Telegram App | టెలిగ్రామ్ యాప్ సరిగ్గా పనిచేయడం లేదా.. ఈ సూచనలు పాటించండి..
Telegram App | నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రాల లీక్, తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధం ముగియడంతో టెలిగ్రామ్ సేవలను మళ్లీ పునరుద్ధరించారు. జూన్ 22 అర్ధరాత్రితో నిషేధం ముగియగా, మంగళవారం ఉదయం నుంచి గూగుల్ టెలిగ్రామ్ యాప్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చింది.
Technology | Published On Jun 23, 2026, 12.49 pm IST
Telegram App | నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రాల లీక్, తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధం ముగియడంతో టెలిగ్రామ్ సేవలను మళ్లీ పునరుద్ధరించారు. జూన్ 22 అర్ధరాత్రితో నిషేధం ముగియగా, మంగళవారం ఉదయం నుంచి గూగుల్ టెలిగ్రామ్ యాప్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చింది. కొంతమంది ఇప్పటికే ఉన్న వినియోగదారులు నిషేధం ఎత్తివేయకముందే యాప్‌ను ఉపయోగించగలిగినప్పటికీ, యాపిల్ వినియోగదారులకు టెలిగ్రామ్ యాప్ ఉదయం 11 గంటల వరకు యాప్ స్టోర్‌లో కనిపించలేదు. ప్రస్తుతం టెలిగ్రామ్ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ సాధారణంగా పనిచేస్తోంది. అయితే ఇంకా కొందరు వినియోగదారులు టెలిగ్రామ్‌ను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారు కొన్ని సులభమైన సూచనల ద్వారా తమ టెలిగ్రామ్ ఖాతాను మళ్లీ ఎప్పటిలా ఉపయోగించుకోవచ్చు.
ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు..
ఆండ్రాయిడ్ వినియోగదారులు ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్స్ విభాగంలో టెలిగ్రామ్‌ను వెతకాలి. అందులో లోపలికి వెళ్తే ఫోర్స్ స్టాప్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే యాప్ పూర్తిగా క్లోజ్ అవుతుంది. తరువాత యాప్‌ను మళ్లీ ఓపెన్ చేయాలి. దీంతో యాప్ ఎప్పటిలా పనిచేస్తుంది. స్ట్రక్ అవడం ఉండదు. ఐఫోన్ వినియోగదారులు ముందుగా యాప్ స్టోర్‌లో టెలిగ్రామ్‌కు కొత్త అప్‌డేట్ అందుబాటులో ఉందో లేదో పరిశీలించి, ఉంటే అప్‌డేట్ చేయాలి. అనంతరం యాప్ స్విచర్ ద్వారా టెలిగ్రామ్‌ను పూర్తిగా క్లోజ్ చేసి, మళ్లీ ప్రారంభించాలి. కొద్దిసేపు వేచి ఉన్నాక యాప్‌ను ఓపెన్ చేస్తే కనెక్షన్ మెరుగై తిరిగి ఎప్పటిలా పనిచేస్తుంది.
మెసేజ్ ఎడిటింగ్ ఉండదు..
అయితే టెలిగ్రామ్‌లో మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను జూన్ 30 వరకు నిలిపివేసినందున యూజర్లు తాము పంపిన మెసేజ్‌లను ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదు. అందువల్ల ఈ ఒక్క ఫీచర్ తప్ప యథావిధిగా టెలిగ్రామ్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ ఎందులో అయినా సరే టెలిగ్రామ్ యాప్ హ్యాంగ్ అవుతుంటే యాప్‌ను పూర్తిగా తొలగించి ఫోన్‌ను రీస్టార్ట్ చేసి ఆ తరువాత మళ్లీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తే ఏవైనా సమస్యలు ఉంటే ఆటోమేటిగ్గా సాల్వ్ అవుతాయి. యాప్ అంతకు ముందు లాగే పనిచేస్తుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●CM Vijay | నటుడి పార్టీ అన్నారు.. రాజకీయాలు ఇంత క్రూరమా..? : అసెంబ్లీలో విజయ్ కీలక ప్రసంగం
- ●ITR Filing | ఐటీఆర్ ఫైలింగ్ సులభమే.. తొలిసారి రిటర్న్స్ దాఖలు చేసేవారికి పూర్తి గైడ్..
- ●Trisha | దళపతి విజయ్‌తో బంధానికి చెన్నై క్వీన్ తెగతెంపులు? - సీఎంను అన్‌ఫాలో చేసిన త్రిష
- ●Vijay-Trisha | విజయ్ - త్రిష బంధానికి బ్రేకప్ పడిందా..? నెట్టింట కొత్త చర్చ
- ●Micro Plastics | తాగునీటిలో మైక్రోప్లాస్టిక్స్.. ఆర్వో ప్యూరిఫైయర్స్ అవసరం అంటున్న నిపుణులు..
- ●Basara Temple | బాసర ఆలయంలో భారీ చోరీ.. అమ్మవారి కిరీటం ఎత్తుకెళ్లిన దొంగలు

CM Vijay | నటుడి పార్టీ అన్నారు.. రాజకీయాలు ఇంత క్రూరమా..? : అసెంబ్లీలో విజయ్ కీలక ప్రసంగం

ITR Filing | ఐటీఆర్ ఫైలింగ్ సులభమే.. తొలిసారి రిటర్న్స్ దాఖలు చేసేవారికి పూర్తి గైడ్..

Trisha | దళపతి విజయ్‌తో బంధానికి చెన్నై క్వీన్ తెగతెంపులు? - సీఎంను అన్‌ఫాలో చేసిన త్రిష

Vijay-Trisha | విజయ్ - త్రిష బంధానికి బ్రేకప్ పడిందా..? నెట్టింట కొత్త చర్చ





