Infinix NOTE 60 Pro | ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో పినిన్‌ఫరీనా ఎడిషన్ లాంచ్.. అదిరిపోయిన లుక్..
Infinix NOTE 60 Pro | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత మార్కెట్లో నోట్ 60 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను మూడు రంగుల్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కంపెనీ అదే సిరీస్‌లో ప్రత్యేకమైన నోట్ 60 ప్రో పినిన్‌ఫరీనా లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది.
Technology | Published On Jun 24, 2026, 3.31 pm IST
Infinix NOTE 60 Pro | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత మార్కెట్లో నోట్ 60 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను మూడు రంగుల్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కంపెనీ అదే సిరీస్‌లో ప్రత్యేకమైన నోట్ 60 ప్రో పినిన్‌ఫరీనా లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ప్రపంచ ప్రఖ్యాత ఇటాలియన్ ఆటోమొబైల్ డిజైన్ సంస్థ పినిన్‌ఫరీనాతో కలిసి రూపొందించిన ఈ ప్రత్యేక ఎడిషన్ స్మార్ట్‌ఫోన్, సూపర్‌కార్‌ల డిజైన్ తత్వాన్ని ప్రీమియం మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రూపుదిద్దుకుంది. గత శతాబ్దపు క్లాసిక్ కార్ల డిజైన్ నుంచి ఆధునిక హైపర్‌కార్‌ల ఏరోడైనమిక్ రూపకల్పన వరకు స్ఫూర్తి పొందిన ఈ ఫోన్, బ్యూటీ, పనితీరును సమన్వయం చేస్తూ వినియోగదారులకు ప్రత్యేక అనుభూతిని అందించనుంది. ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ దాని సూపర్‌కార్ ప్రేరణతో రూపొందించిన డిజైన్. రేసింగ్ ట్రాక్‌లలో ఉపయోగించే హై-స్ట్రెంగ్త్ కార్బన్ కాంపోజిట్‌లను గుర్తు చేసే కార్బన్ ఫైబర్ ఫినిష్ డిజైన్‌ను వెనుక భాగంలో అందించారు.
అదిరిపోయిన ప్రీమియం లుక్..
360 డిగ్రీల ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ ఫోన్‌కు మరింత ప్రీమియం లుక్‌తోపాటు బలమైన నిర్మాణాన్ని అందిచింది. కెమెరా మాడ్యూల్ చుట్టూ, ఫోన్ అంచుల వెంట ఉన్న ఎరుపు రంగు యాక్సెంట్ లైన్లు లగ్జరీ రేస్ కార్లను గుర్తు చేస్తాయి. కెమెరా పక్కన ఏర్పాటు చేసిన యాక్టివ్ మ్యాట్రిక్స్ రియర్ డిస్‌ప్లే ద్వారా సమయం, నోటిఫికేషన్‌లు, బ్యాటరీ స్థాయి వంటి సమాచారాన్ని చూపిస్తుంది. ప్రీమియం అనుభూతి ఫోన్ ఆన్ చేసిన తర్వాత మాత్రమే కాకుండా, అన్‌బాక్సింగ్ నుంచే ప్రారంభమవుతుందని ఇన్‌ఫినిక్స్ చెబుతోంది. ప్రత్యేకంగా రూపొందించిన బ్లాక్ కలర్ అన్‌బాక్సింగ్ ట్రే, అల్ట్రా ఫాస్ట్ ఛార్జర్, టైప్-సీ బ్రెయిడెడ్ కేబుల్, ప్రత్యేక మాగ్‌ప్యాడ్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, మాగ్నెటిక్ రింగ్‌తో కూడిన పారదర్శక ప్రొటెక్టివ్ కేస్, అలాగే ట్రాక్ కార్ డిజైన్‌ను పోలి ఉండే కస్టమ్ సిమ్ ఎజెక్టర్ టూల్‌ను బాక్స్‌లో అందిస్తోంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ తాజా ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఎక్స్‌ఓఎస్ 16పై పనిచేస్తుంది.
పవర్‌ఫుల్ ప్రాసెసర్, డిస్‌ప్లే..
ఫోన్ బాహ్య రూపకల్పనకు అనుగుణంగా రెడ్-అండ్-బ్లాక్ థీమ్ యూజర్ ఇంటర్‌ఫేస్, ప్రత్యేక కంట్రోల్ సెంటర్, ఆకర్షణీయ విడ్జెట్‌లను అందించారు. వన్-ట్యాప్ ఇన్‌ఫినిక్స్ ఏఐ ఫీచర్ ద్వారా ఉత్పాదకత, అనువాదం, సిస్టమ్ ఆప్టిమైజేషన్ వంటి పనులను సులభంగా నిర్వహించవచ్చు. హార్డ్‌వేర్ విషయానికి వస్తే, సాధారణ నోట్ 60 ప్రో మోడల్‌లో ఉన్న ఫీచర్లనే ఇందులో కూడా అందించారు. 6.78 ఇంచుల 1.5కె అమోలెడ్ డిస్‌ప్లే, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 4500 నిట్స్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఇందులో ఉన్నాయి. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాను అందించారు. ప్రధాన కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్ ఉంది. సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ముందు, వెనుక కెమెరాలతో 4కె వీడియో రికార్డింగ్ చేయవచ్చు.
ధర ఎంతంటే..
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, జేబీఎల్ ట్యూన్ చేసిన స్టీరియో స్పీకర్లు, హై-రెస్ ఆడియో, డ్యూయల్ మైక్రోఫోన్‌లు, ఐపీ64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. 6500ఎంఏహెచ్ భారీ బ్యాటరీతోపాటు 90వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 30వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. భారత మార్కెట్లో ఇన్‌ఫినిక్స్ నోట్ 60 ప్రో పినిన్‌ఫరీనా లిమిటెడ్ ఎడిషన్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 29 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, ఇన్ఫినిక్స్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లలో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై రూ.2వేల వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. లేదా పాత ఫోన్ ఎక్స్చేంజ్‌పై అదనంగా రూ.2వేల వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు

