Itel | గృహోపకరణాల రంగంలోకి ఐటెల్.. చవక ధరలకే స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషిన్లు..
Itel | మొబైల్స్ తయారీ సంస్థ ఐటెల్ భారత్‌లో గృహోపకరణాల రంగంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తమ సంస్థ నుంచి నూతన శ్రేణిలో వాషింగ్ మెషిన్లు, స్మార్ట్ టీవీలను శనివారం లాంచ్ చేసింది. ఈ కొత్త సిరీస్‌లో 3 వాషింగ్ మెషిన్ మోడల్స్, పలు రకాల డిస్‌ప్లే సైజుల్లో టీవీలను ఆవిష్కరించింది.
Itel | మొబైల్స్ తయారీ సంస్థ ఐటెల్ భారత్‌లో గృహోపకరణాల రంగంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తమ సంస్థ నుంచి నూతన శ్రేణిలో వాషింగ్ మెషిన్లు, స్మార్ట్ టీవీలను శనివారం లాంచ్ చేసింది. ఈ కొత్త సిరీస్‌లో 3 వాషింగ్ మెషిన్ మోడల్స్, పలు రకాల డిస్‌ప్లే సైజుల్లో టీవీలను ఆవిష్కరించింది. ఇవి దేశంలోని అన్ని ప్రధాన రిటెయిల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఈ ఉత్పత్తులను చాలా చవక ధరలకే అందిస్తున్నట్లు తెలియజేసింది.
3 రకాల వాషింగ్ మెషిన్ మోడల్స్..
ఐటెల్ లాంచ్ చేసిన కొత్త వాషింగ్ మెషిన్లలో ఐటెల్ డబ్ల్యూఎం105ఎస్ఏ, డబ్ల్యూఎం095ఎస్ఏ, డబ్ల్యూఎం080ఎస్ఏ మోడల్స్ ఉన్నాయి. ఇవి వరుసగా 10.5 కిలోలు, 9.5, 8 కిలోల సామర్థ్యంతో వచ్చాయి. వీటిల్లో దృఢమైన గ్లాస్ టైప్ టాప్ డిజైన్‌ను ఇచ్చారు. అందువల్ల చూసేందుకు ఆకర్షణీయంగా ప్రీమియం లుక్‌లో కనిపిస్తాయి. వీటికి ఐపీఎక్స్4 రేటింగ్ ఉండగా, ట్రై ఫ్లో వాటర్‌ఫాల్, ఫుల్ గ్లాస్ కర్వ్‌డ్ ప్యానెల్, 6 వింగ్స్ పల్సేటర్, ఫుల్ గ్లాస్ ప్యానెల్ వంటి ఫీచర్లను ఇచ్చారు.
టీవీల వివరాలు..
టీవీ పోర్ట్‌ఫోలియోలో ఐటెల్ సంస్థ గూగుల్ క్యూడీ మినీ ఎల్ఈడీ, క్యూఎల్ఈడీ, ఆండ్రాయిడ్ క్యూఎల్ఈడీ పేరుతో పలు సిరీస్‌లలో టీవీ మోడల్స్‌ను లాంచ్ చేసింది. వీటిల్లో క్యూడీ మినీ ఎల్ఈడీ టీవీలు 55 నుంచి 65 ఇంచుల స్క్రీన్ సైజుల్లో లాంచ్ అవగా, క్యూఎల్ఈడీ టీవీలు 43 నుంచి 55 ఇంచుల సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే క్యూఎల్ఈడీ టీవీలు 32 నుంచి 43 ఇంచుల డిస్‌ప్లే సైజుల్లో లభిస్తున్నాయి. వీటిల్లో క్యూఎల్ఈడీ టెక్నాలజీని అందించారు. అందువల్ల పిక్చర్ క్వాలిటీ బాగుంటుందని కంపెనీ తెలిపింది. అలాగే ఫోన్‌లకు కనెక్టివిటీ, స్క్రీన్ మిర్రరింగ్, హెచ్‌డీఎంఐ, ఏఆర్‌సీ కనెక్టివిటీ, మెరుగైన ఆడియో వంటి సదుపాయాలను సైతం ఇచ్చారు.
ధరలు ఎంతంటే..
ఐటెల్ డబ్ల్యూఎం105ఎస్ఏ మోడల్ సిరీస్ వాషింగ్ మెషిన్ల ప్రారంభ ధర రూ.12,699 ఉండగా, డబ్ల్యూఎం095ఎస్ఏ, డబ్ల్యూఎం080ఎస్ఏ మోడల్స్ ప్రారంభ ధరలు వరుసగా రూ.12,099, రూ.9,999గా ఉన్నాయి. ఐటెల్ టీవీ మోడల్స్ ప్రారంభ ధర రూ.12,069గా ఉంది. కాగా తమ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా వేయికి పైగా సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Samsung The Big Bespoke AI Fest 2026 | శాంసంగ్ ఇండియా ఫెస్టివల్ సేల్.. ఏఐ గృహోపకరణాలపై భారీ తగ్గింపు ధరలు..
మార్చి 20, 2026

Amazon World Cup Sale 2026 | అమెజాన్‌లో వరల్డ్ కప్ సేల్.. టీవీలు, ప్రొజెక్టర్లపై 65 శాతం డిస్కౌంట్..
ఫిబ్రవరి 3, 2026

itel Vista Tab 30 | చవక ధరకే ఐటెల్ నుంచి కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్.. భారీ బ్యాటరీ కూడా..!
డిసెంబర్ 23, 2025
తాజావార్తలు
- ●OpenAI | చాట్ జీపీటీ ఇక మరింత వేగవంతం.. అప్‌గ్రేడ్ చేసిన ఓపెన్ ఏఐ..
- ●Megastar | గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని అర్ధరాత్రి దారి తప్పిన మెగాస్టార్ - సాయం చేసిన అభిమాని
- ●Earthquake | ఇండోనేషియాలో మరోసారి భూకంపం.. 40 మంది మృతి
- ●CM Revanth Reddy | నా మీదనో, మహేశ్ గౌడ్ మీదనో చేతబడి చేస్తే ఎదుర్కొంటాం : సీఎం రేవంత్ రెడ్డి
- ●CM Revanth Reddy | మాయగాళ్ల మాయలో పడకండి.. ప్రతి 6 నెలలకు ఉద్యోగ నోటిఫికేషన్లు : సీఎం రేవంత్ రెడ్డి
- ●Omar Abdullah | అదే జరిగిఉంటే.. పీవోకే ప్రజలు ఎప్పుడో జమ్ము కశ్మీర్లో కలిసిపోయేవారు : ఒమర్ అబ్దుల్లా

OpenAI | చాట్ జీపీటీ ఇక మరింత వేగవంతం.. అప్‌గ్రేడ్ చేసిన ఓపెన్ ఏఐ..

Megastar | గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని అర్ధరాత్రి దారి తప్పిన మెగాస్టార్ - సాయం చేసిన అభిమాని

Earthquake | ఇండోనేషియాలో మరోసారి భూకంపం.. 40 మంది మృతి

CM Revanth Reddy | నా మీదనో, మహేశ్ గౌడ్ మీదనో చేతబడి చేస్తే ఎదుర్కొంటాం : సీఎం రేవంత్ రెడ్డి



