iPhone | సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా..? ఈ 5 విషయాలను తప్పక చెక్ చేయండి..
iPhone | ఐఫోన్ కొనడం చాలా మందికి కలగానే ఉంటుంది. ఎందుకంటే ఈ ఫోన్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది కనుక సామాన్యులు దీన్ని కొనలేరు. అయితే సెకండ్ హ్యాండ్ ఐఫోన్లు చాలా తక్కువ ధరకే వస్తాయి కనుక వారు ఆ ఫోన్లను కొనేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు.
Technology | Published On Sep 5, 2026, 4.57 pm IST
iPhone | ఐఫోన్ కొనడం చాలా మందికి కలగానే ఉంటుంది. ఎందుకంటే ఈ ఫోన్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది కనుక సామాన్యులు దీన్ని కొనలేరు. అయితే సెకండ్ హ్యాండ్ ఐఫోన్లు చాలా తక్కువ ధరకే వస్తాయి కనుక వారు ఆ ఫోన్లను కొనేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. ముఖ్యంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న లేటెస్ట్ ఐఫోన్ సిరీస్‌తో పోలిస్తే 2 లేదా 3 సిరీస్ వెనక్కి వెళ్లి ఆ ఫోన్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే అది సరైన విధానమే. కానీ వాటిల్లోనూ సెకండ్ హ్యాండ్ ఫోన్లు అయితే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. సెకండ్‌హ్యాండ్ ఐఫోన్ కొనడం ద్వారా కొత్త ఫోన్‌తో పోలిస్తే తక్కువ ధరకే మంచి డివైస్ సొంతం చేసుకోవచ్చు. అయితే బయటకు బాగానే కనిపించే ఫోన్‌లో లోపాలు, రిపేర్ చేసిన భాగాలు లేదా బ్యాటరీ సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే యూజ్ చేసిన ఐఫోన్ కొనేముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పనిసరిగా పరిశీలించాలి.
బ్యాటరీ హెల్త్..
సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొనేముందు బ్యాటరీ హెల్త్ చూడడం చాలా ముఖ్యం. ఫోన్‌లోని సెట్టింగ్స్, బ్యాటరీ, బ్యాటరీ హెల్త్ అండ్ చార్జింగ్ విభాగంలోకి వెళ్తే అక్కడ పలు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిల్లో బ్యాటరీ గరిష్ఠ సామర్థ్యాన్ని పరిశీలించాలి. సాధారణంగా ఎక్కువ బ్యాటరీ హెల్త్ ఉన్న ఫోన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. సామర్థ్యం చాలా తక్కువగా ఉంటే త్వరలోనే బ్యాటరీ మార్చాల్సిన అవసరం వస్తుంది. బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ఖర్చును కూడా ఫోన్ ధరలో లెక్కించుకోవాలి. బ్యాటరీ గరిష్ట సామర్థ్యం కనీసం 80కి పైన ఉండేలా చూసుకుంటే మళ్లీ బ్యాటరీ మార్చే వరకు సమయం పడుతుంది కనుక అదనపు ఖర్చు ఉండదు.
ఐఎంఈఐ, సీరియల్ నంబర్..
అలాగే ఫోన్ ఐఎంఈఐ, సీరియల్ నంబర్‌ను పరిశీలించాలి. ఫోన్‌లో ఉన్న ఐఎంఈఐ నంబర్‌ను బాక్స్, బిల్ లేదా ఇతర వివరాలతో సరిపోల్చాలి. సెట్టింగ్స్, జనరల్, అబౌట్ విభాగంలో ఐఎంఈఐ, సీరియల్ నంబర్ చూడవచ్చు. అయితే సెకండ్ హ్యాండ్ ఐఫోన్ అయినా సరే యాపిల్ వెబ్‌సైట్‌లో సీరియల్ నంబర్‌తో సపోర్ట్ కోసం యత్నిస్తే సపోర్ట్ ముగిసినట్లు చూపిస్తుంది. దీంతో అది నిజమైందని నిర్దారణ అవుతుంది. అదే ఫోన్ నకిలీ అయితే డివైస్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. దీంతో ఆ ఫోన్‌ను కొనకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే దొంగిలించిన ఐఫోన్‌ను ఎవరైనా విక్రయించేందుకు యత్నిస్తే అలా కూడా ఇబ్బంది అవుతుంది. కనుక ఓసారి చెక్ చేసుకోవడం మంచిది. పోలీస్ శాఖకు చెందిన బ్లాక్ లిస్టులో ఫోన్ ఉందా అనే విషయాన్ని ధ్రువీకరించాలి. వీలైనంత వరకు బిల్లు చూపించమని లేదా ఒరిజినల్ బాక్స్ అయినా ఇవ్వాలని అడగాలి. దీంతో అలాంటి సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవకుండా ఉంటాయి.