Infinix Smart 20 | పవర్‌ఫుల్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 ఫోన్.. ధర ఎంతంటే..?
జూన్ 8, 2026

Infinix NOTE 60 Pro | భారీ బ్యాటరీ, అదిరిపోయే డిజైన్‌తో లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ కొత్త స్మార్ట్ ఫోన్
ఏప్రిల్ 13, 2026

Infinix Note Edge 5G | భారీ బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లతో ఇన్ఫినిక్స్ కొత్త స్మార్ట్ ఫోన్
ఫిబ్రవరి 18, 2026
తాజావార్తలు
- ●Mahua Moitra | సువేందు ప్రతీ విషయంలో అండగా నిలిచారు.. బీజేపీ సీఎంపై టీఎంసీ ఎంపీ ప్రశంసలు
- ●PM KUSUM Scam Telangana | కాంగ్రెస్ పాలనలో రోజుకో స్కాం.. 'పీఎం కుసుమ్'లో రూ.1000 కోట్ల కుంభకోణం: జగదీశ్ రెడ్డి
- ●Ayatollah Ali Khamenei funeral | జులై 9న ఖమేనీ అంత్యక్రియలు.. మోదీని ఆహ్వానించిన ఇరాన్..!
- ●Janhvi Kapoor | పెద్ది సక్సెట్ మీట్లో కనిపించని జాన్వీ.. ఇంతకు దూరం పెట్టారా? ఉంటోందా?
- ●Kamakhya Ambubachi Mela 2026 | యోని ఆకారంలో అమ్మవారు.. కామాఖ్య గుడిలో 'అంబుబాచి మేళా' షురూ.. భక్తులకు కొత్త రూల్స్ ఇవే!
- ●Knack Packaging IPO | న్యాక్ ప్యాకేజింగ్ సంస్థ ఐపీవోకు సిద్ధం.. రూ.440 కోట్ల ఇష్యూ.. ఎప్పుడంటే..

Mahua Moitra | సువేందు ప్రతీ విషయంలో అండగా నిలిచారు.. బీజేపీ సీఎంపై టీఎంసీ ఎంపీ ప్రశంసలు

PM KUSUM Scam Telangana | కాంగ్రెస్ పాలనలో రోజుకో స్కాం.. 'పీఎం కుసుమ్'లో రూ.1000 కోట్ల కుంభకోణం: జగదీశ్ రెడ్డి

Ayatollah Ali Khamenei funeral | జులై 9న ఖమేనీ అంత్యక్రియలు.. మోదీని ఆహ్వానించిన ఇరాన్..!

Janhvi Kapoor | పెద్ది సక్సెట్ మీట్లో కనిపించని జాన్వీ.. ఇంతకు దూరం పెట్టారా? ఉంటోందా?



