త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Instagram | ఇన్‌స్టాగ్రామ్ లో భారీ మార్పు.. ఇక మీ ప్రొఫైల్ గ్రిడ్‌ను మీరే రీడిజైన్ చేసుకోవ‌చ్చు..

Instagram | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ త‌న వినియోగదారులకు మరింత స్వేచ్ఛను కల్పించే కొత్త రీఆర్డర్ యువర్ గ్రిడ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త అప్‌డేట్‌తో యూజర్లు తమ ప్రొఫైల్‌లో కనిపించే పోస్టుల క్రమాన్ని తమకు నచ్చిన విధంగా మార్చుకునే అవకాశం ల‌భిస్తుంది.

S

Technology | Published On Jun 9, 2026, 1.54 pm IST

Instagram | ఇన్‌స్టాగ్రామ్ లో భారీ మార్పు.. ఇక మీ ప్రొఫైల్ గ్రిడ్‌ను మీరే రీడిజైన్ చేసుకోవ‌చ్చు..
Advertisement

Instagram | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ త‌న వినియోగదారులకు మరింత స్వేచ్ఛను కల్పించే కొత్త రీఆర్డర్ యువర్ గ్రిడ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త అప్‌డేట్‌తో యూజర్లు తమ ప్రొఫైల్‌లో కనిపించే పోస్టుల క్రమాన్ని తమకు నచ్చిన విధంగా మార్చుకునే అవకాశం ల‌భిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా ప్రొఫైల్ గ్రిడ్‌లోని పోస్టులను రీఅరేంజ్ చేసి ముఖ్యమైన కంటెంట్‌ను హైలైట్ చేయడం, ప్రొఫైల్ లుక్‌ను ఆకర్షణీయంగా మార్చడం, తమ వ్యక్తిగత లేదా బ్రాండ్ గుర్తింపును మరింత మెరుగ్గా ప్రతిబింబించడం సాధ్యమవుతుంది. యూజర్లకు తమ ప్రొఫైల్ కంటెంట్‌ను ఎలా ప్రదర్శించాలనే విషయంలో మరింత ఫ్లెక్సిబిలిటీ అందించడమే దీని లక్ష్యమని ఇన్‌స్టాగ్రామ్ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు.

ఎలా చేయాలి..

ఈ ఫీచర్‌ను ఉపయోగించి పోస్టుల స్థానాలను మార్చడానికి యూజర్లు ప‌లు దశలను అనుసరించాలి. ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కు వెళ్లి గ్రిడ్‌లోని ఏదైనా పోస్టుపై ట్యాప్ చేసి కొద్దిసేపు హోల్డ్ చేయాలి. కనిపించే పాప్-అప్ మెనూలో రీఆర్డర్ గ్రిడ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం పోస్టులను డ్రాగ్ చేసి కావాల్సిన స్థానంలో ఉంచాలి. మార్పులు వెంటనే సేవ్ అవుతాయి, ప్రొఫైల్‌ను సందర్శించే ప్రతి ఒక్కరికీ కనిపిస్తాయి. అయితే ఈ మార్పులు పోస్టుల అసలు తేదీ, క్యాప్షన్ లేదా కంటెంట్‌పై ఎలాంటి ప్రభావం చూపవు. కేవలం ప్రొఫైల్ గ్రిడ్‌లో అవి కనిపించే క్రమం మాత్రమే మారుతుంది. ఈ కొత్త ఫీచర్ ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, వ్యాపార సంస్థలు, సాధారణ వినియోగదారులకు ఉపయోగపడనుంది. దీని ద్వారా అత్యుత్తమ లేదా ఎక్కువ స్పందన పొందిన పోస్టులను ముందుకు తీసుకురావచ్చు. ప్రొఫైల్ లేఅవుట్‌ను కొత్తగా, ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. కొత్తగా వచ్చే సందర్శకులపై మంచి తొలి ముద్ర వేయవచ్చు. వ్యక్తిగత లేదా బ్రాండ్ గుర్తింపును మరింత సమర్థవంతంగా ప్రదర్శించవచ్చు.

రీఆర్డర్ యువర్ గ్రిడ్ ఫీచర్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా విడుదల అవుతోంది. సపోర్ట్ ఉన్న అకౌంట్లలో ఇది పోస్టు ఆప్షన్స్ మెనూలో కనిపిస్తోంది. అందువల్ల కొందరు యూజర్లకు ఇప్పటికే అందుబాటులో ఉండగా, మరికొందరికి రాబోయే రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Advertisement