త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apple Devices | యాపిల్ డివైస్‌ల‌ యూజ‌ర్ల‌కు భార‌త ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌.. పొంచి ఉన్న హ్యాకింగ్ ముప్పు..

Apple Devices | భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) యాపిల్ డివైస్‌లను ఉపయోగిస్తున్న వినియోగదారులకు క్రిటికల్ హెచ్చరిక జారీ చేసింది. ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్ సిస్టమ్‌లపై ప్రభావం చూపే అనేక భద్రతా లోపాల గురించి ఈ హెచ్చరికలో వివరించారు.

S

Technology | Published On Mar 22, 2026, 3.00 pm IST

Apple Devices | యాపిల్ డివైస్‌ల‌ యూజ‌ర్ల‌కు భార‌త ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌.. పొంచి ఉన్న హ్యాకింగ్ ముప్పు..
Advertisement

Apple Devices | భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) యాపిల్ డివైస్‌లను ఉపయోగిస్తున్న వినియోగదారులకు క్రిటికల్ హెచ్చరిక జారీ చేసింది. ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్ సిస్టమ్‌లపై ప్రభావం చూపే అనేక భద్రతా లోపాల గురించి ఈ హెచ్చరికలో వివరించారు. ఈ అలర్ట్ ప్రకారం ఈ లోపాలను సైబర్ నేర‌స్తులు వినియోగించి ఆయా డివైస్‌ల లోకి చొరబడి హానికర కోడ్‌ల‌ను అమలు చేసే అవకాశం ఉంటుంద‌ని తెలిపారు. ఈ హెచ్చరికను CIVN-2026-0150 అనే వల్నరబిలిటీ నోట్ కింద నమోదు చేశారు. ఇది వ్యక్తిగత వినియోగదారులతోపాటు యాపిల్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్న సంస్థలకు కూడా వర్తిస్తుందని తెలిపారు.

ఏయే వెర్ష‌న్‌లు.. ఏయే డివైస్‌లు..?

CERT-In ప్రకారం ఈ భద్రతా లోపాలు యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ కు చెందిన‌ పలు వెర్షన్‌లను ప్రభావితం చేస్తాయి. macOSలో 13.5, 14.2 అలాగే 14.3 కన్నా పాత వెర్షన్‌లు ప్రమాదంలో ఉన్న‌ట్లు గుర్తించారు. అదేవిధంగా iOS, iPadOSల‌లో 15.8.7, 16.7.5, 16.7.15, ఇంకా 17.3 కన్నా పాత వెర్షన్‌లు కూడా ప్ర‌మాదంలో ఉన్నాయ‌ని తెలిపారు. ఈ సమస్య Safari బ్రౌజర్‌కు కూడా వర్తిస్తుంద‌ని, ముఖ్యంగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో కలిపి వచ్చే వెర్షన్‌లలో స‌ఫారి బ్రౌజ‌ర్‌ను వాడేవారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వెల్ల‌డించారు . తాజా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు ఇన్‌స్టాల్ చేయని డివైస్‌లు ఈ హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఎక్కువ‌గా ఉందని CERT-In తెలిపింది. CERT-In ఈ లోపాలను క్రిటికల్ స్థాయిగా వర్గీకరించింది. అంటే వీటిని అత్యంత ప్రమాదకరమైనవిగా పరిగణించింది. ఈ లోపాల ద్వారా సైబ‌ర్ నేర‌స్థులు టార్గెట్ చేసిన డివైస్‌ల‌లో ఎలాంటి కోడ్‌ల‌నైనా అమలు చేయగలరని సంస్థ హెచ్చరించింది. ఈ సమస్యలు ప్రధానంగా kernel భాగాల్లో use-after-free అలాగే WebKitలో type confusion వంటి లోపాలకు సంబంధించినవిగా గుర్తించారు.

ఏం చేయాలి..?

ఈ లోపాలను దుర్వినియోగం చేస్తే, సైబ‌ర్ నేర‌స్థులు అనధికారికంగా సిస్టమ్‌లలోకి ప్రవేశించి సున్నితమైన సమాచారాన్ని సేకరించడం, డేటాను మార్చడం వంటి చర్యలు చేపట్టే అవ‌కాశాలు ఉంటాయి. అదేవిధంగా సేవల అంతరాయం (service disruption), మెమరీ దెబ్బతినడం (memory corruption) కూడా సంభవించే అవకాశం ఉంటుందని హెచ్చరికలో పేర్కొన్నారు. ఈ ప్రమాదాలను నివారించడానికి యాపిల్ విడుదల చేసిన తాజా సెక్యూరిటీ అప్‌డేట్‌లను వెంటనే ఇన్‌స్టాల్ చేయాలని CERT-In సూచించింది. ఈ అప్‌డేట్‌లు ఆయా లోపాలను సరిచేసి దాడుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వినియోగదారులు తమ డివైస్‌ల‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి iOS, iPadOS అలాగే macOS తాజా వెర్షన్‌లను చెక్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి. అదేవిధంగా Safari బ్రౌజ‌ర్‌, ఇతర సిస్టమ్ భాగాలను కూడా అప్‌డేట్ చేయడం వ‌ల్ల డివైస్‌లు సుర‌క్షితంగా ఉంటాయ‌ని CERT-In తెలిపింది.

Advertisement

తాజావార్తలు

Advertisement