త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

iOS 26 Tips And Features | మీ ఐఫోన్‌లో ఐఓఎస్ 26 ఉందా..? అయితే ఈ టిప్స్ తెలుసుకోండి..!

iOS 26 Tips And Features | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న ఐఫోన్ల‌కు గాను త‌ర‌చూ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ అప్‌డేట్స్‌తోపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను కూడా రిలీజ్ చేస్తుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే లేటెస్ట్‌గా ఐఓఎస్ 26ను కూడా ఇటీవ‌లే రిలీజ్ చేసింది. ఈ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ అనేక ఫోన్ల‌లో అందుబాటులో ఉంది.

S

Technology | Published On Jan 6, 2026, 7.47 am IST

iOS 26 Tips And Features | మీ ఐఫోన్‌లో ఐఓఎస్ 26 ఉందా..? అయితే ఈ టిప్స్ తెలుసుకోండి..!
Advertisement

iOS 26 Tips And Features | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న ఐఫోన్ల‌కు గాను త‌ర‌చూ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ అప్‌డేట్స్‌తోపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను కూడా రిలీజ్ చేస్తుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే లేటెస్ట్‌గా ఐఓఎస్ 26ను కూడా ఇటీవ‌లే రిలీజ్ చేసింది. ఈ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ అనేక ఫోన్ల‌లో అందుబాటులో ఉంది. అయితే మీరు గ‌న‌క ఐఓఎస్ 26కు అప్‌డేట్ అయి ఉంటే ఇప్పుడు చెప్ప‌బోయే కొన్ని టిప్స్‌ను మాత్రం క‌చ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే వీటి వ‌ల్ల మీరు మీ ఐఫోన్‌ను మ‌రింత సుల‌భంగా, వేగంగా ఉప‌యోగించుకోవ‌చ్చు. ఐఫోన్ల వాడకం సౌక‌ర్య‌వంతంగా ఉండాల‌ని యాపిల్ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త టిప్స్‌ను త‌న ఐఓఎస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌లో అందిస్తుంది. ఇక ఐఓఎస్ 26లోనూ అలాంటి కొన్ని టిప్స్ యూజ‌ర్ల‌కు అందుబాటులో ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

లాక్ స్క్రీన్ ఎడిటింగ్‌..

ఐఓఎస్ 26లో యూజ‌ర్లు లాక్ స్క్రీన్‌ను సుల‌భంగా ఎడిట్ చేయ‌వ‌చ్చు. స్క్రీన్‌ను ట‌చ్ చేసి ప‌ట్టుకుంటే ఎడిట్ ఆప్ష‌న్ ద‌ర్శ‌నమిస్తుంది. అందులో క్లాక్ ఫాంట్, క‌ల‌ర్‌ను సెలెక్ట్ చేసుకోవ‌చ్చు. గ్లాస్ ఎఫెక్ట్ ను సైతం ఎనేబుల్ చేయ‌వ‌చ్చు. క్లాక్‌ను రీసైజ్ చేస్తూ సైజ్ మార్చుకోవ‌చ్చు. వాల్ పేప‌ర్‌ను సెలెక్ట్ చేసేట‌ప్పుడు ఏదైనా స్పేషియ‌ల్ సీన్‌ను ఎంచుకోవ‌చ్చు. దీంతో స‌పోర్టెడ్ ఫొటోల‌కు మోష‌న్ ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. ఇక మీ రొటీన్‌కు త‌గిన‌ట్లు విడ్జెట్ల‌ను మీకు కావ‌ల్సిన విధంగా అమ‌ర్చుకోవ‌చ్చు. అలాగే త్వ‌ర‌గా యాక్సెస్ చేసేందుకు గాను కంట్రోల్ సెంట‌ర్ బ‌టన్స్‌ను కూడా మార్చుకోవ‌చ్చు. అదేవిధంగా హోమ్ స్క్రీన్‌ను ట‌చ్ చేసి ప‌ట్టుకుంటే ఎడిట్ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. ఆ త‌రువాత క‌స్ట‌మైజ్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. అందులో క్లియ‌ర్‌గా, టింటెడ్ అయి ఉండే డిఫాల్ట్ ఐకాన్స్ క‌నిపిస్తాయి. క్లియ‌ర్ ఐకాన్స్ వ‌ల్ల వాల్ పేప‌ర్ మ‌న‌కు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. టింటెడ్ ఐకాన్స్ వ‌ల్ల సింగిల్ క‌ల‌ర్ థీమ్‌ను ఫాలో కావచ్చు. మీరు మీ డివైస్ లేదా కేస్ క‌ల‌ర్‌కు అనుగుణంగా ఐకాన్ క‌ల‌ర్స్‌ను మార్చుకోవ‌చ్చు.

స్క్రీన్ షాట్ సెర్చ్‌..