పార్ట్‌లను మార్చి ఉంటే..
ఫోన్‌లో ఏవైనా పార్ట్‌లను మారిస్తే కూడా సులభంగా తెలుసుకోవచ్చు. సాధారణంగా ఐఫోన్లలో ఎక్కువ శాతం బ్యాటరీ, డిస్‌ప్లే వంటివి మారుస్తారు. వీటిని తెలుసుకోవాలంటే ఫోన్‌లోని సెట్టింగ్స్, జనరల్, అబౌట్ విభాగంలో ఉండే పార్ట్స్ అండ్ సర్వీస్ హిస్టరీ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీంతో ఫోన్‌లో ఏవైనా పార్ట్‌లు మార్చిన విషయాన్ని సులభంగా గుర్తించవచ్చు. అక్కడ ఏదైనా భాగం మార్చినట్లు సమాచారం ఉంటే, అది యాపిల్ ఒరిజినల్ పార్టేనా లేదా ఇతర భాగమా అనే విషయాన్ని తెలుసుకోవాలి. రిపేర్ చేసిన ఫోన్ తప్పనిసరిగా బాగుండదని కాదు, కానీ దాని ఆధారంగా ధరను నిర్ణయించాలి. ఇక ఇది అత్యంత ముఖ్యమైన చెక్‌లలో ఒకటి. ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు పాత యజమాని యాపిల్ అకౌంట్ నుంచి సైన్ అవుట్ చేసి, ఫైండ్ మై ను ఆఫ్ చేసి, ఫోన్‌ను పూర్తిగా ఎరేజ్ చేసినట్లు నిర్ధారించుకోవాలి. ఫోన్‌ను సెటప్ చేస్తున్నప్పుడు పాత యజమాని యాపిల్ అకౌంట్ వివరాలు అడిగితే డీల్ పూర్తి చేయకండి. యాక్టివేషన్ లాక్ ఉన్న ఫోన్‌ను కొనుగోలు చేస్తే తర్వాత ఉపయోగించడంలో తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి.
అన్ని ఫీచర్లను పరీక్షించాలి..
ఫోన్ బయటకు బాగుందని మాత్రమే చూసి కొనకండి. కనీసం కొన్ని నిమిషాలు తీసుకుని అన్ని ముఖ్యమైన ఫీచర్లను పరీక్షించండి. కెమెరాలు, ఫ్లాష్, స్పీకర్లు, మైక్రోఫోన్, ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీ, టచ్‌స్క్రీన్, బటన్లు, వైఫై, బ్లూటూత్, మొబైల్ నెట్‌వర్క్, ఛార్జింగ్ పోర్ట్ సరిగ్గా పనిచేస్తున్నాయో చూడాలి. స్క్రీన్‌పై డెడ్ పిక్సల్స్, గ్రీన్ లైన్ లేదా టచ్ స్పందించని ప్రాంతాలు ఉన్నాయా కూడా పరిశీలించాలి. ఇలా అన్ని రకాలుగా చెక్ చేయాలి. యూజ్డ్ ఐఫోన్ కొనేటప్పుడు తక్కువ ధర కనిపించిందని తొందరపడకండి. బ్యాటరీ హెల్త్, ఐఎంఈఐ, పార్ట్స్ హిస్టరీ, యాక్టివేషన్ లాక్, ఫోన్‌లోని అన్ని ఫీచర్లు.. ఈ ఐదు విషయాలను చెక్ చేసిన తర్వాతే డీల్ ఫైనల్ చేయడం మంచిది. వీలైతే బిల్, కొనుగోలు వివరాలు ఉన్న ఫోన్‌కు ప్రాధాన్యత ఇవ్వండి.
సంబంధిత వార్తలు

WhatsApp | ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్లను ఇలా సింపుల్‌గా ట్రాన్స్ఫర్ చేయండి..
జులై 28, 2026

Apple Upgrade | యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక ఐఫోన్లను కావల్సినన్ని రోజులు అద్దెకు తీసుకోవచ్చు..
జులై 22, 2026

Apple | ఎన్విడియాను వెనక్కి నెట్టిన యాపిల్.. ప్రపంచంలోనే నంబర్ వన్ సంస్థగా మళ్లీ సెటిల్..
జులై 18, 2026
తాజావార్తలు
- ●Anupama Paramewaran | నిజమైన ప్రేమలో ఆప్షన్లు ఉండవు - మాజీ ప్రియుడిపై అనుపమ సెటైర్స్
- ●MP Etala Rajendar | మిస్టర్ రేవంత్, పొంగులేటి! 22ఏ లో పెట్టే అధికారం మీకెవడిచ్చాడు?
- ●Minister Uttam | రూ.18,250 కోట్లతో ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ప్రణాళిక
- ●Kangana Ranaut | పనికిమాలిన మాటలు వద్దు.. మీ వల్లే నా పనితీరుపై విమర్శలు.. మండి అధికారులపై కంగన ఆగ్రహం
- ●KCR Resignation Demand | జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రాని కేసీఆర్ రాజీనామా చేయాల్సిందే
- ●Encounter | యూస్మార్గ్ ఎన్కౌంటర్.. లష్కరే కమాండర్ హతం

Anupama Paramewaran | నిజమైన ప్రేమలో ఆప్షన్లు ఉండవు - మాజీ ప్రియుడిపై అనుపమ సెటైర్స్

MP Etala Rajendar | మిస్టర్ రేవంత్, పొంగులేటి! 22ఏ లో పెట్టే అధికారం మీకెవడిచ్చాడు?

Minister Uttam | రూ.18,250 కోట్లతో ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ప్రణాళిక

Kangana Ranaut | పనికిమాలిన మాటలు వద్దు.. మీ వల్లే నా పనితీరుపై విమర్శలు.. మండి అధికారులపై కంగన ఆగ్రహం



