త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Instagram Vs Youtube | ఇన్‌స్టాగ్రామ్ వ‌ర్సెస్ యూట్యూబ్‌.. క్రియేట‌ర్ల‌కు ఎందులో ఎక్కువ ఆదాయం వ‌స్తుంది..?

Instagram Vs Youtube | నేటి డిజిట‌ల్ యుగంలో డ‌బ్బు సంపాదించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిల్లో సోష‌ల్ మీడియా ఒక‌టి. ఇందులో ఇన్‌ఫ్లుయెన్స‌ర్లు లేదా క్రియేట‌ర్లుగా కెరీర్ మొద‌లుపెడితే అధిక మొత్తంలో ఆదాయం పొందే అవ‌కాశం ఉండ‌డంతో చాలా మంది ఈ రంగం ప‌ట్ల ఆస‌క్తిని చూపిస్తున్నారు.

S

Technology | Published On Feb 23, 2026, 9.48 am IST

Instagram Vs Youtube | ఇన్‌స్టాగ్రామ్ వ‌ర్సెస్ యూట్యూబ్‌.. క్రియేట‌ర్ల‌కు ఎందులో ఎక్కువ ఆదాయం వ‌స్తుంది..?
Advertisement

Instagram Vs Youtube | నేటి డిజిట‌ల్ యుగంలో డ‌బ్బు సంపాదించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిల్లో సోష‌ల్ మీడియా ఒక‌టి. ఇందులో ఇన్‌ఫ్లుయెన్స‌ర్లు లేదా క్రియేట‌ర్లుగా కెరీర్ మొద‌లుపెడితే అధిక మొత్తంలో ఆదాయం పొందే అవ‌కాశం ఉండ‌డంతో చాలా మంది ఈ రంగం ప‌ట్ల ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అనేక ప్లాట్‌ఫామ్‌లు ఔత్సాహికుల‌కు డ‌బ్బు సంపాదించుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి. అయితే ప్ర‌స్తుతం చాలా మంది యూట్యూబ్‌తోపాటు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ‌గా డ‌బ్బు సంపాదిస్తున్నారు. త‌మ‌కు ప‌ట్టున్న లేదా న‌చ్చిన అంశాల‌ను చెబుతూ వీడియోల‌ను పోస్ట్ చేస్తున్నారు. వాటితోపాటు బ్రాండ్ డీల్స్ ద్వారా కూడా పెద్ద మొత్తంలోనే ఆర్జిస్తున్నారు. అయితే ఇన్‌స్టాగ్రామ్ వ‌ర్సెస్ యూట్యూబ్‌ల‌లో ఏ ప్లాట్‌ఫామ్‌లో ఎక్కువ డ‌బ్బు సంపాదించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది..? అని చాలా మందికి సందేహాలు వ‌స్తుంటాయి. వీటికి టెక్ నిపుణులు స‌మాధానాలు చెబుతున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో..

ఇన్‌స్టాగ్రామ్‌లో యూజ‌ర్లు పెట్టే వీడియోల‌కు ఆ సంస్థ ఎలాంటి డ‌బ్బును ఇవ్వ‌దు. కానీ ఇందులో వేగంగా వృద్ధి ఉంటుంది. త్వ‌ర‌గా ఫాలోవ‌ర్లు పెరిగే అవ‌కాశం ఉంటుంది. ఇన్‌స్టాలో బ్రాండ్ డీల్స్, ప్ర‌మోష‌న్స్‌, స్పాన్స‌ర్డ్ పోస్టులు, బ్రాండ్ రివ్యూలు పెట్టి డ‌బ్బులు సంపాదించుకోవ‌చ్చు. ఫాలోవ‌ర్లు ఎంత ఎక్కువ సంఖ్య‌లో ఉంటే కంపెనీలు త‌మ ఉత్ప‌త్తుల‌ను ప్ర‌మోట్ చేసేందుకు ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల‌కు అంత ఎక్కువ డ‌బ్బును ముట్ట‌జెబుతుంటాయి. భార‌త్‌తోపాటు అనేక దేశాల్లో ఇన్‌స్టాగ్రామ్‌ను అధికంగా వాడుతోంది యువ‌తే అని తేలింది. క‌నుక ఆ విభాగానికి చెందిన యూజ‌ర్లు ఇందులో అధిక సంఖ్య‌లో ఉంటారు. వారికి న‌చ్చే విధంగా రీల్స్ షేర్ చేస్తే త‌క్కువ కాలంలోనే ఫాలోవ‌ర్ల‌ను భారీగా పెంచుకోవ‌చ్చు. అయితే కొన్ని దేశాల్లో క్రియేట‌ర్ల‌కు ఇన్‌స్టాగ్రామ్ బోన‌స్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. కానీ మ‌న దేశంలో ఈ కార్య‌క్ర‌మం ఇంకా అందుబాటులోకి రాలేదు. అయిన‌ప్ప‌టికీ బ్రాండ్ ప్ర‌మోష‌న్స్ ద్వారా ఇన్‌స్టాలో అధిక మొత్తంలో ఆదాయం వ‌స్తుంది.

