Ayushman Card | ఇంటి నుంచే ఆయుష్మాన్ కార్డు.. వాట్సాప్‌లో ఇలా పొందండి..
Ayushman Card | ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ప్రయోజనాలు పొందాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా ఆయుష్మాన్ కార్డు పొందాలి. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీ లభిస్తుంది. ఈ పథకం కింద చికిత్స నగదు రహితంగా అందుతుంది. అయితే అర్హత ఉన్నప్పటికీ చాలామంది ఇప్పటివరకు ఆయుష్మాన్ కార్డు పొందలేదు.
Technology | Published On Aug 12, 2026, 5.37 pm IST
Ayushman Card | ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ప్రయోజనాలు పొందాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా ఆయుష్మాన్ కార్డు పొందాలి. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీ లభిస్తుంది. ఈ పథకం కింద చికిత్స నగదు రహితంగా అందుతుంది. అయితే అర్హత ఉన్నప్పటికీ చాలామంది ఇప్పటివరకు ఆయుష్మాన్ కార్డు పొందలేదు. ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకుంటే ఇంటి నుంచే వాట్సాప్ ద్వారా ఆయుష్మాన్ కార్డు పొందవచ్చు.
ఎలా పొందాలి..
ఇంటి నుంచే ఆయుష్మాన్ కార్డు పొందాలనుకునేవారు ముందుగా తమ ఫోన్‌లో వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం ఆయుష్మాన్ సారథి వాట్సాప్ చాట్‌బాట్‌ను ఉపయోగించాలి. ఇందుకోసం ఫోన్‌లో +91 72908 23838 నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ నంబర్‌కు వాట్సాప్‌లో ఏదైనా సందేశం పంపాలి. ఉదాహరణకు హాయ్ అని పంపవచ్చు. అనంతరం అందులో లభించే వివిధ సేవలను ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది. అందులో ఆయుష్మాన్ కార్డు అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత పీఎంజేఏవై కార్డు కోసం దరఖాస్తు అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. నమోదిత మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ ఉపయోగించి లాగిన్ ప్రక్రియను పూర్తి చేయాలి. అనంతరం ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయుష్మాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఆయుష్మాన్ యోజన లబ్ధిదారులుగా ఉన్నప్పటికీ కార్డు పొందని వారు కూడా ఇదే విధానాన్ని అనుసరించి ఇంటి నుంచే తమ ఆయుష్మాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్ ద్వారా కూడా..
ప్రధానమంత్రి ఆయుష్మాన్ యోజన పరిధిలోకి వచ్చే ఆసుపత్రులను సందర్శించడం ద్వారా కూడా ఆయుష్మాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అధికారిక వెబ్‌సైట్ www.beneficiary.nha.gov.in ద్వారా కూడా ఆయుష్మాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అధికారిక వెబ్‌సైట్‌లో ప్రక్రియను పూర్తి చేసేందుకు ఆధార్ నంబర్, నమోదిత మొబైల్ నంబర్ అవసరం అవుతాయి. ఈ విధానం ద్వారా కూడా ఇంటి నుంచే డిజిటల్ ఆయుష్మాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా అనేక మంది లబ్ధిదారులు నగదు రహిత వైద్య చికిత్స పొందుతున్నారు. ఈ పథకానికి అర్హతను సామాజిక-ఆర్థిక, కుల గణన 2011 గణాంకాల ఆధారంగా నిర్ణయిస్తారు. దీంతోపాటు 70 ఏళ్లకు పైబడిన వయసున్న వారు కూడా ఆయుష్మాన్ కార్డు పొందేందుకు అర్హులే.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Health Insurance | హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా..బిల్లుపై 10 శాతం భరించాల్సిందే..?
అక్టోబర్ 5, 2026

Health Insurance | పోలియో గురించి చెప్పలేదని.. ముఖ్యమంత్రి మామను ముప్పుతిప్పలు పెట్టిన బీమా సంస్థ
జులై 25, 2026

Ayushman Card | ఒక్క వాట్సాప్ మెసేజ్‌తోనే ఆయుష్మాన్ కార్డు.. కేంద్ర ప్రభుత్వ కొత్త సౌకర్యం..
జులై 13, 2026
తాజావార్తలు
- ●Ramayana | రామాయణ సెట్లో అగ్నిప్రమాదం - నిలిచిపోయిన బాలీవుడ్ సినిమా షూటింగ్‌లు
- ●Form 6 Supreme Court | ఫారం-6 మార్పులకు మేం ఓకే చెప్పలేదు: ఎన్నికల సంఘం వాదనను కొట్టిపారేసిన సుప్రీంకోర్టు
- ●ACP Suspend | అవినీతి ఆరోపణలు.. డ్యూటీలో చేరగానే ఏసీపీపై వేటు
- ●Jailer 2 Trailer | టైగర్ ముత్తువేల్ ఈజ్ బ్యాక్ - యాక్షన్ విత్ వయలెన్స్ - రజనీకాంత్ జైలర్ 2 ట్రైలర్ రిలీజ్
- ●ACB Raids | ప్రైవేట్ ఆసుపత్రి తెరిచేందుకు రెండు లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన డీఎంహెచ్‌వో
- ●TGSRTC MahaLakshmi Scheme | దూసుకెళ్తున్న 'మహాలక్ష్మి': 3 నెలల్లోనే 35.65 కోట్ల మహిళల ప్రయాణం

Ramayana | రామాయణ సెట్లో అగ్నిప్రమాదం - నిలిచిపోయిన బాలీవుడ్ సినిమా షూటింగ్‌లు

Form 6 Supreme Court | ఫారం-6 మార్పులకు మేం ఓకే చెప్పలేదు: ఎన్నికల సంఘం వాదనను కొట్టిపారేసిన సుప్రీంకోర్టు

ACP Suspend | అవినీతి ఆరోపణలు.. డ్యూటీలో చేరగానే ఏసీపీపై వేటు

Jailer 2 Trailer | టైగర్ ముత్తువేల్ ఈజ్ బ్యాక్ - యాక్షన్ విత్ వయలెన్స్ - రజనీకాంత్ జైలర్ 2 ట్రైలర్ రిలీజ్



