Instagram Instants | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఇన్‌స్టంట్స్ ఫీచర్.. ఫోటోలు చూసిన వెంటనే మాయం..
Instagram Instants | ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా ఇన్‌స్టంట్స్ పేరిట ఓ నూతన ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ క్లోజ్ ఫ్రెండ్స్ లేదా మ్యూచువల్ ఫాలోవర్స్‌తో రియల్‌టైమ్‌లో ఫోటోలను షేర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎలాంటి ఎడిటింగ్ లేకుండా, ఆ క్షణాన్ని అలాగే పంచుకోవడంపై ఈ ఫీచర్ దృష్టి సారించింది. షేర్ చేసిన ఫోటోలు ఒకసారి చూసిన తర్వాత మాయం అవుతాయి. అలాగే 24 గంటల తర్వాత వాటిని తిరిగి చూడలేరు.
Technology | Published On May 14, 2026, 2.19 pm IST
Instagram Instants | ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా ఇన్‌స్టంట్స్ పేరిట ఓ నూతన ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ క్లోజ్ ఫ్రెండ్స్ లేదా మ్యూచువల్ ఫాలోవర్స్‌తో రియల్‌టైమ్‌లో ఫోటోలను షేర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎలాంటి ఎడిటింగ్ లేకుండా, ఆ క్షణాన్ని అలాగే పంచుకోవడంపై ఈ ఫీచర్ దృష్టి సారించింది. షేర్ చేసిన ఫోటోలు ఒకసారి చూసిన తర్వాత మాయం అవుతాయి. అలాగే 24 గంటల తర్వాత వాటిని తిరిగి చూడలేరు. ఇన్‌స్టంట్స్ ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌బాక్స్‌లో లేదా ప్రత్యేక ఇన్‌స్టంట్స్ యాప్‌లో ఉపయోగించవచ్చు. ఇన్‌బాక్స్ కుడి దిగువ భాగంలో కనిపించే చిన్న స్టాక్ ఐకాన్‌పై ట్యాప్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచే వెంటనే ఫోటో తీసి షేర్ చేయొచ్చు. ఈ ఫీచర్‌లో కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి. ఫోటోలు కేవలం రియల్‌టైమ్‌లో మాత్రమే తీసుకోవాలి. ఫోన్ గ్యాలరీ నుంచి ఫోటోలను అప్‌లోడ్ చేయడం సాధ్యం కాదు. ఫోటో పంపించే ముందు క్యాప్షన్ జోడించవచ్చు కానీ ఎలాంటి ఎడిటింగ్‌కు అవకాశం ఉండదు. ఫోటో ఒకసారి చూసిన తర్వాత ఆటోమేటిక్‌గా మాయం అవుతుంది. 24 గంటల తర్వాత కూడా ఆ కంటెంట్ అందుబాటులో ఉండదు.
క్లోజ్ ఫ్రెండ్స్ లేదా మ్యూచువల్ ఫాలోవర్లతోనే..
యూజర్లు తమ క్లోజ్ ఫ్రెండ్స్ లేదా మ్యూచువల్ ఫాలోవర్స్‌తో మాత్రమే ఇన్‌స్టంట్స్ ను షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. రిసీవర్లు ఎమోజీలతో రియాక్ట్ కావచ్చు, రిప్లై ఇవ్వచ్చు, తిరిగి ఇన్‌స్టంట్స్ పంపించవచ్చు. ఈ రిప్లైలు నేరుగా ఇన్‌స్టాగ్రామ్ డీఎంలలో కనిపిస్తాయి. ఇన్‌బాక్స్‌లో ఇన్‌స్టంట్స్ స్టాక్డ్ ప్రివ్యూ రూపంలో కనిపిస్తాయి. ఒకేసారి అనేక ఇన్‌స్టంట్స్ ను వరుసగా పంపేందుకు క్యాప్చర్ బటన్ అందుబాటులో ఉంది. ఫోటో పంపిన వెంటనే అన్‌డూ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. అయితే అది రిసీవర్ ఫోటో చూడకముందే మాత్రమే పనిచేస్తుంది. షేర్ చేసిన అన్ని ఇన్‌స్టంట్స్ ను ప్రైవేట్ ఆర్కైవ్‌లో ఒక సంవత్సరం వరకు స్టోర్ చేస్తారు. ఈ ఆర్కైవ్ నుంచి ఎంపిక చేసిన ఇన్‌స్టంట్స్ ను కలిపి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ కోసం రిక్యాప్ రూపంలో మార్చుకోవచ్చు.
ఎడిటింగ్ కుదరదు..
