Anupama Paramewaran | నిజమైన ప్రేమలో ఆప్షన్లు ఉండవు – మాజీ ప్రియుడిపై అనుపమ సెటైర్స్
లవ్ బ్రేకప్‌పై మరోసారి అనుపమ రియాక్ట్ అయ్యింది. ప్రియుడి ప్రేమలో స్వచ్ఛమైనది కాదంటూ కామెంట్లు చేసింది. నిజమైన ప్రేమలో ఆప్షన్లు ఉండవంటూ అనుపమ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Anupama Paramewaran | బ్రేకప్‌పై మరోసారి అనుపమ పరమేశ్వరన్ రియాక్ట్ అయ్యింది. ప్రియుడిపై సెటైర్లు వేసింది. చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్‌తో రెండేళ్ల ప్రేమబంధానికి మనస్పర్థల కారణంగా అనుపమ ఇటీవల వీడ్కోలు పలికింది. ధృవ్ విక్రమ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. అతడి వల్ల రెండేళ్లు ప్రతిక్షణం నరకం అనుభవించినట్లు పేర్కొన్నది. సెట్స్‌లో ఎవరితో మాట్లాడనిచ్చేవాడు కాదని, కనీసం సినిమా ప్రమోషన్లకు కూడా హాజరుకావడానికి ఒప్పుకోలేదని అన్నది. పెళ్లి చేసుకొని తనను సినిమాల నుంచి దూరం చేయాలని కుట్రలు పన్నాడని చెప్పింది. ధృవ్‌ది అపరిచితుడు సినిమాలో విక్రమ్ టైప్ మెంటాలిటీ అని కామెంట్లు చేసింది. ఆమె చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.
ఆప్షన్లు ఉండవు...
తాజాగా మరోమారు ఇన్‌డైరెక్ట్‌గాకు ధృవ్‌పై సెటైర్స్ వేసింది. శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది అనుపమ పరమేశ్వరన్. "కెరీర్, లవ్....రెండింటిలో ఏదో ఒకదానికి ఎంచుకోవాల్సివస్తే అమ్మాయిలకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు" ఓ నెటిజన్ అనుపమను ప్రశ్న అడిగింది. "నిజమైన ప్రేమలో అప్షన్లు ఉండవు. ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సిన అవసరం ఎప్పటికీ రాదు" అంటూ అనుపమ ఆ నెటిజన్ క్వశ్చన్‌కు రిప్లై ఇచ్చింది.
ప్రియుడి గురించే...
ధృవ్ విక్రమ్‌ను ఉద్దేశించే అనుపమ ఈ కామెంట్లు చేసిందని నెటిజన్లు పేర్కొంటున్నారు. అతడి ప్రేమలో నిజాయితీ లేదని చెప్పకనే చెప్పిందని అంటున్నారు. అనుపమ పరమేశ్వరన్ ఆరోపణలపై ధృవ్ విక్రమ్ కూడా రియాక్ట్ అయ్యాడు. ఈ విమర్శలు, ఆరోపణలు తనను ఏం చేయలేవని అన్నారు.
ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ తెలుగులో క్రేజీ కళ్యాణంతో పాటు భోగి సినిమాలు చేస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు పూర్తయ్యాయి. భోగితో పాటు క్రేజీ కళ్యాణంలో తెలంగాణ అమ్మాయిగా అనుపమ కనిపించబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Anupama Parameswaran | ఢీ డ్యాన్స్ షో జడ్జ్‌గా అనుపమ పరమేశ్వరన్ – బ్రేకప్ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ
ఆగస్టు 31, 2026

Onam | ఓనం పండుగకు సినీ గ్లామర్.. సంప్రదాయ లుక్‌లో హీరోయిన్ల మెరుపులు!
ఆగస్టు 26, 2026

Anupama Parameswaran | తెలుగు టీవీ షోకు జడ్జ్‌గా అనుపమ పరమేశ్వరన్ – జానీ మాస్టర్‌తో కలిసి!
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●MP Etala Rajendar | మిస్టర్ రేవంత్, పొంగులేటి! 22ఏ లో పెట్టే అధికారం మీకెవడిచ్చాడు?
- ●Minister Uttam | రూ.18,250 కోట్లతో ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ప్రణాళిక
- ●Kangana Ranaut | పనికిమాలిన మాటలు వద్దు.. మీ వల్లే నా పనితీరుపై విమర్శలు.. మండి అధికారులపై కంగన ఆగ్రహం
- ●KCR Resignation Demand | జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రాని కేసీఆర్ రాజీనామా చేయాల్సిందే
- ●Encounter | యూస్మార్గ్ ఎన్కౌంటర్.. లష్కరే కమాండర్ హతం
- ●Tollywood | ఇండియన్ సినిమా హిస్టరీలోనే లెంగ్తీ టైటిల్ ఇదే - ఆ నలుగురు డైరెక్టర్ కొత్త ప్రయోగం

MP Etala Rajendar | మిస్టర్ రేవంత్, పొంగులేటి! 22ఏ లో పెట్టే అధికారం మీకెవడిచ్చాడు?

Minister Uttam | రూ.18,250 కోట్లతో ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ప్రణాళిక

Kangana Ranaut | పనికిమాలిన మాటలు వద్దు.. మీ వల్లే నా పనితీరుపై విమర్శలు.. మండి అధికారులపై కంగన ఆగ్రహం

KCR Resignation Demand | జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రాని కేసీఆర్ రాజీనామా చేయాల్సిందే



