త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌కు కొత్త అప్‌డేట్‌.. ఇక కామెంట్ల‌ను ఎడిట్ చేసుకోవ‌చ్చు..

Instagram | సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ త‌న‌ వినియోగదారులకు, కంటెంట్ క్రియేట‌ర్ల‌కు ఉపయోగపడే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా ఒకసారి పోస్ట్ చేసిన కామెంట్స్ ను తర్వాత ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. టైపింగ్ పొరపాట్లను సరిచేసుకోవడం లేదా రెస్పాన్స్‌ను మార్చుకోవాలనుకునే వారికి ఇది ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని సంస్థ తెలిపింది.

S

Technology | Published On Apr 10, 2026, 2.04 pm IST

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌కు కొత్త అప్‌డేట్‌.. ఇక కామెంట్ల‌ను ఎడిట్ చేసుకోవ‌చ్చు..
Advertisement

Instagram | సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ త‌న‌ వినియోగదారులకు, కంటెంట్ క్రియేట‌ర్ల‌కు ఉపయోగపడే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా ఒకసారి పోస్ట్ చేసిన కామెంట్స్ ను తర్వాత ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. టైపింగ్ పొరపాట్లను సరిచేసుకోవడం లేదా రెస్పాన్స్‌ను మార్చుకోవాలనుకునే వారికి ఇది ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని సంస్థ తెలిపింది.

15 నిమిషాలే స‌మ‌యం..

ఈ కొత్త ఫీచర్ కొన్ని నిర్దిష్ట నిబంధనలతో పనిచేస్తుంది. కామెంట్ పోస్ట్ చేసిన వెంటనే యూజ‌ర్ల‌కు దానిని ఎడిట్ చేసుకునేందుకు 15 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. ఈ సమయ పరిమితి పూర్తిగా ముగిసిన తర్వాత ఎలాంటి మార్పులు చేయడం సాధ్యం కాదు. అయితే ఆ 15 నిమిషాల వ్యవధిలో వినియోగదారులు తమ కామెంట్‌ను ఎన్ని సార్లు అయినా ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎడిటింగ్ సౌకర్యం కేవలం టెక్స్ట్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఒక కామెంట్‌లో టెక్స్ట్‌తో పాటు ఫోటో కూడా ఉంటే, ఫోటోను మార్చే అవకాశం ఉండదు. కేవలం టెక్స్ట్ భాగానికే మార్పులు చేయవచ్చు.

ఎడిటెడ్ అనే లేబుల్‌తో..

యూజ‌ర్ల న‌డుమ పారదర్శకతను కాపాడేందుకు ఇన్‌స్టాగ్రామ్ ఎడిటెడ్ అనే లేబుల్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఒకసారి కామెంట్ ను మార్చితే ఇతర యూజ‌ర్లు ఆ కామెంట్ ను ఎడిట్ చేశార‌ని గుర్తిస్తారు. అయితే ఈ ప్లాట్‌ఫామ్ ఎడిట్ చేసిన కామెంట్‌కు పాత వెర్షన్‌ను చూపించదు. అంటే ఒకసారి మార్పులు సేవ్ చేసిన తర్వాత అసలు కామెంట్ పబ్లిక్‌కు కనిపించదు. ఈ ఫీచ‌ర్‌ ఇతర ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఇప్పటికే అందుబాటులో ఉండ‌గా, ఇన్‌స్టాగ్రామ్ ప్ర‌స్తుతం ప్ర‌వేశ‌పెట్టింది.

Advertisement
Advertisement