WhatsApp | ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు వాట్సాప్ చాట్‌లను ఇలా ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేయండి..
WhatsApp | ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్ల మధ్య మారడం చాలా మందికి పెద్ద తలనొప్పిగా ఉంటుంది. ముఖ్యంగా వాట్సాప్ అకౌంట్‌ను డేటా కోల్పోకుండా కొత్త ఫోన్‌కు మార్చడం చాలామందికి కష్టంగా అనిపిస్తుంది. ఇప్పటివరకు ఐఫోన్‌లో ఉన్న వాట్సాప్ చాట్ ట్రాన్స్‌ఫర్ టూల్ ఉపయోగించినప్పటికీ, కొన్ని సందర్భాల్లో చాట్స్ లేదా మీడియా ఫైళ్లు మిస్సయ్యే సమస్యలు ఎదురయ్యాయి.
Technology | Published On May 25, 2026, 12.57 pm IST
WhatsApp | ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్ల మధ్య మారడం చాలా మందికి పెద్ద తలనొప్పిగా ఉంటుంది. ముఖ్యంగా వాట్సాప్ అకౌంట్‌ను డేటా కోల్పోకుండా కొత్త ఫోన్‌కు మార్చడం చాలామందికి కష్టంగా అనిపిస్తుంది. ఇప్పటివరకు ఐఫోన్‌లో ఉన్న వాట్సాప్ చాట్ ట్రాన్స్‌ఫర్ టూల్ ఉపయోగించినప్పటికీ, కొన్ని సందర్భాల్లో చాట్స్ లేదా మీడియా ఫైళ్లు మిస్సయ్యే సమస్యలు ఎదురయ్యాయి. దీంతో థర్డ్ పార్టీ టూల్స్ లేదా వర్క్ అరౌండ్స్‌ను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ కొత్త క్రాస్-ప్లాట్‌ఫామ్ చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్‌కు చాట్స్, ఫోటోలు, వీడియోలు, వాయిస్ నోట్స్, డాక్యుమెంట్లు, వాట్సాప్ ఛానెల్స్, కమ్యూనిటీస్ వంటి డేటాను సులభంగా పంపించుకోవచ్చు. ట్రాన్స్‌ఫర్ సమయంలో ముఖ్యమైన సంభాషణలు, షేర్ చేసిన కాంటాక్ట్స్ కూడా అలాగే కొనసాగుతాయి. ఈ ప్రక్రియ క్లౌడ్ సర్వర్ల ద్వారా కాకుండా రెండు డివైసుల మధ్య నేరుగా కేబుల్ లేదా లోకల్ వై-ఫై కనెక్షన్ ద్వారా జరుగుతుంది. దీంతో యూజర్ల డేటాను వాట్సాప్ కూడా యాక్సెస్ చేయలేదని కంపెనీ చెబుతోంది. అయితే, ముందుగా ఐక్లౌడ్‌లో బ్యాకప్ తీసుకుని ఉంటే ఆ కాపీ మాత్రం వేరుగా అలాగే ఉంటుంది.
వీటిని గుర్తుంచుకోవాలి..
డేటా పరిమాణాన్ని బట్టి ట్రాన్స్‌ఫర్ పూర్తి కావడానికి సమయం మారుతుంది. పెద్ద చాట్ హిస్టరీ ఉంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్‌ను యాక్టివేట్ చేయకముందే ఈ ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఇప్పటికే యాప్ సెటప్ చేసి ఉంటే, వాట్సాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. పాత చాట్స్‌ను కొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఇప్పటికే ఉన్న చాట్స్‌తో మర్జ్ చేయడం సాధ్యం కాదు. అలాగే కొత్త ఫోన్ నంబర్‌కు నేరుగా చాట్ ట్రాన్స్‌ఫర్ చేయలేరు. ముందుగా పాత డివైస్‌లోనే నంబర్ మార్చుకోవాలి. వాట్సాప్ బిజినెస్ చాట్స్, స్టేటస్ అప్‌డేట్స్, పీర్-టు-పీర్ పేమెంట్ మెసేజెస్ ప్రస్తుతం ట్రాన్స్‌ఫర్‌కు సపోర్ట్ చేయడం లేదు.
ఈ స్టెప్స్ పాటించాలి..
ట్రాన్స్‌ఫర్ పూర్తయ్యాక కూడా పాత ఐఫోన్‌లో డేటా అలాగే ఉంటుంది. యూజర్ స్వయంగా డిలీట్ చేయకపోతే లేదా వాట్సాప్ అన్‌ఇన్‌స్టాల్ చేయకపోతే ఆ డేటా తొలగదు. ఇక వాట్సాప్‌లో చాట్స్ ట్రాన్స్‌ఫర్ చేసేందుకు పలు స్టెప్స్ పాటించాల్సి ఉంటుంది. ముందుగా ఐఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి చాట్స్ లో ఉండే ట్రాన్స్ ఫర్ చాట్ హిస్టరీలోని ట్రాన్స్‌ఫర్ టు ఆండ్రాయిడ్‌కు వెళ్లాలి. ప్రిపరేషన్ పూర్తయ్యాక కంటిన్యూపై ట్యాప్ చేయాలి. అవసరమైతే కెమెరా యాక్సెస్‌కు అలో ఇవ్వాలి. ట్రాన్స్‌ఫర్ పూర్తయ్యే వరకు ఐఫోన్ ను అన్‌లాక్‌లో ఉంచాలి. ఇప్పుడు కొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి అదే ఫోన్ నంబర్‌తో వెరిఫై చేయాలి. కనెక్షన్ కోసం అనుమతి అడిగితే అలో ఇవ్వాలి. ఐఫోన్ కెమెరాతో ఆండ్రాయిడ్ ఫోన్‌లో కనిపించే క్యుఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. వై-ఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ కావాలని అడిగితే జాయిన్ పై ట్యాప్ చేసి ట్రాన్స్‌ఫర్ ప్రారంభించాలి. ప్రక్రియ పూర్తయ్యాక ఆండ్రాయిడ్ ఫోన్‌లో నెక్ట్స్ పై ట్యాప్ చేస్తే అన్ని చాట్స్ కనిపిస్తాయి. ఇక కొత్త ఫోన్‌లో వాట్సాప్‌ను కొనసాగించవచ్చు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..
- ●India-Pakistan Border | విద్యుత్‌దీపాలతో వెలుగులీనుతున్న ఇండోపాక్ బోర్డర్.. ఆకట్టుకుంటున్న వీడియో

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?






