త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bluetooth | బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతుందా? కారణాలు ఇవే.. ఏం చేయాలంటే..?

Bluetooth | బ్లూటూత్ కనెక్షన్ తరచూ డిస్‌క‌నెక్ట్ అవ‌డం చాలామందికి పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఒకసారి కనెక్ట్ అయితే చాలు అనుకుంటే, మధ్యలోనే డిస్‌కనెక్ట్ అవ్వడం వల్ల పరికరాలు సరిగా పనిచేయవు. ఫలితంగా వాటిని ఉపయోగించడం విసుగ్గా మారుతుంది. కేబుల్స్‌, వైర్లు లేకుండా పరికరాలను కనెక్ట్ చేసుకునేందుకు బ్లూటూత్ ఎంతో ఉపయోగపడుతుంది.

S

Technology | Published On Feb 6, 2026, 12.58 pm IST

Bluetooth | బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతుందా? కారణాలు ఇవే.. ఏం చేయాలంటే..?
Advertisement

Bluetooth | బ్లూటూత్ కనెక్షన్ తరచూ డిస్‌క‌నెక్ట్ అవ‌డం చాలామందికి పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఒకసారి కనెక్ట్ అయితే చాలు అనుకుంటే, మధ్యలోనే డిస్‌కనెక్ట్ అవ్వడం వల్ల పరికరాలు సరిగా పనిచేయవు. ఫలితంగా వాటిని ఉపయోగించడం విసుగ్గా మారుతుంది. కేబుల్స్‌, వైర్లు లేకుండా పరికరాలను కనెక్ట్ చేసుకునేందుకు బ్లూటూత్ ఎంతో ఉపయోగపడుతుంది. పాటలు వినడం నుంచి డేటా షేర్ చేయడం, పరికరాలను నియంత్రించడం వరకు అనేక పనులను బ్లూటూత్‌తో సులభంగా చేయవచ్చు. అయితే ఉపయోగించడం సులభమైనప్పటికీ కొన్ని కారణాల వల్ల ఇది అప్పుడ‌ప్పుడు సరిగా పనిచేయదు. బ్లూటూత్ తరచూ ఎందుకు డిస్‌కనెక్ట్ అవుతుంది, దాన్ని ఎలా నివారించాలి.. అన్న విష‌యాలను టెక్ నిపుణులు వివ‌రిస్తున్నారు.

రేంజ్‌, అడ్డంకులు..

బ్లూటూత్ కనెక్షన్ తరచూ డిస్‌క‌నెక్ట్ అవుతుంటే ముందుగా రేంజ్ సమస్య ఉందేమో చూడాలి. పాత బ్లూటూత్ వెర్షన్లు సాధారణంగా సుమారు 33 అడుగుల దూరం వరకు మాత్రమే పనిచేస్తాయి. ఈ దూరాన్ని దాటితే కనెక్షన్ ఆటోమేటిక్‌గా డ్రాప్ అవుతుంది. అంతేకాదు, గోడలు, తలుపులు వంటి భౌతిక అడ్డంకులు కూడా సిగ్నల్‌ను బలహీనపరుస్తాయి. కాబట్టి, హోస్ట్ డివైస్‌కు దగ్గరగానే ఉండేందుకు ప్రయత్నించాలి. దూరం, అడ్డంకులతో పాటు ఇతర పరికరాల నుంచి వచ్చే అంతరాయం కూడా బ్లూటూత్ కనెక్షన్‌ను ప్రభావితం చేస్తుంది. బ్లూటూత్ 2.4 GHz ఫ్రీక్వెన్సీపై పనిచేస్తుంది. ఇదే ఫ్రీక్వెన్సీని వై-ఫై రౌటర్లు, వైర్‌లెస్ మౌస్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా ప‌నిచేస్తాయి. దీని వల్ల సిగ్నల్ మార్గాలు బ్లాక్ అయి, కనెక్షన్ తరచూ డిస్ క‌నెక్ట్ అవుతుంది. క‌నుక ఆయా డివైస్‌ల‌ను వీలైనంత వ‌ర‌కు త‌క్కువ‌గా ఉండేలా చూసుకోండి.

బ్యాట‌రీ..

చాలా బ్లూటూత్ పరికరాలు ఒకేసారి ఒక డివైస్‌తో మాత్రమే కనెక్ట్ అవుతాయి. కొన్ని పరికరాలు అయితే పాత కనెక్షన్‌కు ప్రాధాన్యం ఇస్తాయి. మీరు ఇంతకుముందు కనెక్ట్ చేసిన మరో డివైస్ దగ్గరకు వెళ్తే, ప్రస్తుతం ఉన్న కనెక్షన్ కట్ అయి, ఆ పాత డివైస్‌తో ఆటోమేటిక్‌గా కనెక్ట్ కావచ్చు. క‌నుక ఈ విష‌యాన్ని కూడా గ‌మ‌నించాల్సి ఉంటుంది.అలాగే డివైస్ బ్యాటరీ స్థాయి కూడా బ్లూటూత్ పనితీరును ప్రభావితం చేస్తుంది. బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు సిగ్నల్ బలహీనపడుతుంది. ఫలితంగా బ్లూటూత్ కనెక్షన్ తరచూ డిస్‌కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, బ్యాటరీని సరిపడా ఛార్జ్‌లో ఉంచడం చాలా అవసరం. ఈ అంశాలపై దృష్టి పెట్టి, చిన్న జాగ్రత్తలు తీసుకుంటే బ్లూటూత్ కనెక్షన్ సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అప్పుడు బ్లూటూత్ స‌రిగ్గా ప‌నిచేస్తుంది. అయితే బ్లూటూత్ ప్ర‌స్తుతం చాలా వ‌ర‌కు డివైస్‌ల‌లో అందుబాటులో ఉంటుంది. క‌నుక ఈ చిట్కాలు అన్ని డివైస్‌ల‌కు వ‌ర్తిస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement