త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. పోస్ట్ డిలీట్ చేయకుండానే మ్యూజిక్ మార్చొచ్చు..

Instagram | ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారుల కోసం మరో ఉపయోగకరమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పబ్లిష్ చేసిన ఫీడ్ పోస్టులు, క్యారోసెల్ పోస్టుల్లోని ఆడియో ట్రాక్‌ను ఇప్పుడు మార్చుకునే అవకాశం కల్పించింది.

S

Technology | Published On Jul 22, 2026, 3.51 pm IST

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. పోస్ట్ డిలీట్ చేయకుండానే మ్యూజిక్ మార్చొచ్చు..
Advertisement

Instagram | ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారుల కోసం మరో ఉపయోగకరమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పబ్లిష్ చేసిన ఫీడ్ పోస్టులు, క్యారోసెల్ పోస్టుల్లోని ఆడియో ట్రాక్‌ను ఇప్పుడు మార్చుకునే అవకాశం కల్పించింది. ఈ మార్పు వల్ల పోస్టుకు ఇప్పటికే వచ్చిన లైక్స్, కామెంట్లు, షేర్స్, రీచ్ వంటి ఎంగేజ్‌మెంట్ మెట్రిక్స్ ఏవీ కోల్పోకుండా కొత్త మ్యూజిక్‌ను జోడించవచ్చు. ఇప్పటి వరకు ఒక పోస్టులో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మార్చాలంటే ఆ పోస్టును పూర్తిగా డిలీట్ చేసి, కొత్త ఆడియోతో మళ్లీ అప్‌లోడ్ చేయాల్సి వచ్చేది. దీంతో ఆ పోస్టుకు వచ్చిన లైక్స్, కామెంట్లు, షేర్స్‌తో పాటు ఇతర ఎంగేజ్‌మెంట్ డేటా మొత్తం కోల్పోయేవారు.

ఎలా చేయాలి..

కొత్త అప్‌డేట్‌తో వినియోగదారులు ఇప్పటికే ఉన్న ఫీడ్ పోస్ట్ లేదా క్యారోసెల్‌ను ఓపెన్ చేసి, ఎడిట్ మెనూలోకి వెళ్లాలి. అక్కడ నుంచి మ్యూజిక్ లైబ్రరీలోని కొత్త ఆడియో ట్రాక్‌ను ఎంపిక చేసి, మార్పులను సేవ్ చేస్తే సరిపోతుంది. దీంతో పోస్టులోని మ్యూజిక్ మాత్రమే మారుతుంది. మిగిలిన ఎంగేజ్‌మెంట్ మొత్తం అలాగే కొనసాగుతుంది. ఈ ఫీచర్ వల్ల కంటెంట్ క్రియేటర్లు, బ్రాండ్లకు పలు ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పటికే మంచి స్పందన పొందిన పోస్టులపై వచ్చిన లైక్స్, కామెంట్లు, షేర్స్, అనలిటిక్స్‌ను కోల్పోకుండా ఆడియోను మార్చుకోవచ్చు. అలాగే కొత్తగా ట్రెండింగ్‌లోకి వచ్చిన మ్యూజిక్‌ను పాత పోస్టులకు కూడా జోడించి వాటిని మరింత ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా మార్చుకోవచ్చు. అంతేకాకుండా కేవలం మ్యూజిక్ మార్చాల్సిన అవసరం కోసం పోస్టును డిలీట్ చేసి మళ్లీ అప్‌లోడ్ చేసే పని కూడా ఉండదు. ఇన్‌స్టాగ్రామ్ తెలిపిన ప్రకారం ఈ కొత్త ఫీచర్ ఈ వారం నుంచి దశలవారీగా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

Advertisement
Advertisement