Revanth Reddy | గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల జీవిత బీమా.. గుర్తింపు కార్డులిచ్చి ఆదుకుంటాం: సీఎం రేవంత్
Revanth Reddy | గిగ్ వర్కర్ల కష్టానికి చట్టబద్ధమైన ఆదాయం లభించట్లేదని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. రాహుల్ గాంధీ చేతులమీదుగా గిగ్ వర్కర్ల చట్టాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు.
Revanth Reddy | త్రినేత్ర న్యూస్: గిగ్ వర్కర్ల కష్టానికి చట్టబద్ధమైన ఆదాయం లభించట్లేదని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. రాహుల్ గాంధీ చేతులమీదుగా గిగ్ వర్కర్ల చట్టాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా గిగ్ వర్కర్లకు (Gig Workers ) పథకాన్ని అంకితం చేస్తున్నామన్నారు. హైదరాబాద్ హైటెక్స్ సమీపంలో ఉన్న జయభేరీ గ్రౌండ్‌లో జరుగుతున్న గిగ్ వర్కర్స్ సభలో గిగ్ వర్కర్ల పథకాన్ని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. 2023లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాహుల్ గాంధీ పేదల కష్టాలను తెలుసుకున్నారు. పాదయాత్రలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో ఆయనను కలిసిన గిగ్ వర్కర్లు తమ సమస్యలను వివరించారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, గిగ్ వర్కర్స్ రక్షణ కోసం చట్టం తీసుకువస్తామని నాడు మాట ఇచ్చారని గుర్తుచేశారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే నిలబెట్టుకుంటుందని చెప్పారు. ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబ వారసుడిగా రాహుల్ గాంధీ చేతుల మీదుగా గిగ్ వర్కర్స్ చట్టం ఈ రోజు అమలవుతుందన్నారు.
గిగ్ వర్కర్లకు ప్రభుత్వం రూ.5 లక్షల జీవిత బీమా (Life Insurance) అమలు చేస్తుందని, గిగ్ వర్కర్ల ఆరోగ్య భద్రత కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షలు అమలు చేస్తామన్నారు. గిగ్ వర్కర్స్ బోర్డును ఏర్పాటు చేశామని, గుర్తింపు కార్డులు ఇచ్చి ఆదుకుంటామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ మాట ఇస్తే సువర్ణాక్షరాలతో లిఖించినట్లేనని చెప్పారు. ఆయన మాట తమకు ఆదేశమని వెల్లడించారు. ఈ చట్టం అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్ వర్కర్స్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గిగ్ వర్కర్స్ తరపున రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలియజేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Flight Outage | అమెరికాలో నిలిచిన విమాన సేవలు.. సాయంత్రానికి సాధారణ స్థితికి!
- ●Karthika Brahmotsavam | అరుణాచల క్షేత్రానికి కార్తీక శోభ.. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!
- ●Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..
- ●Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!
- ●Silent Heart Attack Causes | గుండెపోటు సడన్గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!

Flight Outage | అమెరికాలో నిలిచిన విమాన సేవలు.. సాయంత్రానికి సాధారణ స్థితికి!

Karthika Brahmotsavam | అరుణాచల క్షేత్రానికి కార్తీక శోభ.. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..