యూట్యూబ్‌లో..

యూట్యూబ్‌లో క్రియేట‌ర్లు పెట్టే వీడియోల‌కు లేదా షార్ట్స్‌కు వ‌చ్చే ప్ర‌క‌ట‌నల ద్వారా ఆదాయం పొంద‌వ‌చ్చు. అలాగే చాన‌ల్ మెంబ‌ర్‌షిప్‌, సూపర్ చాట్‌, బ్రాండ్ డీల్స్‌, అఫిలియేట్ లింక్స్ అవ‌కాశాలు కూడా ఉంటాయి. ఏదైనా ఎవ‌ర్ గ్రీన్ కంటెంట్ కు చెందిన వీడియోను యూట్యూబ్‌లో పెడితే అది దీర్ఘ‌కాలం పాటు కూడా వ్యూస్‌ను తేవ‌డంతోపాటు డ‌బ్బును సంపాదించిపెడుతుంది. స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను కూడా అందిస్తుంది. అయితే యూట్యూబ్ చాన‌ల్ పెట్టి దాన్ని వృద్ధిలోకి తేవ‌డం, ముఖ్యంగా ఫాలోవ‌ర్ల‌ను, వ్యూస్‌ను పెంచుకోవ‌డం కాస్త క‌ష్టంగా ఉంటుంది. యూట్యూబ్ లో క‌ఠిన రూల్స్ ఉంటాయి. క‌నుక అవ‌న్నీ దాటుకుని చాలా కాలం పాటు కొన‌సాగితేనే ఇందులో చ‌క్క‌ని వృద్ధి, ఆదాయం ల‌భిస్తాయి.

దేన్ని ఎంచుకోవాలి..?

అయితే ఇన్‌స్టాగ్రామ్ వ‌ర్సెస్ యూట్యూబ్‌ల‌లో ఎందులో అధిక సంపాద‌న ఉంటుంద‌ని అడిగితే.. రెండింటిలోనూ స‌మాన అవ‌కాశాలు ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. కానీ ఆదాయం వ‌చ్చే విధానం వేరుగా ఉంటుంది. ముఖ్యంగా క్రియేట‌ర్లు ఎలాంటి వీడియోల‌ను పోస్ట్ చేయాలనుకుంటున్నారు..? అనే అంశాన్ని బ‌ట్టి ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ నిడివి క‌లిగిన వీడియోల‌ను పెట్ట‌డం క‌ష్ట‌మ‌ని భావించే వారు ఇన్‌స్టాగ్రామ్‌ను ట్రై చేయవ‌చ్చు. రీల్స్ ద్వారా ఇందులో త‌క్కువ స‌మ‌యంలోనే గుర్తింపు ల‌భించ‌డంతోపాటు త్వ‌ర‌గా వీడియోలు వైర‌ల్ అయ్యే అవ‌కాశాలు ఉంటాయి. అలాగే ఫాలోవ‌ర్లు వేగంగా వ‌స్తారు క‌నుక డ‌బ్బు సంపాద‌న కూడా వేగంగా ఉంటుంది. ముఖ్యంగా యూట్యూబ్‌తో పోలిస్తే బ్రాండ్ డీల్స్ ఇన్‌స్టాలో అధికంగా ఉంటాయి. అయితే ఎక్కువ నిడివి ఉండే వీడియోల‌ను పోస్ట్ చేసేవారికి యూట్యూబ్ స‌రిగ్గా స‌రిపోతుంది. యూట్యూబ్ చాన‌ల్ ఒక‌సారి స్థిర‌ప‌డితే దీర్ఘ‌కాలం పాటు ఆదాయం స్థిరంగా వ‌స్తుంది. క‌నుక రెండు ప్లాట్‌ఫామ్‌ల‌లోనూ అధిక ఆదాయం పొందే మార్గాలు ఉంటాయి. కానీ ఏ త‌ర‌హా వీడియోల‌ను పోస్ట్ చేయాల‌ని అనుకుంటున్నారు, ఎంత నిడివి ఉండే వీడియోల‌ను చేయాల‌నుకుంటున్నారు.. అనే విష‌యాల‌ను బ‌ట్టి కంటెంట్ క్రియేట‌ర్లు ఎవ‌రికి వారు నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. ఏ ప్లాట్‌ఫామ్ అయినా స‌రే నిరంత‌ర శ్ర‌మ‌, అంకిత భావం ఉంటే కచ్చితంగా రాణిస్తారు.

Advertisement
Advertisement