iOS 27 | ఐఫోన్‌ను ఐఓఎస్ 27కు అప్‌డేట్ చేశారా.. బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది జాగ్రత్త..
iOS 27 | ఐఫోన్ వినియోగదారులకు యాపిల్ తాజాగా ఐఓఎస్ 27ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌తో పలు ఫీచర్లు, పనితీరు మెరుగుదల అందుతున్నప్పటికీ, అప్‌డేట్ చేసిన వెంటనే కొంతమంది వినియోగదారులు బ్యాటరీ వేగంగా ఖాళీ అవుతున్నట్లు గుర్తిస్తున్నారు. అయితే దీనికి సాధారణంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
Technology | Published On Sep 19, 2026, 1.17 pm IST
iOS 27 | ఐఫోన్ వినియోగదారులకు యాపిల్ తాజాగా ఐఓఎస్ 27ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌తో పలు ఫీచర్లు, పనితీరు మెరుగుదల అందుతున్నప్పటికీ, అప్‌డేట్ చేసిన వెంటనే కొంతమంది వినియోగదారులు బ్యాటరీ వేగంగా ఖాళీ అవుతున్నట్లు గుర్తిస్తున్నారు. అయితే దీనికి సాధారణంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కొత్త సాఫ్ట్‌వేర్‌కు అనుగుణంగా ఐఫోన్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో పలు ప్రక్రియలు కొనసాగడం వల్ల మొదటి కొన్ని రోజుల్లో బ్యాటరీ వినియోగం పెరుగుతుంది. ఐఓఎస్ 27ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత సిస్టమ్ ఇండెక్సింగ్, యాప్స్ రీ-ఆప్టిమైజేషన్, ఐక్లౌడ్ సింకింగ్ వంటి బ్యాక్‌గ్రౌండ్ ప్రక్రియలు జరుగుతాయి. కొత్త సాఫ్ట్‌వేర్‌ను పూర్తిగా సమన్వయం చేసుకోవడానికి ఇవి అవసరం. సాధారణంగా కొన్ని రోజుల తర్వాత ఈ ప్రక్రియలు తగ్గడంతో బ్యాటరీ వినియోగం కూడా సాధారణ స్థాయికి వస్తుంది. ఈ సమయంలో బ్యాటరీ వినియోగాన్ని గమనిస్తూ, అవసరం లేని పనులను తగ్గించడం మంచిది.
యాప్స్‌ను అప్‌డేట్ చేయాలి..
బ్యాటరీ పనితీరు మెరుగుపడేందుకు ఐఫోన్‌లో సాఫ్ట్‌వేర్, యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. ఇందుకోసం సెట్టింగ్స్‌లో జనరల్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లోకి వెళ్లి అందుబాటులో ఉన్న తాజా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాపిల్ చిన్న అప్‌డేట్ల ద్వారా బగ్‌లను పరిష్కరించడం, సిస్టమ్ స్థిరత్వాన్ని మెరుగుపరచడం