ఈ ఫీచర్‌లో పలు పరిమితులు కూడా ఉన్నాయి. ఫోటో తీసిన తర్వాత క్యాప్షన్ తప్ప ఇంకే మార్పులు చేయలేరు. గ్యాలరీ నుంచి ఫోటోలు అప్‌లోడ్ చేయడం సాధ్యం కాదు. స్క్రీన్‌షాట్ లేదా స్క్రీన్ రికార్డింగ్‌కు కూడా సపోర్ట్ ఉండదు. కంటెంట్ చూసిన వెంటనే మాయం అవుతుంది. 24 గంటల తర్వాత తిరిగి చూడలేరు. అన్‌డూ ఆప్షన్ కూడా ఫోటో ఓపెన్ చేయకముందే పనిచేస్తుంది. అలాగే ఆర్కైవ్ నుంచి డిలీట్ చేయాలంటే కూడా ఆ ఇన్‌స్టంట్స్ ఎవరూ ఓపెన్ చేయకూడదు. ఇన్‌కమింగ్ ఇన్‌స్టంట్స్ ను తాత్కాలికంగా ఆపేందుకు స్నూజ్ మోడ్ కూడా అందుబాటులో ఉంది. ఇన్‌బాక్స్ స్టాక్‌ను హోల్డ్ చేసి రైట్ స్వైప్ చేస్తే స్నూజ్ యాక్టివేట్ అవుతుంది. మళ్లీ లెఫ్ట్ స్వైప్ చేస్తే ఫీచర్ రీ-ఎనేబుల్ అవుతుంది.

నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే..
ఇన్‌స్టాగ్రామ్ ఇప్పటికే ఉన్న భద్రతా వ్యవస్థలను ఇన్‌స్టంట్స్ కూ వర్తింపజేస్తోంది. బ్లాక్, మ్యూట్, రిస్ట్రిక్ట్, రిపోర్టింగ్ వంటి టూల్స్ ఇందులోనూ పనిచేస్తాయి. అన్ని కంటెంట్‌లు ఇన్‌స్టాగ్రామ్ కమ్యూనిటీ స్టాండర్డ్స్‌కు లోబడి ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘించే కంటెంట్‌ను ఆటోమేటెడ్ సిస్టమ్స్ గుర్తించి తొలగిస్తాయి. ఇన్‌స్టంట్స్ ను ఎంపిక చేసిన వ్యక్తులు మాత్రమే చూడగలుగుతారు. ముఖ్యంగా క్లోజ్ ఫ్రెండ్స్ లేదా మ్యూచువల్ ఫాలోవర్స్‌కే యాక్సెస్ ఉంటుంది. టీనేజ్ యూజర్ల కోసం ప్రత్యేక భద్రతా ఫీచర్లు కూడా జోడించారు. టీన్ అకౌంట్స్, ఫ్యామిలీ సెంటర్‌తో ఇన్‌స్టంట్స్ ఆటోమేటిక్‌గా ఇంటిగ్రేట్ అవుతుంది. ప్రత్యేక సెటప్ అవసరం లేదు. టీన్ సేఫ్టీ ఫీచర్లలో ఇన్‌స్టంట్స్ వినియోగాన్ని కూడా కలుపుకుని డైలీ టైమ్ లిమిట్స్, రాత్రి 10 నుంచి ఉదయం 7 గంటల వరకు నోటిఫికేషన్లు మ్యూట్ అయ్యే స్లీప్ మోడ్, యాప్ మొదటిసారి డౌన్‌లోడ్ చేసినప్పుడు పేరెంట్స్‌కు నోటిఫికేషన్ వంటి అంశాలను ఇచ్చారు. అదనంగా బ్లాక్, మ్యూట్, రిస్ట్రిక్ట్, ఫిల్టర్స్, రిపోర్టింగ్ వంటి భద్రతా టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. స్క్రీన్‌షాట్, స్క్రీన్ రికార్డింగ్‌కు సపోర్ట్ ఉండదు.
దశలవారీగా అందుబాటులోకి..
ఇన్‌స్టాగ్రామ్ కొన్ని దేశాల్లో ప్రత్యేక ఇన్‌స్టంట్స్ యాప్‌ను కూడా టెస్ట్ చేస్తోంది. ఈ యాప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. వేగంగా ఫోటోలు షేర్ చేసేందుకు డైరెక్ట్ కెమెరా యాక్సెస్‌ను ఇది అందిస్తుంది. అయితే ఇది ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో పనిచేస్తుంది. యాప్ ద్వారా పంపిన ఇన్‌స్టంట్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా కనిపిస్తాయి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినవి యాప్‌లో కనిపిస్తాయి. దీంతో రెండు ప్లాట్‌ఫామ్‌ల మధ్య పూర్తి క్రాస్ ప్లాట్‌ఫామ్ కంపాటిబిలిటీ ఉంటుంది. ఇన్‌స్టంట్స్ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో దశలవారీగా విడుదల చేస్తున్నారు. ప్రత్యేక ఇన్‌స్టంట్స్ యాప్ మాత్రం ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో మాత్రమే పరిమిత స్థాయిలో అందుబాటులో ఉంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






