త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

iPhone 17 Pro | భారీ త‌గ్గింపు ధ‌ర‌కు ఐఫోన్ 17 ప్రొ ఫోన్‌.. రూ.50వేల వ‌ర‌కు డిస్కౌంట్‌..

iPhone 17 Pro | ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల‌ను యాపిల్ ఇటీవ‌లే విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. ఈ ఫోన్ల‌కు వినియోగ‌దారుల నుంచి సైతం భారీ ఎత్తున స్పంద‌న ల‌భిస్తోంది. అయితే ఈ ఫోన్ల‌లో ఐఫోన్ 17 ప్రొ ఫోన్‌కు గాను ప్ర‌స్తుతం భారీగా డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

S

Technology | Published On Feb 4, 2026, 6.56 am IST

iPhone 17 Pro | భారీ త‌గ్గింపు ధ‌ర‌కు ఐఫోన్ 17 ప్రొ ఫోన్‌.. రూ.50వేల వ‌ర‌కు డిస్కౌంట్‌..
Advertisement

iPhone 17 Pro | ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల‌ను యాపిల్ ఇటీవ‌లే విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. ఈ ఫోన్ల‌కు వినియోగ‌దారుల నుంచి సైతం భారీ ఎత్తున స్పంద‌న ల‌భిస్తోంది. అయితే ఈ ఫోన్ల‌లో ఐఫోన్ 17 ప్రొ ఫోన్‌కు గాను ప్ర‌స్తుతం భారీగా డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ప్రీమియం డిజైన్‌, అద్భుత‌మైన ప‌నితీరు, అత్యాధునిక కెమెరాల‌తో ఐఫోన్ 17 ప్రొ ఫోన్లు యాపిల్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటుండ‌గా, ఈ మోడ‌ల్స్‌ను ఇప్పుడు త‌క్కువ ధ‌ర‌కే కొనుగోలు చేసే అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ లో ఐఫోన్ 17 ప్రొ ఫోన్‌కు చెందిన 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ ను తగ్గింపు ధ‌ర‌కు అందిస్తున్నారు. ఈ ఫోన్ లాంచింగ్ ధ‌ర రూ.1,34,900 ఉండ‌గా దీనిపై ప్ర‌స్తుతం భారీ త‌గ్గింపును అందిస్తున్నారు.

రూ.50వేల వ‌ర‌కు భారీ డిస్కౌంట్‌..

పాత స్మార్ట్ ఫోన్‌ను వినియోగ‌దారులు ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.44,350 వ‌ర‌కు త‌గ్గింపును పొంద‌వ‌చ్చు. ఎక్స్‌ఛేంజ్ విలువ ఫోన్ మోడ‌ల్‌, కండిష‌న్‌ను బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంది. ఇక గ‌రిష్టంగా ఎక్స్ఛేంజ్ ఆఫ‌ర్‌ను వ‌ర్తింప‌జేస్తే ఐఫోన్ 17 ప్రొ ఫోన్ ధ‌ర రూ.90,550కి త‌గ్గుతుంది. దీనిపై ప‌లు బ్యాంకుల‌కు చెందిన కార్డుల‌తో డిస్కౌంట్‌ను కూడా పొంద‌వ‌చ్చు. ముఖ్యంగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంకు క్రెడిట్ కార్డుల‌తో చెల్లింపులు చేస్తే రూ.3వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. ఇలా ఈ రెండు ఆఫ‌ర్ల అనంత‌రం ఐఫోన్ 17 ప్రొ ఫోన్ ధ‌ర రూ.85,550గా మారుతుంది. ఈ క్ర‌మంలో లాంచ్ ధ‌ర‌తో పోలిస్తే ఈ ఫోన్ ధ‌ర దాదాపు రూ.50వేలు త‌గ్గుతుంది. ఇలా ఈ ఫోన్‌పై భారీ ఎత్తున డిస్కౌంట్‌ను పొంద‌వచ్చు.

అదిరిపోయే ఫీచర్లు..

ఐఫోన్ 17 ప్రొ ఫోన్‌లో ఫీచ‌ర్లు కూడా ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి. 6.3 ఇంచుల సూప‌ర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓలెడ్ డిస్‌ప్లేను ఇందులో అమర్చారు. 120 హెడ్జ్ ప్రొ మోష‌న్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల డిస్‌ప్లే అద్భుత‌మైన క్వాలిటీని క‌లిగి ఉంటుంది. అలాగే ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఫీచ‌ర్ కూడా ఇందులో ఉంది. సూర్యకాంతిలోనూ స్పష్టంగా క‌నిపించే విధంగా ఈ ఫోన్ డిస్‌ప్లేకు 3000 నిట్స్ వ‌ర‌కు పీక్ బ్రైట్ నెస్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు సెరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్ష‌న్ కూడా ఉంది. హెచ్‌డీఆర్ 10 ప్ల‌స్‌, డాల్బీ విజ‌న్‌, వైడ్ క‌ల‌ర్ పి3 వంటి అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ఇందులో యాపిల్ నూత‌న జ‌న‌రేష‌న్ ఎ19 ప్రొ చిప్‌ను అమ‌ర్చారు. దీని వ‌ల్ల ఫోన్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇస్తుంది. అలాగే 12జీబీ ర్యామ్ ల‌భిస్తుంది. వైఫై 7, బ్లూటూత్ 6.0 వంటి స‌దుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి.

ట్రిపుల్ రియ‌ర్‌ కెమెరాలు..

ఐఫోన్ 17 ప్రొ వెనుక వైపు 3 కెమెరాలు ఉండ‌గా అన్నింటికీ 48 మెగాపిక్స‌ల్ రిజ‌ల్యూషన్‌ను ఇచ్చారు. వాటిలో ఒక కెమెరా టెలిఫొటో లెన్స్‌గా ప‌నిచేస్తుంది. ఇంకో కెమెరా అల్ట్రా వైడ్ ప‌నిత‌నాన్ని క‌లిగి ఉంటుంది. టెలిఫొటో కెమెరా ద్వారా ఏకంగా 8ఎక్స్ వ‌ర‌కు ఆప్టిక‌ల్ జూమ్ ల‌భిస్తుంది. ముందు వైపు 18 మెగాపిక్స‌ల్ కెమెరాను ఇచ్చారు. దీనికి 4కె హెచ్‌డీఆర్ వీడియో స‌పోర్ట్‌ను ఇచ్చారు. ఈ ఫోన్‌లో ఐఓఎస్ 26ను అందిస్తున్నారు. ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు సిల్వ‌ర్‌, కాస్మిక్ ఆరెంజ్‌, డీప్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో అందుబాటులో ఉంది. అయితే ధ‌ర త‌గ్గిన నేప‌థ్యంలో ఐఫోన్‌ను కొనాల‌ని చూస్తున్న వారికి దీన్ని బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్ప‌వ‌చ్చు.

Advertisement
Advertisement