వంటి మార్పులు చేస్తుంది. అలాగే యాప్ స్టోర్‌లోని అప్‌డేట్స్ విభాగం నుంచి యాప్స్‌ను కూడా అప్‌డేట్ చేయాలి. పాత వెర్షన్ యాప్స్ ఐఓఎస్ 27కు పూర్తిగా అనుకూలంగా లేకపోతే అధిక బ్యాటరీని వినియోగించే అవకాశం ఉంటుంది. అయితే ఐఓఎస్ 27కు అప్‌డేట్ అయ్యే ముందు ఫోన్ బ్యాటరీ డ్రెయిన్ అవకుండా ఉండేందుకు చేయాల్సిన పనుల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఏ యాప్స్ ఎక్కువ బ్యాటరీని వినియోగిస్తున్నాయో తెలుసుకోవడం కూడా ముఖ్యం. ఇందుకోసం సెట్టింగ్స్‌లో బ్యాటరీ విభాగాన్ని పరిశీలించాలి. అక్కడ ప్రతి యాప్ ఎంత బ్యాటరీని వినియోగించిందో వివరాలు కనిపిస్తాయి. అధిక బ్యాటరీ వినియోగిస్తున్న యాప్స్‌ను పరిశీలించి, అవసరం లేకపోతే తొలగించడం లేదా ప్రత్యామ్నాయ యాప్‌ను ఉపయోగించడం ద్వారా బ్యాటరీ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. యాప్స్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయ్యేలా సెట్టింగ్స్‌లోని యాప్ స్టోర్ విభాగంలో ఆటోమేటిక్ అప్‌డేట్స్‌ను కూడా ఆన్ చేయాలి.
ఫీచర్లను వాడకపోతే..
తరచూ ఉపయోగించని ఫీచర్లను ఆఫ్ చేయడం ద్వారా కూడా బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు. సిరి, యాపిల్ ఇంటెలిజెన్స్ వంటి ఫీచర్లు అవసరం లేకపోతే వాటి వినియోగాన్ని తగ్గించడం ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే సెట్టింగ్స్‌లో జనరల్, బ్యాక్‌గ్రౌండ్ యాప్ రిఫ్రెష్‌లోకి వెళ్లి అవసరం లేని యాప్స్‌కు ఈ సదుపాయాన్ని నిలిపివేయవచ్చు. దీంతో యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరం కొత్త సమాచారాన్ని సేకరించే అవసరం తగ్గుతుంది. లోకేషన్ సర్వీసులు కూడా బ్యాటరీపై ప్రభావం చూపుతాయి. ప్రతి యాప్‌కు నిరంతరం లొకేషన్ యాక్సెస్ అవసరం ఉండదు. సెట్టింగ్స్‌లో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ, లోకేషన్ సర్వీసెస్‌లోకి వెళ్లి యాప్స్‌కు వైల్ యూజింగ్ ది యాప్ లేదా నెవర్ వంటి అనుమతులను ఎంచుకోవచ్చు. అలాగే సిస్టమ్ సర్వీసెస్‌లోని సిగ్నిఫికెంట్ లొకేషన్స్ ను అవసరం లేకపోతే నిలిపివేయవచ్చు. దీనివల్ల బ్యాటరీ వినియోగం తగ్గడమే కాకుండా ప్రైవసీని కూడా మెరుగుపరచుకోవచ్చు.

