త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Google | గూగుల్ నుంచి కొత్త ఏఐ ఏజెంట్.. ఉద్యోగిలా పనిచేస్తుంది..

Google | ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్ సంస్థ కార్యాలయ అవసరాల కోసం కొత్త జెమిని ఏఐ ఏజెంట్‌ను ప్రకటించింది. కార్పొరేట్ కస్టమర్లను ఆకర్షించేందుకు ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలతో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో గూగుల్ ఈ కొత్త ఏఐ సాధనాన్ని తీసుకొచ్చింది.

S

Technology | Published On Oct 9, 2026, 12.24 pm IST

Google | గూగుల్ నుంచి కొత్త ఏఐ ఏజెంట్.. ఉద్యోగిలా పనిచేస్తుంది..
Advertisement

Google | ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్ సంస్థ కార్యాలయ అవసరాల కోసం కొత్త జెమిని ఏఐ ఏజెంట్‌ను ప్రకటించింది. కార్పొరేట్ కస్టమర్లను ఆకర్షించేందుకు ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలతో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో గూగుల్ ఈ కొత్త ఏఐ సాధనాన్ని తీసుకొచ్చింది. గూగుల్ తెలిపిన వివరాల ప్రకారం ఈ కృత్రిమ మేధస్సు సాధనంతో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, కంటెంట్ రూపొందించడం, కోడింగ్ చేయడం వంటి అనేక పనులు చేయవచ్చు. జెమిని ఏజెంట్ నేరుగా జీమెయిల్, డ్రైవ్, డాక్స్, క్యాలెండర్ వంటి గూగుల్ యాప్స్‌లో పనిచేస్తుంది. కొత్త ఏజెంట్‌ను సాధారణ చాట్‌బాట్‌లా కాకుండా ఒక సహోద్యోగిలా పనిచేసే విధంగా రూపొందించినట్లు గూగుల్ వెల్లడించింది. దీనికి ప్రత్యేకమైన కార్పొరేట్ గుర్తింపు ఉండడంతోపాటు, ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తే దానిని పూర్తి చేసేందుకు అనేక రోజుల పాటు పనిచేసే సామర్థ్యం ఉంటుందని తెలిపింది.

కార్పొరేట్ క‌స్ట‌మ‌ర్లే ల‌క్ష్యం..

గూగుల్ గతంలో అందించిన ఏజెంట్ సేవలు ప్రధానంగా వినియోగదారు ఇచ్చిన ఆదేశాలకు స్పందించడం లేదా ఒకే యాప్‌లో ముందుగా నిర్దేశించిన పనులను పూర్తి చేయడం వరకే పరిమితమయ్యాయి. పనికి అనుగుణంగా అత్యుత్తమ మోడల్‌ను ఎంచుకుంటుంది. ఖర్చులను నియంత్రించే వ్యవస్థలు ఇందులో అంతర్గతంగా ఉన్నాయి. ముఖ్యంగా, సంస్థలకు అవసరమైన భద్రత, నిర్వహణ, పాలన సామర్థ్యాలు ఇందులో ఉన్నాయి.. అని గూగుల్ క్లౌడ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి థామస్ కురియన్ కొత్త ఏజెంట్‌ను ప్రకటిస్తూ రాసిన బ్లాగ్‌లో పేర్కొన్నారు. కార్పొరేట్ కస్టమర్లను ఆకర్షించడమే ఈ కొత్త ఏజెంట్‌ను తీసుకురావడం వెనుక ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

ఇత‌ర సంస్థ‌ల‌తో తీవ్ర‌మైన పోటీ..

కృత్రిమ మేధస్సు మౌలిక సదుపాయాలపై గూగుల్ వందల బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. ఈ పెట్టుబడులకు తగిన ఫలితాలను సాధించేందుకు భారీ విలువ కలిగిన కార్పొరేట్ ఒప్పందాలను సంపాదించడంపై గూగుల్ దృష్టి పెట్టింది. ఇందుకోసం మైక్రోసాఫ్ట్, ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్, అమెజాన్ వంటి సంస్థలతో తీవ్ర పోటీ నెలకొంది. కాగా కృత్రిమ మేధస్సు రంగంలో అత్యాధునిక సామర్థ్యాల విషయంలో గూగుల్ ప్రత్యర్థుల కంటే వెనుకబడుతోందనే ఆందోళనలను కొందరు గూగుల్ ఉద్యోగులు వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కోడింగ్ పనుల్లో ప్రత్యర్థి సంస్థల ఏఐ మోడళ్లతో పోలిస్తే గూగుల్ సామర్థ్యాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్ తన తదుపరి మెరుగైన ఫ్లాగ్‌షిప్ కృత్రిమ మేధస్సు మోడల్ జెమిని 4 ఆర్గాన్‌ను విశ్వసనీయ సైబర్‌ సెక్యూరిటీ భాగస్వాములతో పంచుకోవడం ప్రారంభించింది. కొత్త జెమిని ఏజెంట్, రాబోయే మోడల్ సామర్థ్యాలు గూగుల్ కార్పొరేట్ ఏఐ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నంలో కీలకంగా మారే అవకాశం ఉంది.

Advertisement
Advertisement