త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Seethakka | తాగునీటి అవ‌సరాల‌కు రూ. 120 కోట్లు మంజూరు

Minister Seethakka | ఎల్ నినో నేప‌థ్యంలో తాగునీటి ఎద్ద‌డిని నివారించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం ప్ర‌త్యేక నిధుల‌ను మంజూరు చేసింద‌ని గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి సీత‌క్క వెల్ల‌డించారు.

S

Telangana | Published On Oct 31, 2026, 3.23 pm IST

Minister Seethakka | తాగునీటి అవ‌సరాల‌కు రూ. 120 కోట్లు మంజూరు
Advertisement

ప‌లు జిల్లాలకు రూ. కోటి చొప్పున మంజూరు
తాగునీటి స‌ర‌ఫ‌రా ఇంజినీర్ల‌తో మంత్రి సీత‌క్క టెలికాన్ఫ‌రెన్స్

Minister Seethakka | త్రినేత్ర న్యూస్ : ఎల్ నినో నేప‌థ్యంలో తాగునీటి ఎద్ద‌డిని నివారించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం ప్ర‌త్యేక నిధుల‌ను మంజూరు చేసింద‌ని గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి సీత‌క్క వెల్ల‌డించారు. సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి అవసరాల కోసం రూ.120 కోట్లు, ఇతర జిల్లాల్లో తక్షణ అవసరాల కోసం రూ.కోటి చొప్పున ప్రభుత్వం ఆమోదించిందని పేర్కొన్నారు. ఈ నిధులతో అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వేగవంతం చేసి, ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై శనివారం ఉదయం మిషన్‌ భగీరథ, పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీర్లతో మంత్రి సీతక్క టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాల్లో స్థానిక వనరులను వినియోగించుకోవడంతో పాటు, అవసరమైన చోట బోరుబావులను అద్దెకు తీసుకోవడం, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు రవాణా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

చేతిపంపులు, సింగిల్‌ ఫేజ్‌, త్రీ ఫేజ్‌ నీటి సరఫరా పథకాలు, బావులు తదితర స్థానిక నీటి వనరులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మిషన్‌ భగీరథ సరఫరాలో అంతరాయం ఏర్పడే గ్రామాలు, భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాలను గుర్తించి, అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని స్పష్టం చేశారు. నీటి పొదుపు, ఎల్‌నినో ప్రభావంపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించారు. ఇటీవల హైదరాబాద్‌, మేడ్చల్‌, ఖమ్మం, యాదాద్రి సహా పలు ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. తాగునీటి వనరుల వద్ద ఇప్పటికే నిర్మించిన ఇంకుడు గుంతలు, మ్యాజిక్‌ పిట్లలో నీరు ఇంకేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, పురోగతిలో ఉన్న నిర్మాణాలను రెండు రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి సీత‌క్క‌ ఆదేశించారు.

ట్యాగ్స్:

Drinking WaterMinister SeethakkaSinguru ProjectTelangana
Advertisement
Advertisement