగ్గింపు అనంతరం దీన్ని రూ.73,999కి కొనవచ్చు. వన్‌ప్లస్ 15ఆర్ ఫోన్‌పై రూ.2వేల డిస్కౌంట్, రూ.2వేల బ్యాంక్ ఆఫర్‌ను ఇస్తుండగా, మొత్తం కలిపి రూ.2వేల తగ్గింపు ధర లభిస్తోంది. డిస్కౌంట్ పోను దీన్ని రూ.50,999కి కొనవచ్చు. ఈ సేల్‌లో వన్‌ప్లస్ నార్డ్ 6 ఫోన్‌ను రూ.2వేల బ్యాంక్ డిస్కౌంట్ అనంతరం రూ.36,999కి కొనుగోలు చేయవచ్చు.ఈ ఫోన్లపై 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు.
ట్యాబ్‌లు, బడ్స్‌పై..
ఈ సేల్‌లో వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ ట్యాబ్‌ను రూ.3వేల తగ్గింపు అనంతరం రూ.14,999కి కొనవచ్చు. వన్‌ప్లస్ ప్యాడ్ గో2పై రూ.3వేల డిస్కౌంట్‌ను ఇస్తుండగా, దీన్ని రూ.24,999కి పొందవచ్చు. వన్‌ప్లస్ ప్యాడ్ 3 ట్యాబ్‌ను రూ.1వేయి డిస్కౌంట్ అనంతరం రూ.48,999కి, వన్‌ప్లస్ ప్యాడ్ 4ను రూ.5వేల తగ్గింపుతో రూ.54,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ట్యాబ్‌లపై కూడా గరిష్టంగా 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని ఇస్తున్నారు. ఇక సేల్‌లో వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్‌లెస్ జడ్3 ఇయర్ బడ్స్, బుల్లెట్స్ వైర్‌లెస్ జడ్2 ఏఎన్‌సీ, నార్డ్ బడ్స్ 3ఆర్, బడ్స్ 3, బడ్స్ 3 ప్రొ, బడ్స్ 4 ప్రొ, వన్‌ప్లస్ బడ్స్ 4, బడ్స్ ప్రొ 3 తదితర ఆడియో ఉత్పత్తులపై కూడా తగ్గింపు ధరలను ఇస్తున్నారు. ఈ సేల్ మే 8 నుంచి ప్రారంభం కానుండగా ముగింపు తేదీని వెల్లడించలేదు. అందువల్ల వినియోగదారులు స్టాక్ అయిపోయేలోపు ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ సేల్ వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు వన్‌ప్లస్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, బ్లింకిట్ వంటి అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ఏకకాలంలో ప్రారంభం కానుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Google Assistant | ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇక పూర్తిగా జెమిని ఏఐ.. గూగుల్ అసిస్టెంట్‌కు గుడ్‌బై..
ఆగస్టు 7, 2026

POCO M8 Power 5G | 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
ఆగస్టు 5, 2026

OnePlus | వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్.. ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..
ఆగస్టు 4, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | స్వాతంత్య్రమంటే విముక్తి పొందడమే కాదు.. ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు అందడం
- ●Google Health Guardian | గూగుల్ నుంచి హెల్త్ గార్డియన్.. ఆరోగ్యంపై 24 గంటల నిఘా..
- ●Abhijeet Dipke | స్వాతంత్య్ర దినోత్సవం రోజున మా గొంతు అణచివేసే ప్రయత్నం : సీజేపీ
- ●PM Modi | కోటి మందికి AI శిక్షణ, పోటీ పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్.. ప్రధాని మోదీ కీలక ప్రకటనలు
- ●Ramchandar Rao | ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచాం.. రాష్ట్రాన్ని మరింత అప్పులపాలు చేస్తున్నరు
- ●Mahindra Scorpio Lifestyler | మహీంద్రా కొత్త స్కార్పియో లైఫ్‌స్టైలర్ పికప్ ట్రక్.. హైలక్స్కు గట్టి పోటీ..

Ponnam Prabhakar | స్వాతంత్య్రమంటే విముక్తి పొందడమే కాదు.. ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు అందడం

Google Health Guardian | గూగుల్ నుంచి హెల్త్ గార్డియన్.. ఆరోగ్యంపై 24 గంటల నిఘా..

Abhijeet Dipke | స్వాతంత్య్ర దినోత్సవం రోజున మా గొంతు అణచివేసే ప్రయత్నం : సీజేపీ

PM Modi | కోటి మందికి AI శిక్షణ, పోటీ పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్.. ప్రధాని మోదీ కీలక ప్రకటనలు



