Apple Upgrade | యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక ఐఫోన్లను కావల్సినన్ని రోజులు అద్దెకు తీసుకోవచ్చు..
Apple Upgrade | యాపిల్ తన వినియోగదారుల కోసం యాపిల్ అప్‌గ్రేడ్ పేరుతో కొత్త డివైస్ లీజింగ్ ప్రోగ్రామ్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. బ్లూమ్‌బర్గ్‌కు చెందిన మార్క్ గుర్‌మన్ నివేదిక ప్రకారం ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంపిక చేసిన యాపిల్ డివైస్‌లను సబ్‌స్క్రిప్షన్ తరహా నెలవారీ చెల్లింపులతో ఉపయోగించే అవకాశం లభించనుంది.
Technology | Published On Jul 22, 2026, 4.51 pm IST
Apple Upgrade | యాపిల్ తన వినియోగదారుల కోసం యాపిల్ అప్‌గ్రేడ్ పేరుతో కొత్త డివైస్ లీజింగ్ ప్రోగ్రామ్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. బ్లూమ్‌బర్గ్‌కు చెందిన మార్క్ గుర్‌మన్ నివేదిక ప్రకారం ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంపిక చేసిన యాపిల్ డివైస్‌లను సబ్‌స్క్రిప్షన్ తరహా నెలవారీ చెల్లింపులతో ఉపయోగించే అవకాశం లభించనుంది. ఈ యాపిల్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌లో ఎక్కువ శాతం ఐఫోన్, మాక్, ఐప్యాడ్, యాపిల్ వాచ్ మోడళ్లకు మద్దతు ఉండనుంది. ఈ పథకానికి క్లార్నా గ్రూప్ ఆర్థిక భాగస్వామిగా వ్యవహరించనుంది. వినియోగదారులు ప్రతి నెలా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అలాగే గడువు పూర్తికాకముందే డివైస్ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకోవచ్చు, లీజ్ ముగిసేలోపే కొత్త మోడల్‌కు అప్‌గ్రేడ్ కావచ్చు, లీజ్ కాలం పూర్తయ్యాక డివైస్‌ను తమ వద్దే ఉంచుకోవచ్చు లేదా తిరిగి అప్పగించవచ్చు. కొన్ని లావాదేవీలకు అదనపు ఛార్జీలు కూడా ఉండే అవకాశం ఉంటుందని నివేదిక పేర్కొంది.
డివైస్ ను బట్టి మారనున్న లీజ్ కాల పరిమితి..
ఈ ప్రోగ్రామ్‌లో లీజ్ కాలపరిమితి డివైస్‌ను బట్టి మారనుంది. ఐఫోన్, యాపిల్ వాచ్ లకు 24 నెలల లీజ్ ఉండగా, మాక్, ఐప్యాడ్ లకు 36 నెలల లీజ్ వ్యవధి ఉండనుంది. ఈ పథకంలో చేరే ముందు వినియోగదారులు సాఫ్ట్ క్రెడిట్ చెక్ ద్వారా ఆమోదం పొందాల్సి ఉంటుంది. కొత్త యాపిల్ అప్‌గ్రేడ్ సేవ ప్రారంభమైన తర్వాత ప్రస్తుతం ఉన్న ఐఫోన్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ తో పాటు సాధారణ ఫైనాన్సింగ్ ఎంపికల్లో కొత్త నమోదు ప్రక్రియను యాపిల్ నిలిపివేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఐఫోన్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌తో పోలిస్తే, కొత్త ప్లాన్‌లో యాపిల్‌కేర్ సేవ ఉండదని సమాచారం. అయితే అన్ని ఉత్పత్తులు ఈ ప్రోగ్రామ్‌లో ఉండవు. యాపిల్ వాచ్ ఎస్‌ఈ, ఎంట్రీ లెవల్ ఐప్యాడ్, ఐఫోన్ 16, మ్యాక్‌బుక్ నియో మోడళ్లు ఈ పథకం పరిధిలోకి రావని తెలుస్తోంది. అలాగే వ్యాపార సంస్థలు, విద్యాసంస్థల కొనుగోళ్లకు కూడా ఈ ఆఫర్ వర్తించదని నివేదిక వెల్లడించింది.
ఎప్పటి నుంచి, ఎక్కడ..
గతంలో యాపిల్ స్వయంగా హార్డ్‌వేర్ సబ్‌స్క్రిప్షన్ సేవను ప్రారంభించాలని ప్రయత్నించినప్పటికీ, 2024లో ఆ ప్రణాళికను రద్దు చేసింది. ఇప్పుడు క్లార్నాతో భాగస్వామ్యం ద్వారా డివైస్ లీజింగ్ సేవను అందించడం వల్ల ఆర్థిక బాధ్యతను నేరుగా భరించాల్సిన అవసరం ఉండదని భావిస్తోంది. యాపిల్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ జూలై 28 నుంచి అమెరికాలో ప్రారంభం కానుంది. ప్రారంభ దశలో యాపిల్ రిటైల్ స్టోర్లు, ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఈ సేవ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఐఫోన్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌లో ఉన్న వినియోగదారులను కొత్త లీజింగ్ ప్రోగ్రామ్‌కు ఎలా మారుస్తారు లేదా వారిపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. అలాగే ఇతర దేశాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చే విషయంపైనా యాపిల్ స్పష్టతను ఇవ్వలేదు.
సంబంధిత వార్తలు

WhatsApp | వాట్సాప్ అప్డేట్.. ఐప్యాడ్ రిజిస్ట్రేషన్ నుంచి మ్యూజిక్ స్టేటస్ వరకు కొత్త ఫీచర్లు..
జులై 25, 2026

iPad Vs Laptop | ఐప్యాడ్, ల్యాప్‌టాప్.. రెండింటిలో ఏది ఉత్తమ ప్రదర్శన ఇస్తుంది.. దేన్ని కొనాలి..?
జులై 23, 2026

Apple | ఎన్విడియాను వెనక్కి నెట్టిన యాపిల్.. ప్రపంచంలోనే నంబర్ వన్ సంస్థగా మళ్లీ సెటిల్..
జులై 18, 2026
తాజావార్తలు
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత
- ●Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం
- ●Pralhad Joshi Education Minister | ధర్మేంద్ర ప్రధాన్ ఔట్.. కేంద్ర నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి
- ●IND Vs ZIM | జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. అయ్యర్ కెప్టెన్ తొలి సిరీస్ కైవసం..
- ●Sreemukhi | శ్రీముఖి క్యూట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!

Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!

Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత

Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం

Pralhad Joshi Education Minister | ధర్మేంద్ర ప్రధాన్ ఔట్.. కేంద్ర నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి



