త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

iPhone 17e వ‌చ్చేస్తోంది.. ప్రీమియం సెగ్మెంట్‌లో లాంచ్.. తేదీ ఎప్పుడంటే..?

iPhone 17e | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్.. iPhone 17 సిరీస్‌తో ఇప్పటికే iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max వంటి ప‌వ‌ర్ ఫుల్‌ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇప్పుడు అదే సిరీస్‌లో కొత్తగా iPhone 17e మోడల్‌ను 2026 తొలి త్రైమాసికంలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి.

S

Technology | Published On Jan 25, 2026, 10.07 am IST

iPhone 17e వ‌చ్చేస్తోంది.. ప్రీమియం సెగ్మెంట్‌లో లాంచ్.. తేదీ ఎప్పుడంటే..?
Advertisement

iPhone 17e | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్.. iPhone 17 సిరీస్‌తో ఇప్పటికే iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max వంటి ప‌వ‌ర్ ఫుల్‌ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇప్పుడు అదే సిరీస్‌లో కొత్తగా iPhone 17e మోడల్‌ను 2026 తొలి త్రైమాసికంలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది విడుదలైన iPhone 16e తో పోలిస్తే, ఈ కొత్త మోడల్‌లో ప్రాసెసింగ్ స్పీడ్, కెమెరాల‌లో గణనీయమైన మార్పులు ఉండనున్నట్లు సమాచారం. సోష‌ల్ మీడియాలో లీకైన వివ‌రాల ప్రకారం, iPhone 17e లో 6.1 ఇంచుల ProMotion OLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్‌తో వచ్చే ఈ స్క్రీన్ వినియోగదారులకు స్మూత్ విజువల్ అనుభవాన్ని అందిస్తుంది.

చిన్న చిన్న డిజైన్ మార్పుల‌తో..

ఈ ఫోన్‌లో నూత‌న జ‌న‌రేష‌న్‌కు చెందిన యాపిల్ A19 ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారని, దానికి తోడు 8GB RAM, 128GB స్టోరేజ్ మోడ‌ల్‌ బేస్ వేరియంట్‌గా ఉండొచ్చని తెలుస్తోంది. అయితే iPhone 17 సిరీస్‌లోని ఇతర మోడళ్ల మాదిరిగానే కనీసం 256GB స్టోరేజ్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని మరికొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే, దాదాపు 4005mAh కెపాసిటీ క‌లిగిన బ్యాటరీ ఉండనుందని, 7.5W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్‌ ఇవ్వనుందని సమాచారం. డిజైన్ పరంగా iPhone 16e తరహాలోనే iPhone 17e కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే చిన్న చిన్న డిజైన్ మార్పులు చేయవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

వెనుక వైపు 48MP కెమెరా..

కెమెరా విభాగంలో వెనుక వైపు ఒకే ఒక్క సెన్సార్ ను ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే దాని కెపాసిటీ ఎక్కువ‌గానే ఉంటుంద‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే 48MP కెమెరాను వెనుక వైపు ఇస్తార‌ని తెలుస్తోంది. దీనికి సెంటర్ స్టేజ్ ఫీచ‌ర్‌ను అందించ‌నున్నార‌ని స‌మాచారం. అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కూడా ఇవ్వ‌నున్న‌ట్లు తెలిసింది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 18MP ఫ్రంట్ కెమెరా అందించనున్నారని సమాచారం. ఇది iPhone 17 సిరీస్‌లోని ఇతర మోడళ్లకు సమానంగా ఉండనుంది. ప్రస్తుతం యాపిల్ నుంచి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, iPhone 17e భారత్‌లో 2026 మార్చి 7వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ధర విషయానికి వస్తే, దాదాపు రూ.64,900 ప్రారంభ ధరగా ఉండొచ్చని అంచనా. ఇది iPhone 16e ప్రారంభ ధరతో పోలిస్తే కొద్దిగా ఎక్కువగా ఉండనుంది.

కాగా ప్రాసెసర్ పనితీరు, కెమెరా కెపాసిటీ, డిస్‌ప్లే నాణ్యతలో చిన్న చిన్న మార్పుల‌తో iPhone 17e ఫోన్‌ను ప్రీమియం సెగ్మెంట్ లో అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే ఈ ఫోన్ కూడా హిట్ అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక ఈ ఫోన్‌పై యాపిల్ త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌నుంద‌ని స‌మాచారం.

Advertisement

తాజావార్తలు

Advertisement