గూగుల్ ఇమేజ్ సెర్చ్ లేదా చాట్ జీపీటీ మాదిరిగానే ఐఫోన్‌లో ఏదైనా స్క్రీన్ షాట్ తీసి దాని గురించి ఆన్‌లైన్‌లో సుల‌భంగా వెద‌క‌వ‌చ్చు. అవ‌స‌రం అనుకుంటే ఆ స్క్రీన్ షాట్‌లో కొంత భాగాన్ని హైలైట్ చేసి దాన్ని కూడా సెర్చ్ చేయ‌వ‌చ్చు. దీని వ‌ల్ల ఫొటోలో ఉన్న వ‌స్తువులు లేదా వ్య‌క్తులు వంటి వాటిని గుర్తించ‌డం సుల‌భ‌త‌రం అవుతుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఐఫోన్ల‌లో ఈ ఫీచ‌ర్ ల‌భిస్తోంది. ఇక అప‌రిచిత వ్య‌క్తుల నుంచి వ‌చ్చే కాల్స్‌తోపాటు స్పామ్ కాల్స్‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు ప్ర‌త్యేకంగా ఫీచర్‌ను కూడా ఇచ్చారు. అలాంటి వారు ఎవ‌రైనా కాల్ చేస్తే ముందుగా త‌మ పేరు చెప్పి, ఎందుకు కాల్ చేస్తున్నారో చెప్పాలి. దీంతో యూజ‌ర్ ఆ వివ‌రాల‌కు అనుగుణంగా కాల్ లిఫ్ట్ చేయాలా, వ‌ద్దా అని నిర్ణ‌యించుకుంటాడు. దీని వ‌ల్ల అపరిచిత వ్య‌క్తులు లేదా స్పామ్ కాల్స్‌ను లిఫ్ట్ చేయ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. ఇక ఈ ఫీచ‌ర్ పొందాలంటే యూజ‌ర్లు ఐఫోన్‌లో ఉన్న సెట్టింగ్స్‌లోకి వెళ్లి కాల్ స్క్రీనింగ్‌ను ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది.

లైవ్ ట్రాన్స్‌లేష‌న్‌..

ఐఫోన్‌కు చెందిన ఐఓఎస్ 26 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌లో మెసేజ్‌ల‌లో ఏదైనా కాంటాక్ట్‌కు గాను బ్యాక్ గ్రౌండ్‌ను కూడా మార్చుకోవ‌చ్చు. బ్యాక్ గ్రౌండ్‌గా ఏదైనా క‌ల‌ర్‌, ఫొటో లేదా ప్రీజెట్‌ను ఎంపిక చేసుకుని సెట్ చేసుకోవ‌చ్చు. ఇక కొత్త ఐఓఎస్‌లో మెసేజ్‌ల‌తోపాటు కాల్స్‌, ఫేస్ టైమ్ క్యాప్ష‌న్స్‌, ఇన్ ప‌ర్స‌న్ సంభాష‌ణ‌ల్లో లైవ్ ట్రాన్స్ లేష‌న్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. దీని వ‌ల్ల అవ‌త‌లి వారు మాట్లాడే మాట‌ల‌ను లైవ్ లో త‌ర్జుమా చేసుకోవ‌చ్చు. ఈ ఫీచ‌ర్ ను కూడా ఆయా ఆప్ష‌న్లలో ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఐఓఎస్ వెర్ష‌న్‌లో కొత్త‌గా జెన్‌మోజీని క్రియేట్ చేసుకునే స‌దుపాయం అందిస్తున్నారు. ఇందుకు గాను ఏదైనా ఎమోజీని ఎంపిక చేసుకుని అనంత‌రం వ‌చ్చే ఆప్ష‌న్‌ల‌లో జెన్‌మోజీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

నూత‌న రింగ్ టోన్లు..

ఐఓఎస్ 26లో గేమ్స్ యాప్ ద్వారా యాప్ స్టోర్‌, యాపిల్ ఆర్కేడ్ గేమ్స్‌ను ఒకే స్క్రీన్‌పై పొంద‌వ‌చ్చు. దీని వ‌ల్ల గేమ్స్‌ను సుల‌భంగా, వేగంగా యాక్సెస్ చేసుకునేందుకు వీలు క‌లుగుతుంది. అలాగే సెట్టింగ్స్‌లోని సౌండ్స్ అండ్ హాప్టిక్స్‌లో ప‌లు నూత‌న రింగ్ టోన్ ఆప్ష‌న్ల‌ను అందిస్తున్నారు. అదేవిధంగా క్లాక్‌లోని అలారం సెక్ష‌న్‌లో స్నూజ్ టైమ్‌ల‌ను సెట్ చేసుకునే ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. ఈ కొత్త ఐఓఎస్ వెర్ష‌న్‌లో సఫారి ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్ లే అవుట్‌ను మార్చేశారు. యూజ‌ర్లు ట్యాబ్‌ల‌ను ఓపెన్ చేసి సుల‌భంగా వెబ్‌సైట్ల‌ను యాక్సెస్ చేయ‌వ‌చ్చు. లే అవుట్స్‌లో మారేందుకు కూడా సుల‌భంగా ఉంటుంది. ఇలా ఐఓఎస్ 26 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌లో ప‌లు నూత‌న స‌దుపాయాలు, టిప్స్‌ను యూజ‌ర్లు పొంద‌వ‌చ్చు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement