త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

iPhone 17e | ఐఫోన్ 17 సిరీస్‌లో కొత్త ఫోన్‌.. చ‌వ‌క ధ‌ర‌కే ల‌భ్యం..

iPhone 17e | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న ఐఫోన్ స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను మ‌రింత విస్త‌రించింది. ఐఫోన్ 17 సిరీస్‌లో ఇంకాస్త త‌క్కువ ధ‌ర‌కే ల‌భించేలా కొత్త‌గా ఐఫోన్ 17ఇ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో ఆధునిక హార్డ్‌వేర్‌తోపాటు యాపిల్ సొంతంగా అభివృద్ధి చేసిన క‌నెక్టివిటీ ఫీచ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు.

S

Technology | Published On Mar 3, 2026, 10.45 am IST

iPhone 17e | ఐఫోన్ 17 సిరీస్‌లో కొత్త ఫోన్‌.. చ‌వ‌క ధ‌ర‌కే ల‌భ్యం..
Advertisement

iPhone 17e | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న ఐఫోన్ స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను మ‌రింత విస్త‌రించింది. ఐఫోన్ 17 సిరీస్‌లో ఇంకాస్త త‌క్కువ ధ‌ర‌కే ల‌భించేలా కొత్త‌గా ఐఫోన్ 17ఇ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో ఆధునిక హార్డ్‌వేర్‌తోపాటు యాపిల్ సొంతంగా అభివృద్ధి చేసిన క‌నెక్టివిటీ ఫీచ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు. ఐఫోన్ 17ఇ ఫోన్‌లో నూత‌నంగా ఎ19 చిప్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 6-కోర్ సీపీయూ ఉంటుంది. ఇది ఐఫోన్ 11 క‌న్నా రెండింత‌ల వేగంతో ప‌నిచేస్తుంద‌ని యాపిల్ తెలియ‌జేసింది. అలాగే 4-కోర్ జీపీయూను కూడా ఇచ్చారు. గేమింగ్ కోసం ఇది అద్భుతంగా ప‌నిచేస్తుంది. ఈ ఫోన్‌లో 16-కోర్ న్యూర‌ల్ ఇంజిన్ ఉంది. దీని స‌హాయంతో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచ‌ర్ల‌ను మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా అందించేందుకు వీలు క‌లుగుతుంద‌ని యాపిల్ తెలియ‌జేసింది.

అద్భుత‌మైన డిస్‌ప్లే..

యాపిల్ లాంచ్ చేసిన ఐఫోన్ 17ఇ ఫోన్‌లో C1X మోడెమ్ ను ఇచ్చారు. అందువ‌ల్ల ఈ ఫోన్ ఐఫోన్ ఎయిర్ వేగంతో ప‌నిచేస్తుంది. గ‌త ఐఫోన్ 16ఇలో ఉన్న సి1 మోడెమ్‌తో పోలిస్తే సి1ఎక్స్ మోడెమ్ రెండింతల వేగం అందిస్తుంద‌ని, ఐఫోన్ 16ప్రొ లోని మోడెమ్‌తో పోలిస్తే 30 శాతం త‌క్కువ శ‌క్తిని వినియోగిస్తుంద‌ని యాపిల్ తెలిపింది. ఐఫోన్ 17ఇ ఫోన్‌ను సాధార‌ణ స్మార్ట్ ఫోన్ డిజైన్‌లో తీర్చిదిద్దారు. ఏరోస్పేస్‌-అల్యూమినియం గ్రేడ్ చాసిస్‌తో రూపొందించారు. ఈ ఫోన్‌కు ఐపీ68 డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్‌ను కూఆ అందిస్తున్నారు. ఇందులో 6.1 ఇంచుల సూప‌ర్ రెటీనా ఎక్స‌డీఆర్ ఓలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది హెచ్‌డీఆర్ స‌పోర్ట్‌ను క‌లిగి ఉండ‌డంతోపాటు సూర్య‌కాంతిలోనూ స్పష్టంగా తెర‌ను వీక్షించేందుకు 1200 నిట్స్ వ‌ర‌కు పీక్ బ్రైట్ నెస్‌ను అందిస్తుంది.

ప్ర‌త్యేక యాక్ష‌న్ బ‌ట‌న్‌..

ఐఫోన్ 17ఇ ఫోన్‌కు ముందు భాగంలో సెరామిక్ షీల్డ్ ప్రొటెక్ష‌న్ ఉంది. యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్‌ను ఇచ్చారు. గ‌త ఐఫోన్ల‌తో పోలిస్తే ఈ ఫోన్ డిస్‌ప్లే మూడు రెట్లు ఎక్కువ స్క్రాచ్ రెసిస్టెన్స్‌ను క‌లిగి ఉంటుంది. ఇందులో బ‌యోమెట్రిక్ ధ్రువీక‌ర‌ణ కోసం ఫేస్ ఐడీని ఇచ్చారు. అద‌నంగా యాక్ష‌న్ బ‌ట‌న్ ను కూడా ఏర్పాటు చేశారు. దీని స‌హాయంతో వినియోగ‌దారులు ప్ర‌త్యేక ఫంక్ష‌న్లు లేదా షార్ట్ క‌ట్ కీ ల‌ను ఫిజిక‌ల్ ప్రెస్‌కు మ్యాప్ చేసుకోవ‌చ్చు. ఐఫోన్ 17ఇ లో వెనుక వైపు సింగిల్ లెన్స్‌ను ఇచ్చారు. ఇది 48 MP Fusion కెమెరా కాగా డిఫాల్ట్‌గా 24 MP లో షూట్ చేస్తుంది. యూజ‌ర్లు కావాల‌నుకుంటే కెమెరాలో 48 MP రిజ‌ల్యూష‌న్‌ను మార్చుకోవ‌చ్చు. అలాగే 2ఎక్స్ మేర ఆప్టిక‌ల్ జూమ్ ల‌భిస్తుంది.

4K వీడియోల రికార్డింగ్‌..

వ్యక్తులు లేదా పెంపుడు జంతువులను గుర్తించినప్పుడు డెప్త్ సమాచారం ఆటోమేటిక్‌గా క్యాప్చర్ అవుతుంది. ఫొటో తీసిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్ బ్లర్‌ను సవరించుకునే అవకాశం ఉంటుంది. మెరుగైన చర్మ రంగులు, షాడోస్, హైలైట్స్‌లో డీటెయిల్స్‌ను అలాగే ఉంచేందుకు అప్‌డేటెడ్ HDR ప్రాసెసింగ్ ఇచ్చారు. 4K డాల్బీ విజ‌న్‌ వీడియోను 60 fps తో రికార్డ్ చేసుకోవ‌చ్చు. స్పేషియ‌ల్ ఆడియోను క్యాప్చర్ చేస్తుంది. దీన్ని ఎయిర్ పాడ్స్‌ లేదా యాపిల్ విజ‌న్ ప్రొ తో ఉపయోగించవచ్చు. అదనంగా మెషీన్ లెర్నింగ్ ఆధారిత నాయిస్ క్యాన్సిలేష‌న్‌ను కూడా అందించారు. ఐఫోన్ 17ఇ ఫోన్‌లో డిఫాల్ట్‌గా ఐఓఎస్ 26 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ల‌భిస్తుంది. యూఎస్‌బీ టైప్ సి ద్వారా చార్జింగ్ చేసుకోవ‌చ్చు. ఫాస్ట్ చార్జింగ్‌ను ఇచ్చారు క‌నుక ఫోన్‌ 30 నిమిషాల్లో 50 శాతం మేర చార్జింగ్ అవుతుంది. అలాగే వైర్ లెస్ చార్జింగ్‌కు కూడా స‌పోర్ట్‌ను ఇచ్చారు.

ఆఫ్‌-గ్రిడ్ క‌మ్యూనికేష‌న్ టూల్స్‌..

ఇత‌ర లేటెస్ట్ ఐఫోన్ మోడ‌ల్స్ మాదిరిగానే ఐఫోన్ 17ఇ లోనూ ఆఫ్‌-గ్రిడ్ క‌మ్యూనికేష‌న్ టూల్స్‌ను యాపిల్ అంద‌జేసింది. శాటిలైట్ క‌నెక్టివిటీ (ఎంపిక చేసిన దేశాల్లో), క్రాష్ డిటెక్ష‌న్ వంటి ఫీచ‌ర్ల‌ను ఈ ఫోన్‌లో ఇచ్చారు. 256GB / 512GB స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేయ‌గా, డ్యుయ‌ల్ సిమ్ (నానో + ఇ-సిమ్‌) ల‌ను వేసుకోవ‌చ్చు. ముందు వైపు 12 MP ట్రూ డెప్త్ కెమెరాను ఇచ్చారు. 5జి, గిగాబిట్ ఎల్‌టీఈ, వైఫై 7, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ధ‌ర వివ‌రాలు..

ఐఫోన్ 17ఇ ఫోన్‌ను బ్లాక్‌, వైట్‌, సాఫ్ట్ పింక్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో లాంచ్ చేశారు. 128జీబీ వెర్ష‌న్‌ను నిలిపివేసిన‌ట్లు యాపిల్ తెలిపింది. క‌నుక బేస్ వేరియెంట్ 256జీబీ స్టోరేజ్‌లో ల‌భిస్తుంది. దీని ధ‌ర రూ.64,900గా ఉంది. అమెరికాలో 599 డాల‌ర్లు (దాదాపుగా రూ.54,935)గా ఉంది. 512జీబీ మోడల్ ధ‌ర‌ను రూ.84,900గా నిర్ణ‌యించారు. ఈ ఫోన్‌కు గాను యాపిల్ ఇప్ప‌టికే ప్రీ ఆర్డ‌ర్లను ప్రారంభించ‌గా భార‌త్ స‌హా 70కి పైగా దేశాల్లో మార్చి 11 నుంచి విక్ర‌యించ‌నున్నారు.

Advertisement
Advertisement