Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లను ఏఐతో మార్చవచ్చు..
Instagram | సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్లకు మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. డైరెక్ట్ మెసేజింగ్ (DMs)లో ఈ నూతన ఫీచర్ లభిస్తోంది. ఇందులో యూజర్లు ఏఐ వాయిస్ ఎఫెక్ట్స్ ఫర్ వాయిస్ నోట్స్ అనే ఫీచర్‌ను ప్రస్తుతం ఉపయోగించుకోవచ్చు.
Technology | Published On Mar 18, 2026, 1.51 pm IST
Instagram | సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్లకు మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. డైరెక్ట్ మెసేజింగ్ (DMs)లో ఈ నూతన ఫీచర్ లభిస్తోంది. ఇందులో యూజర్లు ఏఐ వాయిస్ ఎఫెక్ట్స్ ఫర్ వాయిస్ నోట్స్ అనే ఫీచర్‌ను ప్రస్తుతం ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా యూజర్లు తమ వాయిస్ మెసేజ్‌లను పంపే ముందు వాటికి వివిధ పాత్రల తరహా ఆడియో మార్పులు చేయవచ్చు. ఏఐ ఆధారంగా పనిచేసే ఈ ఫీచర్‌లో యూజర్‌కు చెందిన వాయిస్‌ను మార్చుకోవచ్చు. అయితే అసలు రికార్డింగ్‌లోని రిథమ్, టోన్, భావోద్వేగం అలాగే ఉంటాయి. ఇక ఈ ఫీచర్‌లో ఆ మెసేజ్‌లను రిసీవ్ చేసుకునే వారికి కూడా ఇంటరాక్టివ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది.
రిసీవర్‌కు కూడా సదుపాయం..
మార్పు చేసిన వాయిస్ నోట్‌ను రిసీవ్ చేసుకున్నప్పుడు చాట్ ఇంటర్‌ఫేస్‌లో ఏ వాయిస్ ఎఫెక్ట్‌ను వాడారో తెలియజేస్తుంది. దానిపై ట్యాప్ చేస్తే అదే ఎఫెక్ట్‌ను రిసీవ్ చేసుకున్న యూజర్ కూడా తన రిప్లై వాయిస్ నోట్‌కు ఉపయోగించవచ్చు. ఇక ఈ ఫీచర్‌ను పొందడానికి పలు స్టెప్స్‌ను పాటించాల్సి ఉంటుంది.
ఇలా ఉపయోగించాలి..
ఇన్‌స్టాగ్రామ్‌లో మొదట డైరెక్ట్ మెసేజ్ చాట్‌ను ఓపెన్ చేయాలి. అందులో వాయిస్ మెసేజ్ రికార్డ్ బటన్‌పై ట్యాప్ చేసి రికార్డింగ్‌ను ప్రారంభించాలి. రికార్డింగ్ స్క్రీన్‌లో ఉన్న వాయిస్ ఎఫెక్ట్స్ బటన్‌ను ఎంచుకుని అందుబాటులో ఉన్న ఆడియో ఫిల్టర్లను చూడాలి. సాధారణంగా వాయిస్ నోట్‌ను రికార్డ్ చేయాలి. వివిధ ఎఫెక్ట్‌లను ఎంచుకుని, ప్రతి ఎఫెక్ట్‌తో రికార్డింగ్ ఎలా వినిపిస్తుందో ముందుగా వినాలి. వాటిల్లో ఏదో ఒక ఎఫెక్ట్‌ను ఎంచుకుని వాయిస్ నోట్‌ను మార్చాలి. తరువాత మెసేజ్‌ను పంపించుకోవచ్చు. ఇక మెసేజ్‌ను పంపిన తరువాత రిసీవర్‌కు వాయిస్ ఎఫెక్ట్‌తో కూడిన నోట్ కనిపిస్తుంది. దాన్ని కూడా రిసీవర్ తన రిప్లై వాయిస్ నోట్‌కు వాడవచ్చు. లేదా కొత్త ఎఫెక్ట్‌ను ఎంచుకోవచ్చు. ఇలా ఈ ఫీచర్ పనిచేస్తుంది.
సంబంధిత వార్తలు

MK Stalin | పేరు ప్రస్తావించకుండానే.. విజయ్‌పై విమర్శల దాడిని ప్రారంభించిన స్టాలిన్..!
మే 18, 2026

X | ఫ్రీ యూజర్లకు షాకిచ్చిన ఎక్స్.. పోస్టులపై లిమిట్స్ విధింపు..
మే 18, 2026

Bandi Bhageerath | అందరిలాగే నా కూతురికీ రక్షణ, గౌరవం పొందే అర్హత ఉంది.. బండి భగీరథ్ బాధితురాలి తల్లి
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



