iPhone 16 Price | ఐఫోన్ 16 ఫోన్ ధర బాగా తగ్గింది.. రూ.40వేలకే కొనవచ్చు..
iPhone 16 Price | క్రిస్మస్‌తోపాటు నూతన సంవత్సరం సందర్బంగా ఇప్పటికే పలు ఈ-కామర్స్ సైట్లు, స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ప్రత్యేక సేల్స్‌ను ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటెయిల్ స్టోర్ సంస్థ క్రోమా కూడా ఐఫోన్లకు ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది.
Technology | Published On Dec 20, 2025, 5.21 pm IST
iPhone 16 Price | క్రిస్మస్‌తోపాటు నూతన సంవత్సరం సందర్బంగా ఇప్పటికే పలు ఈ-కామర్స్ సైట్లు, స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ప్రత్యేక సేల్స్‌ను ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటెయిల్ స్టోర్ సంస్థ క్రోమా కూడా ఐఫోన్లకు ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. ఇందులో భాగంగా పలు ఐఫోన్లను తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. క్రిస్మిస్, న్యూ ఇయర్ సందర్భంగా ఈ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు క్రోమా తెలియజేసింది. డిసెంబర్ 15వ తేదీన ప్రారంభం అయిన ఈ సేల్ జనవరి 4వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని క్రోమా రిటెయిల్ స్టోర్స్‌లో ఈ సేల్ అందుబాటులో ఉందని అన్నారు. ఇందులో భాగంగా ఐఫోన్ 16ను భారీ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చని తెలిపారు.
ఈ సేల్‌లో వినియోగదారులు ఐఫోన్ 16ను రూ.40,990కే కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు ఆఫర్లతోపాటు ఎక్స్‌ఛేంజ్ ధర పోను ఆ మొత్తానికి ఐఫోన్ 16 ఫోన్‌ను వినియోగదారులు కొనవచ్చు. ఈ ఫోన్ ధర వాస్తవానికి రూ.65,990 ఉండగా, దీనిపై పలు ఎంపిక చేసిన బ్యాంకులకు చెందిన కార్డులతో రూ.3వేల క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అలాగే పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.16వేల వరకు ఇస్తారు. దీనిపై మరో రూ.6వేలను ఎక్స్‌ఛేంజ్ బోనస్ గా పొందవచ్చు. దీంతో ఫోన్ ధర భారీగా తగ్గుతుంది. ఈ క్రమంలో ఫోన్‌ను రూ.40,990కి కొనవచ్చు.
కాగా యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ 17 ఫోన్లు ప్రస్తుతం వినియోగంలో ఉన్నప్పటికీ ఐఫోన్ 16 ఫోన్లకు కూడా డిమాండ్ బాగానే ఉండడం విశేషం. వినియోగదారులు ఈ ఫోన్లను కూడా ఎక్కువగానే కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఆఫర్ వల్ల మరింత ఎక్కువ మంది ఈ ఫోన్‌ను కొంటారని తెలుస్తోంది. ఇక ఐఫోన్ 16 ఫోన్‌లో యాపిల్‌కు చెందిన ఎ18 చిప్‌సెట్ ఉండగా, 8జీబీ ర్యామ్ లభిస్తుంది. దీని వల్ల ఫోన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. రోజువారి పనులను చక్కగా నిర్వహించుకోవచ్చు. అలాగే వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. దీంతో చాలా తక్కువ కాంతిలోనూ అద్భుతమైన ఫొటోలను తీసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్‌కు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు. కనుక ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఐఫోన్ కోసం చూస్తుంటే ఇదే చక్కని అవకాశం అని చెప్పవచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






