Myntra | ఇన్‌స్టాగ్రామ్‌లో మింత్రా కొత్త ఫీచర్.. క్రియేటర్లకు భారీ ఆదాయం..
Myntra | భారత్‌లో తన అనుబంధ వాణిజ్య కార్యక్రమాన్ని (అఫిలియేట్ కామర్స్ ప్రోగ్రామ్) ఇన్‌స్టాగ్రామ్‌లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రముఖ ఫ్యాషన్ ఈ-కామర్స్ సంస్థ మింత్రా ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా కంటెంట్ క్రియేటర్లు తమ ఇన్స్టాగ్రామ్ పోస్టులు, రీల్స్‌లో మింత్రా ఉత్పత్తులను నేరుగా ట్యాగ్ చేయవచ్చు.
Technology | Published On Oct 15, 2026, 4.48 pm IST
Myntra | భారత్‌లో తన అనుబంధ వాణిజ్య కార్యక్రమాన్ని (అఫిలియేట్ కామర్స్ ప్రోగ్రామ్) ఇన్‌స్టాగ్రామ్‌లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రముఖ ఫ్యాషన్ ఈ-కామర్స్ సంస్థ మింత్రా ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా కంటెంట్ క్రియేటర్లు తమ ఇన్స్టాగ్రామ్ పోస్టులు, రీల్స్‌లో మింత్రా ఉత్పత్తులను నేరుగా ట్యాగ్ చేయవచ్చు. మెటాతో భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన భారత్‌లోని తొలి లైఫ్‌స్టైల్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ తమదేనని కంపెనీ వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్, మెటా మధ్య భాగస్వామ్యంలో భాగంగా జూన్‌లో ఫేస్‌బుక్‌తో మింత్రా అనుసంధానం ప్రారంభమైంది. అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన నెల రోజుల్లోనే మింత్రాకు 10 లక్షలకు పైగా సైన్అప్లు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటికే 2 లక్షల మంది క్రియేటర్లు కంటెంట్‌ను రూపొందిస్తున్నారు.
13 లక్షల మంది సైన్ అప్..
ఫేస్బుక్లో ఈ కార్యక్రమానికి 13 లక్షల మంది సైన్అప్ చేసుకోగా, వారిలో 6.5 లక్షల మందికి పైగా క్రియేటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ రెండింటిలోనూ అఫిలియేట్ ఫీచర్ ప్రారంభమైనప్పటి నుంచి క్రియేటర్లు సుమారు 30 లక్షల పోస్టులను ప్రచురించారు. వీటి ద్వారా మింత్రా ప్లాట్‌ఫామ్‌కు ట్రాఫిక్ పెరుగుతోందని కంపెనీ తెలిపింది. పండుగల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో మింత్రా యాప్‌కు వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. అదే సమయంలో క్రియేటర్లు రూపొందించే పోస్టుల సంఖ్య కూడా రెండింతలు పెరుగుతుందని భావిస్తోంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో మింత్రా అఫిలియేట్ కార్యక్రమాల్లో పాల్గొనే క్రియేటర్లు, మింత్రా అల్టిమేట్ గ్లామ్క్లాన్ అఫిలియేట్ సభ్యులు, బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ (బీఎఫ్ఎఫ్) సందర్భంగా సాధారణంతో పోలిస్తే మూడు రెట్లు అధిక ఆదాయం సంపాదించే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది.
70 లక్షల మంది వినియోగదారులు..
మింత్రా యాప్‌లో కొనుగోలు చేయగలిగే కంటెంట్‌ను అందించే గ్లామ్స్ట్రీమ్ విభాగానికి 70 లక్షల మంది వినియోగదారులు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై వినియోగదారులు మొత్తం 2 లక్షల గంటల సమయాన్ని వెచ్చిస్తున్నారు. మొత్తం వీక్షణల్లో జెన్‌జీ వినియోగదారుల వాటా 52 శాతంగా ఉందని వెల్లడించింది. యువతలో ఫ్యాషన్ సంబంధిత కంటెంట్‌కు పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ప్రకటన వెలువడిన సందర్భంగా న్యూఢిల్లీలో మింత్రా క్రియేటర్ క్లబ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెటా సహ-ఆతిథ్యంతో జరిగిన ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖ కంటెంట్ క్రియేటర్లు హాజరయ్యారు. వివిధ నగరాల్లో నిర్వహించే ఈ క్రియేటర్ క్లబ్ కార్యక్రమాలు ఆహ్వానం పొందిన వారికి మాత్రమే పరిమితం. క్రియేటర్ల మధ్య చర్చలు, పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడం వీటి ప్రధాన లక్ష్యం.
మింత్రా చేపడుతున్న క్రియేటర్ కామర్స్ కార్యక్రమాల్లో అల్టిమేట్ గ్లామ్క్లాన్, అఫిలియేట్ ప్రోగ్రామ్‌లు, క్రియేటర్లకు ప్రత్యేక స్టోర్‌ఫ్రంట్‌లు, ఎంపిక చేసిన ఉత్పత్తుల కలెక్షన్లు, కొనుగోలు చేయగలిగే ఉత్పత్తుల సిఫారసులు ఉన్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా క్రియేటర్లు తమకంటూ ప్రత్యేక కమ్యూనిటీలను నిర్మించుకోవడంతోపాటు, తమ ఉత్పత్తుల సిఫారసులను ఎక్కువ మందికి చేరవేయవచ్చు. అలాగే తమ ప్రభావాన్ని ఆదాయంగా మార్చుకునే అవకాశాన్ని కూడా మింత్రా కల్పిస్తోంది.
తాజావార్తలు
- ●Raghunandan Rao | ముందు విద్యుత్ కోతలపై సమాధానం చెప్పండి: బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు
- ●Hindu Temple Shooting Plot US | అమెరికాలో హిందూ ఆలయంపై కాల్పుల కుట్ర.. భారత్ సీరియస్
- ●Gayatri Bhardwaj | తెలుగు మైథాలజీ మూవీలో మిస్ ఇండియా విన్నర్ - సందీప్‌కిషన్ కరికాల షురూ
- ●BIG TV Chairman | రిపోర్టర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. క్షణాల్లో 12 లక్షలు పంపిన బిగ్ టీవీ ఛైర్మన్
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ.. 1,533 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
- ●Strait of Hormuz Cargo Ship Sinking | హార్మూజ్ జలసంధిలో మునిగిన కార్గో నౌక.. సముద్రంలో తేలియాడుతున్న ఐఫోన్లు, పెర్ఫ్యూమ్ బాటిళ్లు

Raghunandan Rao | ముందు విద్యుత్ కోతలపై సమాధానం చెప్పండి: బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు

Hindu Temple Shooting Plot US | అమెరికాలో హిందూ ఆలయంపై కాల్పుల కుట్ర.. భారత్ సీరియస్

Gayatri Bhardwaj | తెలుగు మైథాలజీ మూవీలో మిస్ ఇండియా విన్నర్ - సందీప్‌కిషన్ కరికాల షురూ

BIG TV Chairman | రిపోర్టర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. క్షణాల్లో 12 లక్షలు పంపిన బిగ్ టీవీ ఛైర్మన్






