Advanced Protection | ఆండ్రాయిడ్ 16లో కొత్త ఫీచర్.. దీన్ని ఆన్ చేస్తే మీ ఫోన్‌ను ఎవరూ హ్యాక్ చేయలేరు..
Advanced Protection | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌లో అనేక వినూత్నమైన ఫీచర్లను అందిస్తోంది. కేవలం డిజైన్ పరంగానే కాకుండా, సెక్యూరిటీ విషయంలోనూ మెరుగైన ఫీచర్లను అందిస్తోంది. ఆండ్రాయిడ్ 16.0 డివైస్‌లలో అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ అనే పేరిట కొత్త ఫీచర్‌ను ఇస్తున్నారు.
Technology | Published On May 2, 2026, 3.38 pm IST
Advanced Protection | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌లో అనేక వినూత్నమైన ఫీచర్లను అందిస్తోంది. కేవలం డిజైన్ పరంగానే కాకుండా, సెక్యూరిటీ విషయంలోనూ మెరుగైన ఫీచర్లను అందిస్తోంది. ఆండ్రాయిడ్ 16.0 డివైస్‌లలో అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ పేరిట కొత్త ఫీచర్‌ను ఇస్తున్నారు. దీని వల్ల యూజర్లు తమ డివైస్‌ను హానికర వెబ్‌సైట్లు, స్కామ్ కాల్స్, సైబర్ దాడులు వంటి ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఈ ఫీచర్‌ను యూజర్లు తమ అవసరానికి అనుగుణంగా ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు.
ఆటోమేటిగ్గా బ్లాక్..
ఆండ్రాయిడ్ 16.0 ఆపరేటింగ్ సిస్టమ్‌లో గత కొద్ది నెలల కిందటే గూగుల్ ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. క్రోమ్, మెసేజెస్, ఫోన్ యాప్‌ల సెక్యూరిటీ సెట్టింగ్స్‌కు కేంద్ర నియంత్రణలా ఈ ఫీచర్ పనిచేస్తుంది. గతంలో ప్రమాదకరమైనవిగా గుర్తించిన వెబ్ సైట్లను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది. హానికర లింకులపై హెచ్చరికలను చూపిస్తుంది. దీంతో యూజర్ ఆ లింక్‌ను ఓపెన్ చేయకుండా జాగ్రత్త వహించవచ్చు. అలాగే ఆయా బ్లాక్ అయిన సైట్లను వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉన్నవిగా చూపిస్తుంది. దీంతో యూజర్లు ఫోన్‌కు మరింత సెక్యూరిటీ కల్పించుకోవచ్చు.
యూజర్లకు అలర్ట్..
అనుమానాస్పద కాల్స్‌ను బ్లాక్ చేసే సదుపాయం ఈ ఫీచర్ ద్వారా యూజర్లకు లభిస్తోంది. ఆటోమేటిక్‌గా కాల్స్‌ను బ్లాక్ చేసి యూజర్లకు అలర్ట్‌ను పంపిస్తుంది. ఫిషింగ్ స్కామ్‌లు, డిజిటల్ అరెస్టులు వంటి మోసాలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. గూగుల్ మెసేజెస్‌లోని స్కామ్, స్పామ్ ప్రొటెక్షన్ కూడా అనవసర సందేశాలను గుర్తించి హెచ్చరిస్తుంది. అలాగే ఈ ఫీచర్ ఆన్ అయి ఉన్న ఫోన్లు తక్కువ భద్రత కలిగిన 2జీ నెట్‌వర్క్‌లకు కనెక్ట్ కాకుండా నిరోధిస్తాయి.

ఆన్ చేయాలంటే..
ఆండ్రాయిడ్ 16 ఫోన్‌లో ఈ ఫీచర్‌ను ఆన్ చేయాలంటే పలు స్టెప్స్‌ను పాటించాల్సి ఉంటుంది. ముందుగా సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయాలి. సెక్యూరిటీ అండ్ ప్రైవసీ మెనూలోకి వెళ్లాలి. అదర్ సెట్టింగ్స్ లో ఉండే అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ను ట్యాప్ చేయాలి. లేదా గూగుల్ యాప్‌లో ఆల్ సర్వీసెస్ పై క్లిక్ చేసి, పర్సనల్ అండ్ డివైస్ సేఫ్టీలో అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ను ఎంచుకోవచ్చు. తర్వాత డివైస్ ప్రొటెక్షన్ ఆప్షన్‌పై ట్యాప్ చేసి టర్న్ ఆన్ చేయాలి. ఈ దశలో ఫోన్ రీస్టార్ట్ అవ్వాలని సూచిస్తుంది. ఫోన్ రీస్టార్ట్ అవ్వగానే ఫీచర్ యాక్టివేట్ అవుతుంది.
ఆఫ్ చేయాలంటే..
ఇక ఈ ఫీచర్‌ను నిలిపివేయాలంటే సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేపి, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ మెనూలోకి వెళ్లాలి. అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ను ట్యాప్ చేయాలి. లేదా గూగుల్ యాప్ లో ఆల్ సర్వీసెస్ లోకి వెళ్లి అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ను ఎంచుకుని, డివైస్ ప్రొటెక్షన్ ను ఆఫ్ చేయాలి. ఈ సమయంలో బయోమెట్రిక్ లేదా పిన్ ద్వారా ధ్రువీకరణ అవసరం ఉంటుంది. కొన్ని సెట్టింగ్స్ రివర్ట్ కావడానికి ఫోన్‌ను రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ ఫీచర్‌ను ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 16 లో అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ఫీచర్ వినియోగదారుల డిజిటల్ భద్రతను మరింత బలోపేతం చేయడానికి అందుబాటులోకి వచ్చింది. స్కామ్‌లు, హానికర లింక్‌లు, అనుమానాస్పద కాల్స్ నుంచి రక్షణ అందిస్తూ, మొబైల్ వినియోగాన్ని సురక్షితంగా మార్చడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

HMD Vibe 2 5G | రూ.10,999కే హెచ్ఎండీ వైబ్ 2 5జి ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఎంట్రీ..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



