త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

iPhone 16 | న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఐఫోన్ 16 ధ‌ర భారీగా తగ్గింపు..

iPhone 16 | నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా అనేక ఈ-కామ‌ర్స్ సైట్లు, కంపెనీలు ఇప్ప‌టికే ప్ర‌త్యేక సేల్స్‌ను నిర్వ‌హిస్తున్నాయి. అనేక కంపెనీల‌కు చెందిన ఉత్ప‌త్తుల‌ను భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కే అందిస్తున్నారు. అందులో భాగంగానే టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ కూడా క‌స్ట‌మ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది.

S

Technology | Published On Dec 26, 2025, 5.16 pm IST

iPhone 16 | న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఐఫోన్ 16 ధ‌ర భారీగా తగ్గింపు..
Advertisement

iPhone 16 | నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా అనేక ఈ-కామ‌ర్స్ సైట్లు, కంపెనీలు ఇప్ప‌టికే ప్ర‌త్యేక సేల్స్‌ను నిర్వ‌హిస్తున్నాయి. అనేక కంపెనీల‌కు చెందిన ఉత్ప‌త్తుల‌ను భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కే అందిస్తున్నారు. అందులో భాగంగానే టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ కూడా క‌స్ట‌మ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ఐఫోన్ 16 ధ‌ర‌ను భారీగా త‌గ్గిస్తున్న‌ట్లు తెలియజేసింది. ఫ్లిప్ కార్ట్‌లో వినియోగ‌దారులు ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ త‌గ్గింపు ధ‌ర‌ను అందిస్తున్నారు. ఐఫోన్ 16కు చెందిన 256జీబీ స్టోరేజ్ మోడ‌ల్‌పై ఈ ఆఫ‌ర్‌ను ప్ర‌స్తుతం అందుబాటులో ఉంచారు.

ఐఫోన్ 16కు చెందిన 256జీబీ స్టోరేజ్ మోడల్ ధ‌ర రూ.89,900 ఉండగా, ప్ర‌స్తుతం ఈ ఫోన్ ధ‌ర‌ను రూ.20వేల‌కు పైగా త‌గ్గించారు. దీంతో ఈ ఫోన్‌ను రూ.67,999కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. దీంతోపాటు క‌స్ట‌మ‌ర్లు ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే మ‌రో రూ.2వేల వ‌ర‌కు త‌గ్గింపును పొంద‌వ‌చ్చు. ఇలా ఈ ఫోన్ ధ‌ర మ‌రింత త‌గ్గుతుంది. ఈ ఫోన్‌ను ప్ర‌స్తుతం 5 క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో అందిస్తున్నారు. బ్లాక్‌, పింక్‌, టీల్, అల్ట్రా మెరీన్‌, వైట్ రంగుల్లో అందుబాటులో ఉంది.

ఇక ఐఫోన్ 16 ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే ఇందులో 6.1 ఇంచుల సూప‌ర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి సెరామిక్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్ష‌న్ ల‌భిస్తుంది. ఈ ఫోన్‌లో యాపిల్‌కు చెందిన ఎ18 ప్రాసెస‌ర్ ఉండ‌గా, 5 కోర్ గ్రాఫిక్స్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ లో యూజ‌ర్ల‌కు ఐఓఎస్ 18 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ డిఫాల్ట్‌గా ల‌భిస్తుంది. దీన్ని ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న ఐఓఎస్ 26.3 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవ‌చ్చు. ఇక ఈ మోడ‌ల్ లో 8జీబీ ర్యామ్ ల‌భిస్తుంది. వెనుక వైపు 48 మెగాపిక్స‌ల్ కెమెరాతోపాటు మ‌రో 12 మెగాపిక్స‌ల్ కెమెరాను ఇచ్చారు. ముందు వైపు 12 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఇందులో 3561 ఎంఏహెచ్ బ్యాట‌రీ ల‌భిస్తుంది. 25 వాట్ల వైర్ లెస్ ఫాస్ట్ చార్జింగ్‌కు ఇందులో సపోర్ట్ ల‌భిస్తుంది. ఐఫోన్‌ను కొనాల‌ని చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆఫ‌ర్‌గా చెప్ప‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement