Instagram | ఇన్‌స్టాగ్రామ్ క్యారసెల్ పోస్టులకు భారీ అప్‌డేట్.. ప్రతి స్లైడ్‌కు ప్రత్యేక క్యాప్షన్..
Instagram | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. తన ప్లాట్‌ఫామ్‌లో క్యారసెల్ పోస్టులకు గాను కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మల్టిపుల్ క్యాప్షన్స్ ఆన్ ఎ క్యారసెల్ పేరిట ఈ ఫీచర్‌ను లాంచ్ చేసింది. దీని సహాయంతో యూజర్లు ఒకే క్యారసెల్ పోస్టులోని ప్రతి స్లైడ్‌కు వేర్వేరు క్యాప్షన్లను ఇవ్వవచ్చు.
Technology | Published On Jun 22, 2026, 3.41 pm IST
Instagram | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. తన ప్లాట్‌ఫామ్‌లో క్యారసెల్ పోస్టులకు గాను కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మల్టిపుల్ క్యాప్షన్స్ ఆన్ ఎ క్యారసెల్ పేరిట ఈ ఫీచర్‌ను లాంచ్ చేసింది. దీని సహాయంతో యూజర్లు ఒకే క్యారసెల్ పోస్టులోని ప్రతి స్లైడ్‌కు వేర్వేరు క్యాప్షన్లను ఇవ్వవచ్చు. దీని వల్ల పోస్టులను మరింత స్పష్టంగా, ఆకర్షణీయంగా క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు క్యారసెల్ పోస్టులో ఉన్న అన్ని ఫోటోలు, వీడియోలకు ఒకే క్యాప్షన్‌ను పెట్టుకునే వెసులుబాటు ఉండేది. దీని వల్ల వినియోగదారులు సుదీర్ఘమైన వివరణలు రాయాల్సి వచ్చేది. లేదా చిత్రాల ద్వారా మాత్రమే పోస్టులను వివరించాల్సిన పరిస్థితి ఉండేది. కానీ కొత్త అప్‌డేట్ వల్ల ప్రతి స్లైడ్‌కు ప్రత్యేకంగా టెక్ట్స్ యాడ్ చేయవచ్చు. దీంతో పని మరింత సులభతరం అవుతుంది.
ఇలా యాక్టివేట్ చేయాలి..
ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి వినియోగదారులు ముందుగా అనేక ఫోటోలు లేదా వీడియోలను ఎంపిక చేసి సాధారణ క్యారసెల్ పోస్టును రూపొందించాలి. అనంతరం షేర్ చేసే చివరి స్క్రీన్‌లో ప్రధాన క్యాప్షన్ విభాగాన్ని ఓపెన్ చేసి, మల్టిపుల్ క్యాప్షన్స్ ఆప్షన్‌ను యాక్టివేట్ చేయాలి. ఆ తర్వాత ప్రతి స్లైడ్‌కు ప్రత్యేకంగా టెక్స్ట్ నమోదు చేసే ఫీల్డ్‌లు కనిపిస్తాయి. ఈ మార్పుతో యూజర్లు క్యారసెల్‌లో ఒక స్లైడ్ నుంచి మరొక స్లైడ్‌కు స్వైప్ చేసినప్పుడు, సంబంధిత ఫోటో లేదా వీడియోకు అనుగుణంగా క్యాప్షన్ కూడా ఆటోమేటిక్‌గా మారుతుంది. దీంతో యూజర్లు చూస్తున్న కంటెంట్‌కు అదే సమయంలో సరైన వివరణ లభిస్తుంది.
మరింత ఎంగేజ్‌మెంట్..
ఈ ఫీచర్ స్టెప్-బై-స్టెప్ గైడ్‌లు, సీరియల్ రూపంలో చెప్పే కథనాలు, ప్రొడక్ట్ షోకేస్‌లు, ట్యుటోరియల్ కంటెంట్ తదితర పోస్టుల ప్రదర్శన విధానాన్ని గణనీయంగా మార్చే అవకాశం ఉంటుంది. ప్రతి స్లైడ్‌కు తగిన సందర్భాన్ని అందించడం ద్వారా ప్రేక్షకుల ఎంగేజ్‌మెంట్ కూడా పెరిగే అవకాశముంటుందని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది. యూజర్లు తమ యాప్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేయడం ద్వారా ఈ ఫీచర్‌ను పొందవచ్చు.
సంబంధిత వార్తలు

WhatsApp Plus Price | వాట్సప్, ఇన్‌స్టా, ఫేస్బుక్ ఇక ఫ్రీ కాదు.. జుకర్‌బర్గ్ మాస్టర్ ప్లాన్ ఇదే!
జూన్ 17, 2026

Social Media | సోషల్ మీడియా కంటెంట్‌తో 12 ఏళ్ల బాలిక కథ విషాదాంతం.. మెటా, టిక్‌టాక్‌పై కుటుంబాల న్యాయ పోరాటం..
జూన్ 17, 2026

Melodi | మా జంట సోషల్ మీడియాలో చాలా ఫేమస్: జార్జియా మెలోనీ
జూన్ 17, 2026
తాజావార్తలు
- ●Minister Uttamkumar Reddy | ఆర్డీఎస్, తుంగభద్ర జలాల్లో హక్కులపై రాజీ లేదు : ఉత్తమ్ కుమారెడ్డి
- ●Stock Markets | అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. లాభాల్లో ముగిసిన దేశీయ సూచీలు..
- ●UK PM Keir Starmer Resigns | కీర్ స్టార్మర్ అవుట్.. బ్రిటన్ ప్రధాని సంచలన రాజీనామా.. నెక్స్ట్ ఎవరు?
- ●Balaraju Yadav | పిచ్చి పిచ్చి మాట్లాడితే మూతి పగుల్తది.. ఖబర్ధార్
- ●Tollywood | వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాలో యాక్టింగ్ ఛాన్స్ అంటూ మోసాలు - క్లారిటీ ఇచ్చిన టీమ్
- ●World Giraffe Day | ప్రపంచ జిరాఫీ దినోత్సవం.. హైదరాబాద్ జూలో 'బన్నీ' బర్త్‌డే సెలబ్రేషన్స్

Minister Uttamkumar Reddy | ఆర్డీఎస్, తుంగభద్ర జలాల్లో హక్కులపై రాజీ లేదు : ఉత్తమ్ కుమారెడ్డి

Stock Markets | అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. లాభాల్లో ముగిసిన దేశీయ సూచీలు..

UK PM Keir Starmer Resigns | కీర్ స్టార్మర్ అవుట్.. బ్రిటన్ ప్రధాని సంచలన రాజీనామా.. నెక్స్ట్ ఎవరు?

Balaraju Yadav | పిచ్చి పిచ్చి మాట్లాడితే మూతి పగుల్తది.. ఖబర్ధార్