డిస్‌ప్లే బ్రైట్‌నెస్..
ఐఫోన్ డిస్‌ప్లే కూడా అధిక విద్యుత్ వినియోగించే భాగాల్లో ఒకటి. అందువల్ల ఆటో బ్రైట్‌నెస్‌ను ఆన్ చేయడం ద్వారా పరిసర కాంతికి అనుగుణంగా స్క్రీన్ ప్రకాశం ఆటోమేటిగ్గా మారేలా చేయవచ్చు. డిస్‌ప్లే అండ్ బ్రైట్‌నెస్ విభాగంలో డార్క్ మోడ్‌ను కూడా యాక్టివేట్ చేయవచ్చు. ముఖ్యంగా ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉన్న ఐఫోన్లలో డార్క్ మోడ్ విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నెట్‌వర్క్ సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కూడా బ్యాటరీ వినియోగం పెరుగుతుంది. ఐఫోన్ నిరంతరం బలమైన సిగ్నల్ కోసం ప్రయత్నించాల్సి రావడం దీనికి కారణం. 5జి సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైతే 4జి లేదా ఎల్‌టీఈకి మారవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్‌లో సెల్యులార్, వాయిస్ అండ్ డేటా విభాగంలో సంబంధిత ఆప్షన్‌ను మార్చుకోవచ్చు. అలాగే ఉపయోగించని సమయంలో ఎయిర్‌డ్రాప్‌ను ఆఫ్ చేయడం ద్వారా కూడా కొంత బ్యాటరీని ఆదా చేయవచ్చు.
నోటిఫికేషన్లు, విడ్జెట్లు..
నోటిఫికేషన్లు, విడ్జెట్లు కూడా బ్యాటరీ వినియోగాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన యాప్స్‌కు మాత్రమే నోటిఫికేషన్లు వచ్చేలా సెట్టింగ్స్‌లో నోటిఫికేషన్స్ విభాగాన్ని మార్చుకోవచ్చు. తరచూ సమాచారాన్ని అప్‌డేట్ చేసే వాతావరణం, వార్తల వంటి విడ్జెట్లు అవసరం లేకపోతే హోమ్ స్క్రీన్, లాక్ స్క్రీన్ నుంచి తొలగించడం ద్వారా బ్యాక్‌గ్రౌండ్ కార్యకలాపాలను తగ్గించవచ్చు. దీర్ఘకాలికంగా ఐఫోన్ బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా కీలకం. అత్యధిక వేడి లేదా తీవ్రమైన చలికి ఐఫోన్‌ను గురిచేయకూడదు. ఛార్జింగ్ కోసం యాపిల్ సర్టిఫైడ్ ఛార్జర్లు, కేబుల్స్ ఉపయోగించడం మంచిది. బ్యాటరీ తక్కువగా ఉన్న సమయంలో సెట్టింగ్స్‌లోని బ్యాటరీ విభాగం నుంచి లో పవర్ మోడ్‌ను ఆన్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ కార్యకలాపాలు తగ్గి ఎక్కువ సమయం ఐఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఐఓఎస్ 27 అప్‌డేట్ చేసిన వెంటనే బ్యాటరీ కొంత వేగంగా ఖాళీ కావడం సాధారణంగా తాత్కాలిక సమస్యే. సిస్టమ్ బ్యాక్‌గ్రౌండ్ ప్రక్రియలు పూర్తయ్యే వరకు కొన్ని రోజులు వేచి చూడడంతో పాటు, యాప్స్, లోకేషన్, డిస్‌ప్లే, నెట్‌వర్క్, నోటిఫికేషన్స్ వంటి సెట్టింగ్స్‌ను అవసరానికి అనుగుణంగా మార్చుకోవడం ద్వారా బ్యాటరీ పనితీరును మెరుగుపరచుకోవచ్చు. దీంతో ఐఓఎస్ 27లోని కొత్త ఫీచర్లను వినియోగిస్తూనే ఐఫోన్ బ్యాటరీని ఎక్కువసేపు కొనసాగించవచ్చు.
తాజావార్తలు
- ●Mamata Banerjee | టీఎంసీ పేరు, గుర్తు గల్లంతు.. ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన మమతా బెనర్జీ
- ●RS Praveen Kumar | కనీసం మీ కలెక్షన్ బ్యాచ్లోనైనా ఒక్క ఎస్సీ అయినా ఉన్నడా?
- ●RBI | భారీగా పెరగనున్న వడ్డీ రేట్లు..? రుణం ఇక మరింత ప్రియం..
- ●Rejinagar Assembly bypoll | మమతకు షాక్.. ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకున్న మరో అభ్యర్థి
- ●Kishan Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు.. ఎంపీ టికెట్ ఎలా ఇస్తారు..?
- ●Horror OTT | ఓటీటీలోకి ట్విస్ట్‌లతో వణికించే తెలుగు హారర్ మూవీ - దుష్టశక్తులున్న గుహలో అడుగుపెడితే!

Mamata Banerjee | టీఎంసీ పేరు, గుర్తు గల్లంతు.. ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన మమతా బెనర్జీ

RS Praveen Kumar | కనీసం మీ కలెక్షన్ బ్యాచ్లోనైనా ఒక్క ఎస్సీ అయినా ఉన్నడా?

RBI | భారీగా పెరగనున్న వడ్డీ రేట్లు..? రుణం ఇక మరింత ప్రియం..

Rejinagar Assembly bypoll | మమతకు షాక్.. ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకున్న మరో అభ్యర్థి






