Instagram | కొత్త పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను ప్రవేశపెట్టనున్న ఇన్‌స్టాగ్రామ్.. నెలకు రుసుము ఎంతంటే..?
Instagram | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా చెల్లింపు ఆధారిత సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్‌ను ఇప్పటికే ఆ సంస్థ అంతర్గతంగా టెస్ట్ చేస్తోంది. ఇందులో భాగంగా పెయిడ్ యూజర్లకు మరిన్ని సదుపాయాలను కల్పించనున్నట్లు సమాచారం.
Technology | Published On Mar 31, 2026, 9.54 am IST
Instagram | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా చెల్లింపు ఆధారిత సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్‌ను ఇప్పటికే ఆ సంస్థ అంతర్గతంగా టెస్ట్ చేస్తోంది. ఇందులో భాగంగా పెయిడ్ యూజర్లకు మరిన్ని సదుపాయాలను కల్పించనున్నట్లు సమాచారం. 24 గంటల తరువాత అదృశ్యం అయ్యే స్టోరీ పోస్టులను సబ్‌స్క్రైబర్లు గోప్యంగా వీక్షించే అవకాశం ఉంటుందని ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా తాజాగా ఏఎఫ్‌పీకి విషయాన్ని వెల్లడించింది. మరోవైపు టెక్ క్రంచ్ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది.
నెలకు 2 డాలర్లు..
పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకునే యూజర్లకు మరో ముఖ్యమైన సౌకర్యాన్ని కూడా కల్పించనున్నారు. స్టోరీ పోస్టుల్లో తమ ఫొటోలు లేదా వీడియోలను ఎవరెవరు చూడగలరో మరింత నియంత్రణ విధించే సౌకర్యం ఉంటుంది. ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ విధానాన్ని ఇన్‌స్టాగ్రామ్ ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో ఎంపిక చేసిన యూజర్లతో టెస్ట్ చేస్తోంది. అయితే ఆయా దేశాల వివరాలను మాత్రం మెటా వెల్లడించలేదు. కానీ టెక్ క్రంచ్ తెలిపిన ప్రకారం ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫీచర్లను జపాన్, మెక్సికో, ఫిలిప్పీన్స్ తదితర దేశాల్లోని యూజర్లతో టెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సబ్‌స్క్రిప్షన్ రుసుము నెలకు 2 డాలర్ల వరకు (దాదాపుగా రూ.190) ఉండే అవకాశం ఉందని సమాచారం.
ఇతర సోషల్ ప్లాట్‌ఫామ్‌లలోనూ..
గతేడాది యూకేలో అమలులో ఉన్న చట్టాలకు అనుగుణంగా మెటా సంస్థ తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రకటనలు లేని పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మోడల్స్‌ను ప్రవేశపెట్టింది. ఇక స్నాప్ చాట్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఇప్పటికే ప్రీమియం చెల్లింపు సేవలను అందిస్తున్నాయి. స్నాప్‌చాట్‌కు చెందిన స్నాప్ సంస్థ ఇటీవల తెలిపిన ప్రకారం తమ ప్రీమియం సేవలకు 2.50 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు వెల్లడించింది. అలాగే ఏడాదికి 1 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించే దిశగా సంస్థ ముందుకు సాగుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే కంటెంట్ క్రియేటర్లకు ప్రత్యేక కంటెంట్ యాక్సెస్ కోసం అభిమానుల నుంచి చార్జీలు వసూలు చేసే సబ్‌స్క్రిప్షన్ మోడల్ అందుబాటులో ఉంది. అలాగే ఖాతా ధ్రువీకరణ కోసం అందించే బ్లూ టిక్, ఇతర సదుపాయాలకు గాను నెలవారి సబ్‌స్క్రిప్షన్ ను కూడా ఇన్‌స్టాగ్రామ్ వసూలు చేస్తోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాలను కలిపి సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే తక్కువ ధరకే మెటా దాన్ని అందిస్తోంది. అయితే కొత్తగా ప్రవేశపెట్టనున్న సబ్‌స్క్రిప్షన్ విధానం వల్ల ఇప్పటికే ఉన్న వాటికి మార్పులు చేస్తారా, లేక ప్రత్యేకంగా మరో విభాగంలో కొత్త మోడల్‌ను అందిస్తారా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






