iPhone 18 Pro | ఐఫోన్ 18 యూజర్లకు షాక్.. పనిచేయని ఫేస్ ఐడీ..
iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ లో ఫేస్ ఐడీని ఉపయోగించే సమయంలో ఫోన్ అకస్మాత్తుగా ఫ్రీజ్ అయి, కొంతసేపటి తర్వాత రీస్టార్ట్ అవుతున్నట్లు పలువురు యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. రీస్టార్ట్ అయిన తర్వాత ఫోన్ మళ్లీ లాక్ స్క్రీన్‌కు వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమస్య ఎంతమంది యూజర్లను ప్రభావితం చేస్తుందనే విషయం ప్రస్తుతానికి స్పష్టంగా తెలియలేదు.
Technology | Published On Sep 22, 2026, 2.18 pm IST
iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ లో ఫేస్ ఐడీని ఉపయోగించే సమయంలో ఫోన్ అకస్మాత్తుగా ఫ్రీజ్ అయి, కొంతసేపటి తర్వాత రీస్టార్ట్ అవుతున్నట్లు పలువురు యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. రీస్టార్ట్ అయిన తర్వాత ఫోన్ మళ్లీ లాక్ స్క్రీన్‌కు వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమస్య ఎంతమంది యూజర్లను ప్రభావితం చేస్తుందనే విషయం ప్రస్తుతానికి స్పష్టంగా తెలియలేదు. ఐఫోన్ 18 ప్రొ, ఐఫోన్ 18 ప్రొ మ్యాక్స్ వినియోగదారులందరికీ ఈ సమస్య ఎదురవుతున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ, యాపిల్ తాజా ప్రొ మోడళ్లలో ఫేస్ ఐడీకి సంబంధించి పలు రకాల సమస్యలపై ఫిర్యాదులు వెలువడుతున్నాయి. ఫేస్ ఐడీ సమస్య ఒక్క సందర్భానికే పరిమితం కాలేదని తెలుస్తోంది. మ్యాక్‌రూమర్స్ నివేదికను ఉటంకిస్తూ 9టు5మ్యాక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ రెడిట్ యూజర్ యాప్‌ను అన్‌లాక్ చేసేందుకు ఫేస్ ఐడీని ఉపయోగించే సమయంలో సమస్య ఎదురైనట్లు తెలిపారు. అటువంటి సందర్భాల్లో ఐఫోన్ 18 ప్రొ స్పందించకుండా నిలిచిపోతుందని, ఆ తర్వాత రీస్టార్ట్ అయి మళ్లీ లాక్ స్క్రీన్‌కు వస్తుందని పేర్కొన్నారు.
సెటప్ సమయంలోనూ ఇబ్బందులు..
మ్యాక్‌రూమర్స్ ఫోరమ్‌లోనూ ఇలాంటి ఫిర్యాదులే కనిపిస్తున్నాయి. కొంతమంది ఐఫోన్ 18 ప్రొ యూజర్లు ఫేస్ ఐడీని సెటప్ చేసే సమయంలో ఫేస్ ఐడీ అందుబాటులో లేదు అనే సందేశం కనిపించిందని చెబుతున్నారు. మరికొందరు ఫేస్ ఐడీ కోసం అటెన్షన్ అవసరం అనే ఆప్షన్‌ను ఆన్ చేసినప్పటికీ ఫోన్ ప్రతిసారీ ఆ సెట్టింగ్‌ను సరిగ్గా పాటించడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. తాజా ప్రొ మోడళ్లలో యాపిల్ ఫేస్ ఐడీ హార్డ్‌వేర్‌లో మార్పులు చేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. డైనమిక్ ఐలాండ్ పరిమాణాన్ని మరింత తగ్గించేందుకు ఇన్‌ఫ్రారెడ్ కెమెరాను డిస్‌ప్లే కింద, పైభాగంలోని ఎడమ వైపున అమర్చినట్లు తెలుస్తోంది. ఈ హార్డ్‌వేర్ మార్పులకు ప్రస్తుతం నమోదవుతున్న ఫేస్ ఐడీ సమస్యలకు ఏమైనా సంబంధం ఉందా అనే విషయం మాత్రం స్పష్టంగా తెలియలేదు.
సాఫ్ట్‌వేర్ కారణమా..?
ఈ సమస్యలకు సాఫ్ట్‌వేర్ కారణం కూడా కావచ్చని తెలుస్తోంది. మ్యాక్‌రూమర్స్ ప్రకారం భవిష్యత్తులో విడుదలయ్యే ఐఓఎస్ 27 అప్‌డేట్‌లో యాపిల్ ఫేస్ ఐడీకి సంబంధించిన బగ్‌లను పరిష్కరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఐఫోన్ 18 ప్రొ లేదా ఐఫోన్ 18 ప్రొ మ్యాక్స్ మోడళ్లన్నింటినీ ఈ సమస్య ప్రభావితం చేస్తోందని చెప్పడానికి ఆధారాలు లేవు. ఇప్పటివరకు పరిమిత సంఖ్యలో యూజర్ల నుంచి మాత్రమే ఫిర్యాదులు రావడంతో సమస్య తీవ్రత, విస్తృతి ఎంతవరకు ఉందనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●BJP Ramchandar Rao | మమ్మల్ని ఆపితే రైతుల ఉద్యమం ఆగదు
- ●Mahaveer Karna | కర్ణుడిగా లారెన్స్ - 150 కోట్లతో తెలుగు డైరెక్టర్ తమిళ మైథాలజీ మూవీ
- ●KTR | కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం వల్లే రిమ్స్‌లో అగ్నిప్రమాదం
- ●Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం
- ●Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
- ●MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా

BJP Ramchandar Rao | మమ్మల్ని ఆపితే రైతుల ఉద్యమం ఆగదు

Mahaveer Karna | కర్ణుడిగా లారెన్స్ - 150 కోట్లతో తెలుగు డైరెక్టర్ తమిళ మైథాలజీ మూవీ

KTR | కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం వల్లే రిమ్స్‌లో అగ్నిప్రమాదం

Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం






